ప్రపంచ వినికిడి దినోత్సవం(World Hearing Day) ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహించబడుతుంది. వినికిడి లోపానికి మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.
లక్ష్యం(Aim of World Hearing Day)
- వినికిడి లోపంకు మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం ప్రపంచ వినికిడి దినోత్సవం (World Hearing Day) ముఖ్య లక్ష్యం.
చరిత్ర ( History of WHD)
- వినికిడి గురించి మానవాళికి ప్రచారం కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007, మార్చి 3న ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.
- 2016కి ముందు దీనిని అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం అని పిలిచేవారు.
- ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంధత్వం, చెవుడు నివారణ కార్యాలయం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
థీమ్ (Theme of World Hearing Day)
- 2020: జీవితానికి వినికిడి: వినికిడి లోపంతో మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి (Hearing For Life. Don’t Let Hearing Loss Limit You)
- 2019: Check Your Hearing!
- 2018: Hear The Future
- 2017: Action For Hearing Loss: Make A Sound Investment
- 2016: Childhood Hearing Loss: Act Now, Here Is How!
- 2015: Make Listening Safe
మరికొన్ని అంశాలు
- చెవి అధ్యయనం - ఓటాలజి (Otology)
- మానవ శరీరంలో అతి చిన్న ఎముక - కర్ణాంతరాస్థి (Stepes)
- చెవిలోని ఎముకల సంఖ్య - 3+3 = 6
- చెవి దగ్గర ఉండే గ్రంథులు - పెరోటిడ్ గ్రంథులు
- 85 డెసిబెల్స్ దాటితే మనిషి వినికిడి మీద దుష్పలి తాలు కలుగుతాయి. 120 డెసిబెల్స్ దాటితే చెవిలో నొప్పి మొదలవుతుంది. ధ్వని తీవ్రత ప్రమాణం - డెసిబెల్ (డెసిబెల్ అనేది బెల్ లో 1/10వ వంతు)
- ధ్వని తరంగాలు చెవిలో కర్ణభేరిని కనీసం 1/10 సెకన్ల కాలం పాటు తాకితే వినికిడి జ్ఞానం కలుగుతుంది.
- ఆరోగ్యవంతమైన మానవుడు ధ్వని తరంగాలను 20 HZ నుండి 20,000 HZ (20 KHZ) మాత్రమే వినగలడు. ఈ అవధిని శ్రవ్య అవధి అని, ఈ తరంగాలను శ్రావ్య తరంగాలు అని అంటారు.