Type Here to Get Search Results !

Vinays Info

ప్రవాస భారతీయుల దినోత్సవం(Non-Resident Indian Day) NRI Day

ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజు. జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము జరుపుకొనబడుతున్నది.

Pravasi Bharatiya Divas (ప్రవాస భారతీయుల దినోత్సవం)

2003 లో స్థాపించబడి, ఇది భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (FICCI), భారత పరిశ్రమల సమాఖ్య, నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత స్పాన్సర్ చేయబడింది. ఒక వేడుక కార్యక్రమం ఒక భారతీయ నగరంలో ప్రతి సంవత్సరం 7-9 జనవరి న జరుగుతుంది: ఇండియన్ ప్రవాసల సంబంధించిన సమస్యల నివరణ , ప్రవాసీ భారతీయ సన్మాన పురస్కారలు అందించును.

Pravasi Bharatiya Divas
Official nameप्रवासी भारतीय दिवस
Observed byMinistry of External Affairs, Government of India
SignificanceTo remember the favors and contributions made by Non Resident Indians to the welfare and development of the nation.
Date21–23 January 2019
FrequencyYearly till 2015; Biennial since then
First time2003
Related toIndian Arrival Day

ఉద్దేశ్యం:

  • భారతదేశ అభివృద్ధిలో విదేశీ భారతీయ సమాజం చేసిన కృషిని గుర్తించడం.

ఎప్పటి నుంచి?

  • ఎల్.ఎమ్. సింగ్వి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జనవరి 2002 లో ఈ దినోత్సవాన్ని సిఫారసు చేసింది.
  • 2003 నుండి 2015 వరకు ప్రతి సంవత్సరం జనవరి 09 న ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని (Non-Resident Indian Day) జరుపుకున్నారు.
  • అక్టోబర్ 2015 లో ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు.

జనవరి 09 నే ఎందుకు?
  • 1893 లో దక్షిణాఫ్రికాకు వెళ్ళిన మహాత్మా గాంధీ, 09 జనవరి 1915 న దక్షిణాఫ్రికా నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనికి గుర్తుగా ప్రవాస భారతీయుల దినోత్సవము జనవరి 09 న జరుపుకొనబడుతున్నది.

సమావేశాలు:
  • (1 వ) 2003 - న్యూఢిల్లీ (9-11 జనవరి)
  • (2 వ) 2004 - న్యూఢిల్లీ (9-11 జనవరి)
  • (3 వ) 2005 -ముంబై (7-9 జనవరి)
  • (4 వ) 2006 - హైదరాబాద్‌ (7-9 జనవరి)
  • (5 వ) 2007 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (6 వ) 2008 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (7 వ) 2009 - చెన్నై (7-9 జనవరి)
  • (8 వ) 2010 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (9 వ) 2011 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (10 వ) 2012 - జైపూర్ (7-9 జనవరి)
  • (11 వ) 2013 - కొచ్చి (7-9 జనవరి)
  • (12 వ) 2014 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (13 వ) 2015 - గాంధీనగర్ (గుజరాత్) (7-9 జనవరి)
  • (14 వ) 2017 - బెంగళూరు (7-9 జనవరి)
  • (15 వ) 2019 - ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి (21-23 జనవరి)
ప్రాంతీయ ప్రవాసి భారతీయ దివాస్ (RPBD):
విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్దిష్ట ప్రాంతాలలో భారత డయాస్పోరాతో ప్రవాస భారతీయులను కనెక్ట్ చేయడానికి, ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలను వారికి పరిచయం చేయడానికి, భారతదేశం యొక్క అభివృద్ధి మరియు వృద్ధికి తోడ్పడటానికి మరియు వారి సమస్యల పరిష్కారానికి, భారతదేశానికి వెలుపల ప్రాంతీయ ప్రావాసి భారతీయ దివాస్ (RPBD- Regional Pravasi Bharatiya Divas) ను నిర్వహిస్తుంది.
సమావేశాలు:
  • (1 వ) 2007: 24 సెప్టెంబర్, న్యూయార్క్ 
  • (2 వ) 2008: 10-11 అక్టోబర్, సింగపూర్ 
  • (3 వ) 2009: 19 సెప్టెంబర్, ది హేగ్
  • (4 వ) 2010: 1-2 అక్టోబర్, డర్బన్ (దక్షిణ ఆఫ్రికా)
  • (5 వ) 2011: 8-10 జూన్, టొరంటో (కెనడా)
  • (6 వ) 2012: 27–28 అక్టోబర్, పోర్ట్ లూయిస్ (మారిషస్)
  • (7 వ) 2013: 10–12 నవంబర్, సిడ్నీ (ఆస్ట్రేలియా)
  • (8 వ) 2014: 16–18 అక్టోబర్, లండన్ (యునైటెడ్ కింగ్‌డమ్)
  • (9 వ) 2015: 14–15 నవంబర్, లాస్ ఏంజెల్స్ (USA)
  • (10 వ) 2018: 6–7 జనవరి, (సింగపూర్)

లోగో (Logo):
ఈ లోగో బహిరంగ పోటీలో MyGov పోర్టల్ ద్వారా క్రౌడ్ సోర్స్ చేయబడింది. లోగో రూపకర్త దేబాసిష్ సర్కార్‌ (Debasish Sarkar). ఈ లోగోను 14 వ ప్రవసి భారతీయ దివాస్‌ లో చేర్చారు.
ప్రవాస భారతీయుల దినోత్సవం(Non-Resident Indian Day) NRI Day
ప్రవాస భారతీయుల దినోత్సవం(Non-Resident Indian Day) NRI Day

ప్రవాసి భారతీయ సమ్మన్ అవార్డు:
భారతదేశ వృద్ధిలో ప్రవాసి భారతీయుల పాత్రను అభినందించడానికి, వారిలో అసాధారణమైన యోగ్యత కలిగిన వ్యక్తులకు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మక ప్రవాసి భారతీయ సమ్మన్ అవార్డు (PBSA- Pravasi Bharatiya Samman Award) ను ఇస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section