🔻దేశాలలోపల, దేశాలమధ్య శాంతియుత సహజీవనానికి మూలాధారమైన సూత్రం సామాజిక న్యాయం.
🔻మనం లింగ సమానత్వాన్ని లేదా స్వదేశీ ప్రజల, వలస వచ్చిన వారి హక్కుల గురించి ప్రస్తావించేటప్పుడు మనం సామాజిక న్యాయ సూత్రాలను సమర్ధిస్తున్నాం. లింగ, వయో, జాతి, ప్రాంతీయ, సాంస్కృతిక లేదా అశక్తత కారణంగా ప్రజలెదుర్కొంటున్న అవరోధాలను తొలగించాలనుకొంటున్నప్పుడు మనం సామాజిక న్యాయాన్ని ముందుకు తెస్తున్నాం.
*🔻2007లో, ఫిబ్రవరి 20ని ప్రపంచ సామాజిక న్యాయదినంగా ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రకటించింది.*
🔻సామాజిక న్యాయ దినం పాటించడంద్వారా - దారిద్య్ర నిర్మూలన, సంపూర్ణ ఉపాధి, సముచిత ఉపాధిని పెంపొందించడం లింగ సమానత్వం, అందరికీ సామాజిక సంక్షేమం, న్యాయంకోసం అంతర్జాతీయ సమాజ కృషికి తోడ్పాటునివ్వడం జరగాలి.
*🌸ఈ సందర్భంగా ప్రస్తుత ఐ.ఎల్. డైరెక్టర్ -జనరల్ గే రైడర్ సందేశాన్ని ఈ దిగువనిస్తున్నాం....*
🔻ప్రపంచం ఆర్థికంగా పూర్వస్థితిని తిరిగి చేరుకోవడం త్రాసులో అటూ ఇటూ ఊగిసలాడుతోంది. నిలకడైన పెరుగుదల, అభివృద్ధివైపు మొగ్గుచూపించేలా చేయాలంటే, దానర్ధం సామాజిక అన్యాయాన్ని పరిష్కరించడమే అవుతుంది.
🔻దీనిని 1919లో రూపొందించిన ఐ.ఎల్.ఒ. నిబంధ నావళిలో పొందుపరచిన మాటల్లో కంటే, మరింత మెరుగైన రీతిలో వ్యక్తం చేయడం సాధ్యంకాదు. అందులో ''సామాజిక న్యాయం పునాదిపైనే చిరశాంతిని భువిని నెలకొల్పుకోగలమని'' పేర్కొంది. ఈ రోజున తీవ్రమైన అన్యాయ భావన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అది అత్యంత బలహీనులను (అణగారిన వర్గాలను) మరింతగా త్యాగం చేయాలని కోరుతున్నారు. సామాజిక న్యాయం అన్నది బహుళ పరిణామాలు గలది. అయితే 19వ శతాబ్దం చివరిలోలాగే శ్రామిక ప్రపంచం అసంతృప్తి మధ్యలో వుంది. అయితే భవిష్యత్తులో మరింత భిన్నమైన మరింత న్యాయమైన ప్రపంచ వ్యవస్థను రూపొందించు కొనేందుకు అనుసరించే పరిష్కారంలో అది అంతర్గత భాగంగా వుండాలి.
🔻ఆర్థిక చోదక ప్రపంచీకరణ నమూనా, 2008 ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీసింది. ఆ క్రమంలో నిరుద్యోగం పెద్ద యెత్తున పెరిగింది. అదేగాక పాక్షిక నిరుద్యోగం, వేతన ఆదాయాల్లో, ప్రయోజనాల్లో అనేక దేశాల్లో అనుసరిస్తున్న కోతలు చోటు చేసుకున్నాయి. ఇదొక నిరాశాజనకమైన ప్రపంచ దృశ్యాన్ని మనముందుంచుతోంది.
*🔻సామాజిక, ఆర్థిక అసమానతలు వివిధ రూపాల్లో పెరిగిపోతున్నాయి.*
🔻సుమారు 20 కోట్ల మంది స్త్రీ పురుషులు నిరుద్యోగులుగా వుంటున్నారు.
*🔻అంతేగాక మరో 87 కోట్లమంది స్త్రీ పురుషులు - అంటే ప్రపంచ శ్రామిక జనా భాలో నాల్గవ వంతు - శ్రమిస్తున్నప్పటికీ రోజుకు ఒక వ్యక్తికి రెండు డాలర్ల ఆదాయంగావున్న దారిద్య్ర రేఖకు- తమను తమ కుటుంబాలను- ఎగువకు తీసుకెళ్ళలేక పోతున్నారు.*
*🔻సుమారు 7.4 కోట్ల యువజన స్త్రీ, పురుషులకు ఎలాంటి ఉపాధులు లేవు. యూరప్, ఉత్తరాఫ్రికాల్లోని అనేక దేశాల్లో నిరుద్యోగ యువత అసాధారణ స్థాయికి పెరిగిపోయింది. యువత పని లేకుండా వుంటున్న కాలం పెరిగిపోతోంది. నిరుద్యోగ యువత గాయపు మచ్చ ఒక జీవితకాలం ఉండిపోతుంది.*
*🔻యువజన స్త్రీ పురుషుల ఉపాధి లేమితో పాటు బాల కార్మిక వ్యవస్థ పెరిగిపోతోంది.*
*🔻అలాగే బలవంతపు చాకిరీ - ఉపాధి లేమి, దారి ద్య్రం ఉచ్చులనుండి బయట పడేందుకు మార్గంగా ఎంచు కొంటున్నారు. ఇళ్ళల్లో, అనేకమంది స్త్రీ పురుషులు మానవ అక్రమ రవాణా ఉచ్చులో పడిపోతున్నారు. అవి బానిస వ్యవస్థకు ఆధునిక రూపాలు.*
*🔻ప్రపంచ జనాభాలో 80 శాతం మందికి సరిపడు సామాజిక భద్రత వర్తింపు లేదు. సగానికిపైగా జనాభాకు సామాజిక భద్రత వర్తింపు అన్నది లేనే లేదు.*
*🔻అనేక రూపాల్లో వున్న వివక్షత లక్షల సంఖ్యలోని ప్రజల్ని వెనక్కిలాగుతోంది. ముఖ్యంగా మహిళలను వారు తమ శక్తి యుక్తులను తెలుసుకొంటూ, మన సమాజాల, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికిసమాన స్థాయిలో దోహద పడేందుకు అవి అవరోధంగా వుంటున్నాయి.*
🔻అనేక దేశాల్లో శ్రామిక మహిళలు, పురుషులు న్యాయాన్ని నిలబెట్టేందుకు, పని ప్రదేశాల్లో తమకు ఒక హోదాను కల్పించుకొనేందుకు తమ హక్కులను వినియో గించుకోవాలనుకొంటున్నారు. వారిని ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకోకుండా, ట్రేడ్ యూనియన్లలో చేరకుండా నిరోధిస్తున్నారు.
