అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (IMLD- International Mother Language Day)
ఉద్దేశ్యం(Aim of International Mother Language Day)
➤మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తించడమే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (IMLD- International Mother Language Day) ముఖ్య ఉద్దేశ్యం.
- అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.
➤ బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని, అయితే మాతృభాషను కాపాడుకుంటూనే వేరే భాషలను నేర్చుకోవాలని యునెస్కో ప్రకటించింది.
➤ ఎప్పటి నుంచి?
- 17 నవంబర్ 1999 న యునెస్కో (UNESCO- United Nations Educational, Scientific and Cultural Organization) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.
- 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
➤ ఫిబ్రవరి 21నే ఎందుకు?
- బెంగాలీ భాషా ఉద్యమం సందర్భంగా డాకాలో 1952 ఫిబ్రవరి 21 లో జరిగిన హింస మరియు హత్యల జ్ఞాపకార్థం ఈ రోజున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
➤ ప్రతిపాదన:
- కెనడాలోని వాంకోవర్‌లో నివసిస్తున్న బెంగాలీ రఫీకుల్ ఇస్లాం (Rafiqul Islam) అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని ప్రకటించడం ద్వారా ప్రపంచ భాషలను అంతరించిపోకుండా కాపాడటానికి ఒక అడుగు వేయమని కోరుతూ అతను 9 జనవరి 1998 న అప్పటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్‌కు ఒక లేఖ రాశాడు. భాషా ఉద్యమం సందర్భంగా డాకాలో 1952 ఫిబ్రవరి 21 లో జరిగిన హత్యల జ్ఞాపకార్థం రఫీకుల్ ఈ తేదీని ప్రతిపాదించాడు.
- రఫీకుల్ ఇస్లాం ప్రతిపాదనను బంగ్లాదేశ్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు మరియు నిర్ణీత సమయంలో (ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆదేశాల మేరకు) బంగ్లాదేశ్ ప్రభుత్వం యునెస్కోకు ఒక అధికారిక ప్రతిపాదనను సమర్పించింది.
- 17 నవంబర్ 1999 న యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.
➤ బెంగాలీ భాషా ఉద్యమం (Bengali Language Movement)
- అఖండ భారతం బ్రిటీష్ పాలన అనంతరం భారతదేశం మరియు పాకిస్తాన్ అను రెండు దేశాలుగా విడిపోయింది.
- పాకిస్తాన్ పశ్చిమ జోన్ ను పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి పాకిస్తాన్) అని మరియు తూర్పు జోన్ ను తూర్పు బెంగాల్ లేద తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) అని పిలిచేవారు.
- తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది.
- 1948 లో పాకిస్తాన్ ఉర్దూ (Urdu) ను జాతీయ భాషగా గుర్తించడంతో, బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది.
- ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు మరియు ఇతర రాజకీయ కార్యకర్తలు ఈ చట్టాన్ని ధిక్కరించి 21 ఫిబ్రవరి 1952 న ఉద్యమాన్ని నిర్వహించారు.
- ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది.
- పోలీసులు జరిపిన కాల్పుల్లో ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు (సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్ మరియు షఫియూర్) ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మందికి పైగా గాయాలయ్యాయి. అయినా ఉద్యమం ఆగలేదు. మరింత తీవ్రరూపం దాల్చింది.
- చివరికి 1956 ఫిబ్రవరి 29 న పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూతో పాటు బెంగాలీ భాషకు కూడా అధికారిక హోదాను ఇచ్చింది.
➤ మరికొన్ని అంశాలు:
- ఐక్యరాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ 2008 ను అంతర్జాతీయ భాష సంవత్సరం (International Year of Languages) గా ప్రకటించింది.
Tags: International Mother Language Day 2022 theme,International Mother Language day themes,mothers language day history in telugu,international mother language day - wikipedia,International Mother Language Day theme 2021, International Mother Language Day activities, What is the purpose of un's international mother language day, history of International Mother Language Day in telugu