Type Here to Get Search Results !

Vinays Info

చేతివ్రాత దినోత్సవం (Hand Writing Day)

చేతివ్రాతది నోత్సవం (Hand Writing Day) -  జనవరి 23

ఉద్దేశ్యం:

  • కంప్యూటర్లు లాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు విపరీతంగా వాడుతున్నా ఈ తరంలో చేతివ్రాతను మరచిపోకుండా, దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం రోజు ముఖ్య ఉద్దేశ్యం.


ఎప్పటి నుంచి?

  • Writing Instrument Manufacturers Association (WIMA) చేతివ్రాత దినోత్సవాన్ని 1977 నుండి జరుపుకోవడం ప్రారంభించింది. 
  • ప్రతీ ఒక్కరూ ఈ రోజును జరుపుకోకపోయినా, ఇప్పుడు దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మరియు గతంలో కంటే ఎక్కువ మంది జరుపుకుంటున్నారు.

జనవరి 23 నే ఎందుకు?

  • చేతివ్రాత దినోత్సవాన్ని జరుపుకోవడానికి అధికారిక కారణం లేదు.
  • అమెరిక స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసిన మొదటి వ్యక్తి జాన్ హాన్కాక్ (John Hancock) జన్మదినాన్ని (జనవరి 23) ఈ రోజు గుర్తుచేస్తుంది.

చేతివ్రాత అంటే?

  • పెన్, పెన్సిల్ లేదా బ్రష్ వంటి పరికరాన్ని ఉపయోగించి చేతితో రాయడం. చేతిరాత అనేది ఒక కళ.
  • ఏ ఇద్దరు వ్యక్తుల చేతిరాత కాని, చేతి వేలిముద్రలు కాని ఒకే రకంగా ఉండవు. ఈ కారణంగా, పత్రాల యొక్క ప్రామాణికతను చేతిరాత సహాయంతో చాలా మంది పరీక్షిస్తారు.
  • చేతివ్రాత విశ్లేషించుటను గ్రాఫాలజి (Graphology) అంటారు. గ్రాఫాలజీ అంటే, చేతివ్రాత యొక్క భౌతిక లక్షణాలు మరియు నమూనాల విశ్లేషణ. దీని ద్వారా రచయితను గుర్తించవచ్చు, రాసే సమయంలో ఆ వ్యక్తి మానసిక స్థితిని, వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయవచ్చు.
  • పూర్వ కాలం నుండి చేతిరాతను రాయటానికి అనేకమైన విధానాలు వాడేవారు.  తాటి ఆకుల మీద ఘంటం తో రాసేవారు.  నెమలి ఈక ను సిరాలో ముంచి రాసేవారు. అప్పట్లో కాగితం, కలం లేక వారు అలా రాసేవారు.  ఇప్పుడు అయితే కాగితములు , పెన్సిల్స్, పెన్స్ చాలా రకాలు వున్నాయి. అవి ఉపయోగించుకొని చేతిరాతను రాయండి. చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section