Type Here to Get Search Results !

Vinays Info

Kalvakuntla Chandra Shekara Rao | కల్వకుంట్ల చంద్రశేఖర రావు

కల్వకుంట్ల చంద్రశేఖర రావు (జ: 17 ఫిబ్రవరి, 1954) భారతదేశంలోని నూతనంగా యేర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి.ఈయన కె.సి.ఆర్ గా సుపరిచితులు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు.


2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.
ఇతడు మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు.
2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాత కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు.
జీవిత విశేషాలు
కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు.
ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఎం.ఎ (తెలుగు సాహిత్యం) పూర్తి చేశారు. ఆయన ఏప్రిల్ 23 1969 న శ్రీమతి శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె. కల్వకుంట్ల కవితలు కూడా
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.కుమారుడు కె.తారకరామారావు శాసన సభ్యులుగానూ, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలుగా యున్నారు.
 విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కె.చంద్ర శేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.
1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు.ఆ తరువాత 1989,1994,1999,2001 (ఉపఎన్నిక ) లో వరుసగా ఎన్నిక అయ్యారు 1997-98లో తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా రవాణా మంత్రి పదవి లభించింది.
1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. ఆ తరువాత 2001 ఏప్రల్ 21 నాడు ప్రారంభం నుండి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రల్ 27 న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు.
2004 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందినాడు.
14వ లోక్‌సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్‌సభ సభ్యులు ఉన్న టి.ఆర్.ఎస్. తరఫున ఆలె నరేంద్రతో పాటు కె.చంద్ర శేఖరరావు మంత్రిపదవులు పొందినారు.
2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యు.పి.ఏ. కూటమికి మద్దతు కూడా ఉపసంహరించబడింది.
లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు.
2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000 పైగా మెజారిటీతో విజయం సాధించాడు.
ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మరియు వాస్తును నమ్మే వ్యక్తిగా పంటితులు చెప్పిన ప్రకారం లక్కీ నంబర్ "ఆరు" అయినందున ఈ సమయాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారు.
కాలరేఖ
1985-2004 :ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (4 సార్లు)
1987-88 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో సహాయ మంత్రి
1992-93 : అధ్యక్షుడు, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్
1997-99 : ఆంధ్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి
1999-2001 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఉప సభాపతి
2001 ఏప్రల్ 21 :తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా
2001 ఏప్రల్ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన
2004  : 14 వ లోకసభ సభ్యునిగా ఎన్నిక
2004-06 : కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి
సెప్టెంబరు 23, 2006 : లోక సభ సభ్యత్వానికి రాజీనామా
డిసెంబరు 7, 2006 : 14 వ లోక సభ ఉప ఎన్నికలో మరల ఎన్నిక
మార్చి 3, 2008 : లోక సభ సభ్యత్వానికి రాజీనామా
2009 : 15 వ లోక సభ సభ్యునిగా ఎన్నిక (2వ సారి)
లోకసభలో తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు
ఆగస్టు 31, 2009 : కమిటీ ఆన్ ఎనర్జీలో సభ్యులు
సెప్టెంబరు 23, 2009 : రూల్స్ కమిటీలో సభ్యులు
2014 : 16 వ లోకసభ సభ్యునిగా ఎన్నిక
2014 : తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యునిగా ఎన్నిక
2014 : తెలంగాణ రాష్ట్రం శాసన సభా పక్ష నాయకునిగా ఎన్నిక.
2014, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section