Type Here to Get Search Results !

Vinays Info

Biology Bits

🔸» భారత వ్యవసాయ పరిశోధనా మండలి - న్యూ దిల్లీ
🔸» జాతీయ పాడి పరిశోధనా సంస్థ - కర్నాల్ (హరియాణా)
🔸» కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ - నాగపూర్
🔸» జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ - జునాగఢ్ (గుజరాత్)
🔸» భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ - బెంగళూరు
🔸భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ – బెంగళూరు
🔸» భారత చెరకు పరిశోధనా సంస్థ - లఖ్‌నవూ
🔸» కేంద్ర పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ - కాన్పూర్
🔸» కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ - మైసూర్ (కర్ణాటక)
🔸» కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ - కాసర్‌గఢ్ (కేరళ)
🔸» కేంద్ర రబ్బరు పంటల పరిశోధనా సంస్థ - తిరువనంతపురం
🔸» కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ - కోచి (కేరళ)
🔸» కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ - రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)
🔸కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ - రాజమండ్ (ఆంధ్రప్రదేశ్)
🔸» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ - కాన్పూర్
🔸» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ - భోపాల్
🔸» జాతీయ రసాయన ప్రయోగశాల - పుణె
🔸» కేంద్ర డ్రగ్ పరిశోధనా సంస్థ - లఖ్‌నవూ
🔸» కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ - చెన్నై
🔸» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ - హైదరాబాద్
🔸» సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ - హైదరాబాద్
🔸సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ – హైదరాబాద్
🔸» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) - హైదరాబాద్
🔸» జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ) - హైదరాబాద్
🔸» జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ - హైదరాబాద్
🔸జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ – హైదరాబాద్
🔸» సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కర్నాల్ (హరియాణా)
🔸» కేంద్ర ఇంధన పరిశోధనా సంస్థ - ధన్‌బాద్ (ఝార్ఖండ్)
🔸» కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధనా సంస్థ - కరైకుడి (తమిళనాడు)
🔸» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం - డెహ్రాడూన్
అతి నిద్ర వ్యాధి
[25/03, 10:47 a.m.] 🙏🏻: ట్రిపనోసోమా గాంబియన్సీ' అనే ప్రొటోజోవా జీవి వల్ల సంక్రమిస్తుంది.
* సిసి ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
* ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు:
* తీవ్రమైన తలనొప్పి, మెడ, వెన్నులోని గ్రంథులు వాయడం; కీళ్లనొప్పులు, కనురెప్పలు వాయడం; ఆకలి మందగించడం, అతిగా నిద్రరావడం, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం.
* ఈ వ్యాధి బాధితుడు చివరకు కోమా స్థితిలోకి వెళ్లిపోతారు. మరణం సంభవిస్తుంది.
* పోలియో
ఈ వ్యాధి 'ఎంటిరోవైరస్' లేదా 'పోలియోవైరస్' వల్ల సంక్రమిస్తుంది.
* ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
* ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.
* పోలియోను 'శిశు పక్షవాతం' అని కూడా అంటారు.
* జూనాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పోలియో టీకాను కనుక్కున్నాడు.
* ఇంజక్షన్ ద్వారా తీసుకునే పోలియో టీకాను 'సాల్వాక్' అంటారు.
* నోటి ద్వారా తీసుకునే చుక్కల మందును 'సాబిన్' అంటారు.
* పోలియో వల్ల చాలకనాడులు నశించిపోయి కాళ్లూ, చేతులు చచ్చుబడిపోతాయి.
* 7 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* వ్యాధి లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారం, తీవ్రమైన జ్వరం, అతిసారం, పక్షవాతం.
» జలుబు (రొంప)
'* రినో వైరస్' అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది.
* దీనికి గాలి వాహకంగా పనిచేస్తుంది.
* దీనివల్ల ముక్కు తీవ్రంగా ప్రభావితమవుతుంది.
* వ్యాధి సోకిన వ్యక్తుల శ్వాసనాళాల నుంచి ఈ వైరస్ విడుదలవుతుంది.
* ఒకటి లేదా 2 రోజుల్లో ఇది సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు: ముక్కు కారడం, తలనొప్పి, దగ్గు, కొద్దిగా జ్వరం రావడం
మశూచి
* ఈ వ్యాధినే 'స్మాల్‌పాక్స్ (Smallpox) ' లేదా 'స్పోటకం' అని అంటారు.
* 'వరియొల వైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది.
* ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

