అరుణాచల్ ప్రదేశ్,మిజోరాం రాష్ట్రాల అవతరణ దినోత్సవం నేడు..
*అరుణాచల్ ప్రదేశ్*
▪అవతరణము:20 పిబ్రవరి, 1987
▪వైశాల్యము.83,743 చ.కి.
▪జనసంఖ్య.1,382,611
▪నిష్పత్తి 1000:920
▪జిల్లాల సంఖ్య 16 ,గ్రామాలు. 3,863
▪పార్లమెంటు సభ్యుల సంఖ్య, 2
శాసన సభ్యుల సంఖ్య. 60
▪అ. ప్ర. రాజధాని -ఈటానగర్
▪ *భారత దేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం - అరుణాచల్ ప్రదేశ్.*
▪అరుణాచల్ ప్రదేశ్ పూర్వ నామం -నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ ఎజెన్సీ
▪ *భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ ఆరామం అయిన తవాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది - అరుణాచల్ ప్రదేశ్.*
▪అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ అని పిలుస్తారు.
▪ *2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప అక్షరాస్యత గల ప్రాంతం -డిబంగ్ లోయ*
▪అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు- అస్సాం, నాగాలాండ్, భూటాన్, చైనా, మయిన్మార్
▪ *అరుణాచల్ ప్రదేశ్ భారత దేశములోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయం ప్రతి పత్తప్రాంతములో భాగమని చైనా వాదన. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదము గా మిగిలిన ప్రాంతాలలో 'అక్సాయి చిన్ 'తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధి కారికముగా గుర్తించడంలేదు.*
▪తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.
---------------🌷🌷🌷-------------
*🌼మిజోరాం*
▪మిజోరాం రాష్ట్ర రాజధాని - ఐజ్వాల్ .
▪ మిజోరాం రాష్ట్ర ఆవిర్భావం - ఫిబ్రవరి 20, 1987
▪మిజోరాం ప్రధాన భాష -మిజో
▪ *భారతదేశంలో ఎక్కువ అడవులు గల రాష్ట్రం-మిజోరాం*
▪2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో 2వ స్థానం
▪ *మిజోరాం - బ్రిటిష్ వారి కాలంలో మిజోరాం పేరు- లుషాయి హిల్స్*
▪2001 జనాభా లెక్కల ప్రకారము మిజోరామ్ జనాభా సుమారు 8,90,000.
▪ *మిజోరామ్ అక్షరాస్యత 89%. ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రము.*
▪మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే.
▪ *అన్నట్లు..ఇక్కడున్నవారికి ఏ వనరు నుంచి ఆదాయం వచ్చినా ట్యాక్స్ ఉండదు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలు, సామాజిక వర్గాలకు ఆర్థిక రాయితీలు కల్పించడంలో భాగంగా ఇలా ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చారు.
సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)