కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం(Leprosy Prevention Day) : జనవరి 30
- కుష్టు వ్యాధిబారిన పడిన ప్రజల సంరక్షణ కోసం మహాత్మా గాంధీ చేసిన నిస్వార్థ ప్రయత్నాలు మరియు పడిన శ్రమను గుర్తుగా ఆయన వర్ధంతి అయిన 30 జనవరిని కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు.
- కుష్టు లేదా కుష్ఠు వ్యాధి ( Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు.
- ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘవ్యాధి.
- క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది.
- దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.
లక్ష్యం:-
- ప్రజలలో కుష్టు వ్యాధిపై అవగాహన పెంచేందుకు
- ఆ వ్యాధి బారినపడ్డ వారికి అవసరమైన మేరకు సాధారణ మరియు ఉచిత చికిత్సఅందించడానికి
- వ్యాధి బారినపడిన వ్యక్తికి చర్మంపై వచ్చే పుళ్ళు మరియు నరాల బలహీనత వల్ల భౌతిక లోపాల విషయంలో మానసిక ధైర్యం పెంపొందించడానికి
- వ్యాధి బారినపడిన వారందరికీ అవసరమైన శ్రద్ధ, చికిత్స మరియు పునరావాసం అందుతుందో లేదో నిర్ధారించేందుకు
- వ్యాధి వ్యాప్తి రేటు పెరుగుదల లేదు తరుగు అంచనా వేసేందుకు
కుష్టు వ్యాధి నివారణలో భారతదేశం యొక్క విజయవంతమైన కృషి
- • 1955: జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
- 1983: జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం ప్రారంభం
- 1983: దశవారీగా బహుళ ఔషధ చికిత్స పరిచయం
- 2005: 10000 మంది జనాభాకు 0.95 మంది చొప్పున మాత్రమే ప్రాబల్యం ఉండేట్టుగా 31 డిసెంబర్ 2005 కి కుష్టు వ్యాధి నివారణ జరిగింది. కుష్టు వ్యాధిని, 10000 మంది జనాభాకు ఒకరి వరకు తగ్గించడం ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన స్థాయి.
- మార్చి 2011: ప్రాబల్యం రేటు 10000 జనాభాకు నుంచి 0.69 వద్ద నిలిచింది
- 2012 - 16 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోని 209 అధిక స్థానీయ జిల్లాలలో ప్రత్యేక చర్యలకు ప్రణాళిక
Slot machine games from the best casino players online
ReplyDeleteSlot machine game by the best casino players online. This game 대전광역 출장샵 is very 거제 출장안마 rewarding to play. It was developed for the first time, Rating: 4.4 창원 출장샵 · 2 titanium wire votes 광주 출장샵