[25/03, 10:47 a.m.] 🙏🏻: ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాధికి మొదటిసారిగా టీకా మందును కనిపెట్టాడు.
* మశూచిని భారత్‌లో పూర్తిగా నిర్మూలించారు.
* వ్యాధి లక్షణాలు:
* అకస్మాత్తుగా లేదా క్రమంగా జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి.
* ఈ వ్యాధి సోకిన మూడోరోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారతాయి.
* చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారతాయి. ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి.
» రేబిస్
* ఈ వ్యాధి వల్ల 'జల భీతి' కలుగుతుంది. అందువల్ల దీన్ని 'జల భీతి' వ్యాధి అని కూడా అంటారు.
* 'రేబిస్ వైరస్' అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది.
* రేబిస్ వైరస్‌నే 'రాబ్డో వైరస్' అని కూడా అంటారు.
* కుక్క కాటు ద్వారా ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
* 2 నుంచి 16 వారాల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. వ్యాధి లక్షణాలు:
* తలనొప్పి, జ్వరం, నీటిని చూస్తే భయం, వణుకు, పక్షవాతం, వాంతులు, గొంతు వాపు.
* ఈ వ్యాధి నివారణకు 'యాంటీ రేబిస్' అనే మందును ఇస్తారు.
* యాంటీ రేబిస్‌ను లూయీపాశ్చర్ కనుక్కున్నాడు.
* ఈ వ్యాధి నివారణకు వాడే మరో మందు 'రేబీపోల్'. »
డెంగ్యూ
* ఈ వ్యాధిని ఎల్లో ఫీవర్, బ్రేక్ ఫీవర్, బోన్ ఫీవర్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.
* డెంగ్యూ వైరస్ (ఆర్బో వైరస్) ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* పగటి పూట కుట్టే 'ఎడిస్ ఈజిప్టు' అనే దోమకాటు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
* ఈ వ్యాధి వల్ల రక్తఫలకికల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది.
* 4 నుంచి 8 రోజుల్లో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాధి వస్తుంది.
* కీళ్లు, చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి. వ్యాధి లక్షణాలు:
* తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, కొన్ని రోజుల పాటు చర్మం మీద చిన్న చిన్న గుల్లలు ఈ వ్యాధి వల్ల ఏర్పడి అలాగే ఉండిపోవడం.
హెపటైటిస్
[25/03, 10:47 a.m.] 🙏🏻: హెపటైటిస్
* 'హెపటైటిస్-బి' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* 'హెప' అంటే కాలేయం అని అర్థం.
* ఇది కాలేయానికి వచ్చే వ్యాధి.
* మొదటిసారిగా హైదరాబాద్‌లోని శాంతా బయోటెక్ అనే సంస్థ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది.
* వ్యాక్సిన్ పేరు 'శాన్‌వాక్స్'. వ్యాధి లక్షణాలు:
* జ్వరం, వికారం, పచ్చకామెర్లు, కాలేయంలో వాపు.
» ఎయిడ్స్
* AIDS - Acquired Immuno Deficiency Syndrome
* AIDSను కలుగచేసే వైరస్ HIV.
* HIV విస్తరణ రూపం Human Immuno Deficiency Virus.
* హ్యూమన్ టి సెల్ (ల్యూకేమియా వైరస్/రెట్రో వైరస్) ఈ వ్యాధికి కారకాలు.
* లైంగిక సంబంధాలు, రక్తం, సిరంజీలు ఈ వ్యాధి సంక్రమించడానికి దోహదం చేస్తాయి.
* రోగ నిరోధక వ్యవస్థపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
* HIV వైరస్‌ను 1983లో 'ల్యూక్ మాంటెగ్నర్' అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు.
* ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు.
* ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు: LAV - 2
* LAV - 2 విస్తరణ రూపం: Lymphadenopathy Associated Virus - 2
* 1984లో అమెరికాకు చెందిన 'రాబర్ట్ గాలో' అనే శాస్త్రవేత్త ఇదే వైరస్‌ను కనిపెట్టాడు.
* ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు 'HTLV-III'.
* 'HTLV - III' విస్తరణ రూపం Human T-Cell Lympotropic Virus-III.
* ప్రపంచంలోనే మొదటిసారిగా మానవుల్లో ఈ వ్యాధిని 1981లో అమెరికాలో కనుక్కున్నారు.
* మన దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధిని 1986లో చెన్నైలో కనుక్కున్నారు.

1987లో హైద‌రాబాద్‌లో ఈ వ్యాధి కేసు మొదటిసారిగా నమోదైంది.
* ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా.
* భారత్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.
* ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న జిల్లా గుంటూరు.
* ఈ వ్యాధి లక్షణాలు వ్యాధిని సోకిన తర్వాత 3-5 సంవత్సరాల మధ్యలో కనిపిస్తాయి.
* 20-49 సంవత్సరాల వయసువారే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.
* ఎయిడ్స్ / HIV వ్యాధి ఉన్న స్త్రీ గర్భం దాల్చితే పుట్టే శిశువుకు కూడా HIV సంక్రమిస్తుంది.
* పుట్టే శిశువుకు ఈ వైరస్ సోకకుండా వైద్యుడి పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
* HIV వైరస్ రిట్రో విరిడే అనే కుటుంబానికి చెందింది.
* HIV ఉన్న RNA 'రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్' అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది.
» వ్యాధి లక్షణాలు:
* పదేపదే జ్వరం రావడం, తరచుగా విరేచనాలు, దగ్గు, న్యూ�
[
హెర్పెస్ సింప్లెక్స్
* 'హెర్పెస్ సింప్లెక్స్' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* లాలాజలం, మలం, కలుషితమైన వస్తువులు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధి లక్షణాలు:
* చర్మంపై, శ్లేష్మపటలంపై అక్కడక్కడా బొబ్బల్లాంటి గుల్లలు.
ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ)
* 'ఆర్థోమిక్సో వైరస్' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* ఈ వ్యాధికి గాలి వాహకంగా పనిచేస్తుంది.
* కండరాలు, గొంతు, ఊపిరితిత్తులు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.
* 1, 2 రోజుల్లోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు:
* జ్వరం, కండరాల నొప్పి, గొంతు పుండు పడటం, పొడి దగ్గు.
* ఈ వ్యాధి ప్రభావంతో ఊపిరితిత్తుల మీద బ్యాక్టీరియా దాడి చేస్తుంది. ఇది 'న్యూమోనియా'కు దారితీసే అవకాశముంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section