Type Here to Get Search Results !

Vinays Info

National Girl Child Day - జాతీయ బాలికా దినోత్సవం

National Girl Child Day (జాతీయ బాలికా దినోత్సవం) - జనవరి 24

జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
National Girl Child Day - జాతీయ బాలికా దినోత్సవం
National Girl Child Day - జాతీయ బాలికా దినోత్సవం - January 24
జరుపుకొనేవారుభారతదేశం
ప్రారంభం2008
జరుపుకొనే రోజు24 జనవరి
లక్ష్యం: 
  • బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడం మరియు సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day) ముఖ్య లక్ష్యం.

ఎప్పటి నుంచి?

  • 2008 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 24 వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
  • ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు.
  • పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. 
  • అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.

జాతీయ బాలికా దినోత్సవం నాడు నిర్వహించే కార్యక్రమాలు :

  • సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. 
  • బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తారు.
  • సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి జరుపుకుంటారు. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం చాలా అవసరం. 
  • సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి, వివిధ రాజకీయ, కమ్యూనిటీ నాయకులు సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిలు గురించి ప్రజలకు చెప్పడం జరుగుతుంది.

భారత శిక్షాస్మృతి (IPC- Indian Penal Code):

  • సెక్షన్-315: బ్రూణ, శిశు హత్యలు నిషేధం
  • సెక్షన్-363(ఎ): పిల్లలను కిడ్నాప్ చేయడం, పిల్లలతో భిక్షాటన చేయించడం నేరం
  • సెక్షన్-366(ఎ): మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం నేరం
  • సెక్షన్-372: మైనర్ బాలికలను వేశ్యావృత్తికోసం అమ్మడం, కిరాయికి ఇవ్వడం నేరం
  • సెక్షన్-373: మైనర్ బాలికలను వేశ్యావృత్తి కోసం కొనడం, అద్దెకు తీసుకోవడం నేరం
  • సెక్షన్-376: మైనర్ బాలికపై భర్త లైంగికంగా హింసకు పాల్పడటం నేరం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section