Type Here to Get Search Results !

Vinays Info

Jyothiba Pule Birthday 11.April | vinaysinfo

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి.."జ్యోతీబా గోవిందరావ్ ఫులే " జయంతి  సందర్భంగా..
"భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త  మహారాష్ట్ర కు చెందిన సంఘ సంస్కర్త."

*■ కులం పేరుతో తరతరాలు గా, అన్నిరకాలుగా అణచివేత కుగురెైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావ్‌ గోవిందరా వు ఫూలే.*

■ ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడాడు.

*■ భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు, అమెరికా లోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారనిచెప్పినమొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో ని బానిసత్వానికి వ్యతిరేకం గా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యం గా ఫూలే ప్రకటించారు.*

■ మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్‌ 11న జోతిరావ్‌ ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనా కాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది.7 సం"ల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్య నభ్యసించాడు. తరువాత చదువుమానివేసివ్యవసాయం లో తండ్రికి సాయంగా ఉండేవాడు.

■ అతి తక్కువ కాలం పాఠశా లకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తిఎక్కు వ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురు లో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తి ని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనేఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించిఆయనవిద్యా భ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితోఫూలేపరిచయం జీవితకాల స్నేహంగామారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపెై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే.

■ జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ.శివాజి, జార్జ్‌వాషింగ్టన్‌ల జీవిత చరిత్రలుప్రభావితంచేయడం వల్ల *దేశభక్తి, నాయకత్వ గుణాలుఅలవాటయ్యాయి.*థామస్‌ రచించిన 'మానవ హక్కులు’  (రైట్స్ ఆఫ్ మాన్) పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.

*■ అమెరికా స్వాతంత్య్ర పోరాటం ఆయనను ప్రభావి తం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వంగురించి లోతుగాఆలోచింపచేసింది.* *గులాంగిరి, పూణే సత్య* *సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి'మహాత్మ 'ఫూలే ముఖ్య రచనలు.*

■ 13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన తనకుటుంబ వ్యాపార మైన పూలవ్యాపారం ప్రారంభించాడు.

■ తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ
విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైనఫూలేనుబ్రాహ్మణులు,మాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతోపెళ్ళిలో  సమా   నం గా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌర వాన్నిదెబ్బతీస్తారు. అలా అవమానించిన  బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్నిబహిర్గత పర్చాలని కంకణం కట్టుకొని

*★1848లో ఫూణేలో మొట్ట మొదటగా దళిత(అస్పృశ్యు లకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు.*

■ కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడ మే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడానికిఆయన అభ్యంతరం తెలిపాడు.

■ బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసి నదిగా సామాన్యుల్నిప్రోత్సహించాడు. సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాల ని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగాఉండాలనిముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. *1948 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశంకల్పించడం,అస్పృస్యులకు కూడా బోధించవల సి రావడంతో ఉపాధ్యాయు లెవరూముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలేతన భార్యసావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించే లాచేశాడు. పాఠశాలనిర్వహ ణ లో అనేక ఆర్థిక ఇబ్బందు లను ఎదుర్కొన్నాడు. కొంతకాలంపాఠశాలనునిర్వ హించలేకమూసివేశాడు. అయినాపట్టు వదలక తన మిత్రులెైనగోవింద్‌,వల్వేకర్‌ల సహాయం తో పాఠశాలను పునఃప్రారంభించాడు.క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. *శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు.* ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రుల కు విద్యావ్యాప్తి చేస్తూ, మరోపక్క బ్రిటిష్‌ ప్రభుత్వం  ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించే వాడు.

■ ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధార ణంగా జరిగేవి. ముసలివారికి చ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువు లయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడాని కిసమాజంఅంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివా హాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతు వులకు వివాహాలు జరిపించాడు.

