Type Here to Get Search Results !

Vinays Info

World Book Day | ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం
◆ పుస్తకం హస్త భూషణం' - అంటే చేతికి పుస్తకాలు ఆభరణం వంటివి అని అర్థం. 

◆పుస్తకాలను గురించి "చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానీ ఒకమంచి పుస్తకం కొనుక్కో"మని కందుకూరి గారు అంటారు.

*■ ప్రఖ్యాత రచయితలు..షేక్స్‌పియర్, సర్వాంటిస్ మరియు ఇంకా గార్సిలోసో డె లా వేగా ముగ్గురూ మృతిచెందినది 1616 ఏప్రిల్ 23 రోజున. వీరికి తోడు మౌరిసె డ్రువాన్, వ్లాదిమిర్ నబొకొవ్, జోసెఫ్ ప్లా సహా అనేక రచయితల జన్మదినం లేక తుదిశ్వాస వదిలి న దినం ఇదే అయినది. ఐక్యరాజ్య సమితి విద్యా,వైజ్ఞానిక మరియు సాంస్కృతిక  సంస్థ (యునెస్కో) 1995 ప్యారిస్ సమావేశం లో పుస్తకాలకు మరియు రచయితలకు గౌరవ సమర్పణ చేయాలన్న నిర్ణయాన్ని చేపట్టడ మైనది. దానికి తోడు 'యువతరాన్ని చదువు వైపుకు ఆకర్షించే 'ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రపంచ పుస్తక మరియు రచన హక్కుల దినోత్సవంగా ఆచరిస్తూ వస్తున్నారు.*

*■ 1996 నుండి ప్రతి సం" ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక రాజధానిగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి, అక్కడి పుస్తకాలను ముద్రించే వారు.విక్రయదారులు మరియు గ్రంథాలయా ల వైపు గమనించడం ద్వారా పుస్తకాల ప్రేమను ప్రచారం చేయడం జరుగుతుంది.*

◆ 2016 సంవత్సర పుస్తక రాజధానిగా పోలెండ్‌ లోని వ్రోట్స్‌లా నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది.
◆ 2017సంవత్సర పుస్తక రాజధానిగా కొనార్కి నగరాన్ని ఎంపిక చేయడం
◆ 2018సంవత్సర పుస్తక రాజధానిగా 'ఏథెన్స్ '
నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది.

*■ నిజానికి ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞాన ప్రసారం జరగడంలో, పుస్తకాల పాత్ర ఇంతా అంతా అని చెప్పలేము. ఒకప్పుడు ఒక వ్యక్తి ఏ ఏ పుస్తకాలు చదువుతున్నాడు అనే దానిని బట్టి అతని ప్రతిభను, మేథాశక్తిని అంచనా వేసేవారు. టీవీ మాధ్యమాలు లేనికాలంలో ప్రజలకు పుస్తకాలు కేవలం కాలక్షేపానికే కాక విజ్ఞానదాయకంగా కూడా వుండేవి.*

*■ వివిధ రకాల ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రవేశంతో పుస్తకాల పట్ల, పూర్వం వున్నంత ప్రాముఖ్యత కొంత మేరకు పరిమితించబడి నప్పటికీ, పుస్తక ఉనికిని ఏ మాధ్యమం కూడా పూర్తిగా నియంత్రించ లేకపోయినాయి. అయితే ఇప్పుడు పుస్తకాలు, e-books గా కూడా రూపాంతరం చెందాయి. ఇదీ ఒకింత మంచి పరిణామమే. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పటికే పుస్తకాలను ముద్రించేం దుకు వుపయోగిస్తున్న చెట్ల సంఖ్య చాలా అధికంగా వుంది పూర్వంతో పోల్చి చూసిన ప్పుడు.కానీ e-books కొంతమేర ఈ విషయం లో సహకరిస్తున్నాయి. ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నామంటే పరోక్షంగా ఆ పుస్తక రచయితతో మనం మాట్లాడుతున్నట్లుగానే పరిగణించవచ్చు. పుస్తకంతో మానవునికి వున్న అనుబంధం ఇంతా అంతా అని చెప్పనలవి కాదు.*

*■ ఒక ప్రక్కన రాముడి జీవనం జరుగుతుండ గానే రామాయణం వ్రాశారు వాల్మీకి మహర్షి. పురాణాల్లోనే ఇలా గ్రంథస్తం చేయడం గురించి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆర్తితో సంగీతం గురించి తపిస్తున్న త్యాగరాజుగారికి 'స్వరార్ణవం' అనే సంగీత గ్రంథం అందుతుంది నారదబ్రహ్మ వల్ల. వార్తీక పద్ధతిలో(కేవల ఉత్తర ప్రత్యుత్తరాల రూపం లో)  మాండూక్య ఉపనిషత్ కు భాష్యం వ్రాశారు ఆది శంకరులు. ఇలాంటివన్నీ మనకు నేటికీ లభ్యం కాగలుగుతున్నాయి అనంటే ఆ ఖ్యాతి కేవలం పుస్తకాలది కాక మరి దేనిదౌ తుంది చెప్పండి?*

■  పుస్తకాలలో అనేక రకాలు వుంటాయి. వేదాలనుంచి వంటల పుస్తకాల దాకా ఎన్నెన్నో విభాగాలు. ఆధ్యాత్మికం, సాహిత్యం, శాస్త్ర సంబంధితం, టెక్నికల్ పుస్తకాలు, ఆరోగ్యానికి చెందినవి, చరిత్రకి చెందినవి ఇంకొన్ని, జీవిత చరిత్రలు కొన్నైతే, ఆత్మకథలు మరికొన్ని, మానసిక వికాసానికి దోహదపడేవి కొన్నైతే, మానో వైజ్ఞానిక శాస్త్రానికి చెందినవి మరికొన్ని. ఇలా పుస్తకాల గురించి ప్రస్థావిస్తూ పోతే రోజులు చాలవు.

■ పుస్తకపఠనం అనే మంచి అలవాటును తిరిగి కొనసాగించడానికి నడుం బిగించింది కేరళ లోని కోజిక్కోడ్‌కు చెందిన రజనీ.రజనీని ‘మొబైల్ లైబ్రేరియన్’ అని కూడా పిలుస్తుంటారు.

*■ ఆ మధ్య డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశంలోని ప్రతీ యూనివర్సటీ లైబ్రరీని ఆటోమైజ్ చేసి, వివిధ రకాల గ్రంథాలు అన్నీ పీడీఎఫ్ ఈ - బుక్ రూపంలో ఇంటర్నెట్ లో అందుబాటులో వుంచింది ప్రభుత్వం.*

*■ ఒక్క తెలుగు భాషలోనే సుమారు 23,257 పుస్తకాలు ఉచితంగా లభిస్తున్నాయి.* 

*■ ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగామన తెలుగు ఈ పుస్తకాలను ఈ క్రింది లింక్ సాయంతో ఒకసారి చూసేయ్యింది.*
www.dli.ernet.in/browse

🌐సేకరణ:సురేష్ కట్టా-నెల్లూర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section