🔻పూర్తి ఉపాధి అవకా శాలతో, పరస్పర ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరిం త మెరుగైన రీతిలో నిర్వ హించబడే పరిస్థితివుంది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల బట్టి - వాణిజ్య రక్షణ, పోటీ కరెన్సీ విలువ తగ్గింపు. అలాగే వేతనకోతలు, ఆర్థిక కేటాయింపులలో కత్తిరింపులవంటి తమ వాణిజ్య భాగ స్వాముల ఆర్థిక ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలకు పాల్పడే ప్రమాదంవుంది. ఆర్థిక వ్యవస్థలు బలహీన పడడంతో, లోట్లు మరింత తీవ్రతరం కావడంతో సామాజిక అసమానతలు పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరినీ దారుణ పరిస్థితిలోకి నెట్టివేసే ప్రమాదం వుంది.
*🔻ఇలాంటి నిరాశాపూర్వక నేపధ్యం ఉన్నప్పటికీ అననుకూలతలను అనుకూలంగా మార్చుకోవాలనే దృఢ సంకల్పం వంటి ప్రోత్సాహక సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత అసమానమైన సమాజాలలో కొన్ని నేర్పుగల సామాజిక విధానాలతో సవాళ్ళను ఎదుర్కొం టున్నాయి. ప్రజలే కేంద్రంగాగల పూర్వస్థితిని చేరుకొనే క్రమంలో అవి కూడా ఒకరకమైన పెట్టుబడులే. ఉదా హరణకు వర్ధమాన ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో కొన్ని దేశాలు బలమైన సామాజిక భద్రతలతో, కనీస వేతన నిర్మాణ వ్యవస్థలలో మదుపు పెడుతున్నాయి. ఇప్పటికే అలాంటి విధానాలు సామాజిక అంతరాలను తగ్గించడంలో సహాయ పడుతూ, ఒకసారి మాంద్యంలో కూరుకుపోయి ఎలాగోలా కోలుకొంటున్న తరువాత తిరిగి మళ్ళీ మాంద్యంలోకి జారి పోకుండా (డబుల్ డిప్ రిసెషన్) నిలుపుచేసేందుకు తోడ్పడుతున్నాయి. ఎవరికైతే అత్యవసరమో అలాంటి వారి జేబుల్లోకి కొనుగోలు శక్తిని పెట్టగలిగితే - ముఖ్యంగా అత్యంత పెద్ద, బలమైన ఆర్థిక వ్యవస్థలు- అవి పెట్టుబడి, స్వస్థత చోదక శక్తులకు ప్రేరణ నిస్తాయి.*
🔻ఆర్థిక స్వస్థత పొందేందుకు అంతర్జాతీయ సహకారం విధానపరమైన సమన్వయానికి మధ్యలో సర్వ పరివ్యాప్త సమన్యాయమైన, నిలకడైన ప్రపంచ అభివృద్ధి గుండా ప్రయాణించాలి. ఇదొక గతిశీలమైన, పరివర్తనీయమైన క్రమం. ఒక పూర్తి ఉత్పాదకతతోకూడిన ఉపాధి కల్పనపై కేంద్రీకరించే ఉత్పాదక స్పందనగా వుండాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తోడ్పాటు నివ్వడం ద్వారా అందరికీ సముచితమైన ఉపాధిని కల్పించగలగాలి. పని ప్రదేశాల్లో మౌలిక హక్కులను గుర్తించేదిగా వుండాలి. సామాజిక సంప్రదింపుల సంస్కృతి నెలకొల్పేందుకు నిబద్ధత కూడా న్యాయమైన, సమతౌల్యమైన, సర్వపరివ్యాపిత విధానాలు రూపొందేందుకు తోడ్పడుతాయి.
*🔻సామాజిక న్యాయంకోసం ప్రపంచ పోరాటాలను ఉధృతం చేయడం సరియైన చర్య. అది కూడా మన ఉమ్మడి ప్రయోజనమే. సామాజిక న్యాయం, సబబైన ప్రపంచీకరణను సాధించుకోవడం అనే ప్రపంచ సవా లును- మనం అందిరికీ సముచిత ఉపాధి కల్పించడం ద్వారా మన నిబద్ధతను ప్రదర్శిద్దాం.*
(ఐ.ఎల్.ఒ. డైరెక్టర్ జనరల్ గే రైడర్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ సందర్భంగా పంపించిన సందే
సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)