*■1853లోవితంతుమహిళ ల అనాథ శిశువుల కోసం సేవాసదనంప్రారంభించాడు. ఈతరహ లో ఒక భారతీయ హిందువు ఒక సంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి.*

*■ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేత కు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడ టమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు.*

*★ఇతడు స్త్రీలకు విద్యనిషేధ మని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించాడు.*

*★మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడా లని 'త్రితీయ రత్న' అనే నాటకాన్ని రచించాడు.*

■ ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోస్జ్ అనే గ్రంథాన్ని సమాజంలో పాతుకు పోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు.

*■1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీల కు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడంఇదేమొదటిసారి* 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తతతీసుకున్నాడు.

*■1873 సెప్టెంబర్‌ 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణో ద్యమం.శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం.ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు.*

■ కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికిసభ్యత్వంకల్పించే వారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకిం చాడు. విగ్రహారాధనను ఖండిం చాడు.అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశో ధక సమాజ్ సంస్థ సారథ్యంలో *తన సహచరుడు 'N.M.లో ఖండే 'తో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం,* 12 గంటల పనిదినం, ఆదివా రం సెలవుకై  ట్రేడ్ యూనియన్‌ ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచ రణ ఉంది.

*■ 1891లో ప్రచురించిన సార్వజనిక్‌ధర్మపుస్తక్‌(ఆయన మరణాంతరం ప్రచురిత మైంది)మత, సాంఘిక విష యాలపై  ఫూలే అభిప్రాయా లను తెలియ చేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్ష ను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమ త్యంతో కూడిన సమసమాజా న్ని కాంక్షించాడు.*

■ 1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’ పుస్తకరచన చేశాడు.

*■1873లో 'గులాంగిరి’(బానిస*
*త్వం)పుస్తకం ప్రచురించాడు.*
*దీనిలో బ్రాహ్మణియ  సూత్రాలను , శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరి ని ఫూలేతులనా త్మకంగా పరిశీలించాడు.*

*■భారతదేశంలోకులంగురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయం గా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలనకావాల ని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలకి, విశ్లేషణ కి గులాంగిరి’అద్దంపడుతుంది.*

*■ దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు.మహాత్మాఫూలే ఆధునిక భార తదేశ సమాజంలో అందరి కంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాలవారి బానిసలుగా బతుకు తున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశాని కిముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డాక్టర్‌ B.R.అంబేడ్కర్‌ ప్రకటించారు.*

*★ దక్షిణాఫ్రికాజాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక మహాత్మఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’.*

■ 1880లో భారత ట్రేడ్‌యూ నియన్‌ ఉద్యమ పితామహు డు లోఖాండేతో కలసి రెైతుల ను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు.

*■ బ్రిటిష్ వలస వాదుల కు '1882లో హంటర్ కమిష న్‌కు'శూద్రాతిశూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారితో పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు*

*■ 1883కల్టివేటర్స్‌విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు.ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు.*

*★1885లో 'సత్యసారాంశం ' ప్రచురించాడు*

*■ ఇదే సయంలో ప్రచురితమై న తన హెచ్చరిక (వార్నింగ్‌) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మ ణీయ సంస్థలమీద తీవ్ర విమ ర్శలు చేశాడు.మద్యపానాన్ని వ్యతిరేకించి,1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపుల ను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు.*

*■ 1879చివర్లో'దీనబంధు  వారపత్రిక'ను ముంబయిలో స్థాపించాడు.దీనిలోరెైతులు,  కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు.*

*■ సమాజంలో వెనుకబడి న వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసిన కృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదుఇచ్చారు.దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28నకన్నుమూశాడు..*

◆అయితేనేం! కులలతో,మతాలతో  కుళ్ళిపో యిన ఈ సమాజానికి కళ్ళు తెరిపించాడు...!

◆అగ్రవర్ణాలపెత్తందారీవిధానంపై
పొరడినందుకే కాదు.... అణగారిన వర్గాల వారికీదైర్యాన్నిచ్చి,మనకొక నమ్మకాన్నికల్పించినందుకు..

◆అందుకోవయ్య అందుకో....!!
మా నీరాజనాలు...!!!💐💐

(జ:ఏప్రిల్11,1827-మ:నవంబరు28, 1890),

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section