-నిజాం పాలకుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక్క గురుగుంట (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి.
-ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. ఎందుకంటే జాగీర్లు నిజాం నవాబు ఇచ్చినవి, కానీ సంస్థానాలు అసఫ్‌జాహీ వంశం రాక పూర్వం ముందునుంచే ఉన్నాయి.
1. గద్వాల సంస్థానం
-మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైంది.
-గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. వీరి ఇంటిపేరు ముష్టిపల్లి.
-వీరి ప్రథమ రాజధాని పూడూరు. ఈ పూడూరు రాజపత్రాల్లో కేశవనగరంగా పేర్కొని ఉంది.
-వీరు గధ, వాలు అనే ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించడం వలన వీరు నిర్మించిన నగరానికి గదవాలు అనే పేరు వచ్చింది. కాలక్రమేన గద్వాల అయ్యింది.
-గద్వాల సంస్థానానికి ఆధ్యుడు పెద్ద సోమభూపాల్ (సోమనాద్రి).
-పెద్దన్న వీరారెడ్డి ఈ సంస్థాన స్థాపకుడు.
-గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకురాలు మహారాణి శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ.
-ఈమె కాలంలో గద్వాల సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది.
2. వనపర్తి సంస్థానం
-ఇది కూడా మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంది.
-ఈ సంస్థాన మొదటి రాజధాని నూగూరు.
-మొదటి రామకృష్ణారావు నూగూరు నుంచి రాజధానిని వనపర్తికి మార్చాడు.
-ఈ సంస్థాన పాలకుల ఇంటిపేరు జనుంపల్లి. వీరు మోటాటి రెడ్డి వంశీయులు.
-ఈ సంస్థాన మూలపురుషుడు వీరకృష్ణ భూపతి (వీరకృష్ణారెడ్డి).
-ఈ సంస్థానాధీశుల్లో మొదటి రామకృష్ణారావు ప్రసిద్ధిగాంచిన వ్యక్తి.
-ఇతనికి నిజాం ప్రభువు 1817లో రాజ బహద్దూర్ అనే బిరుదు ఇచ్చాడు.
-రామకృష్ణారావు దత్తపుత్రుడు మొదటి రాజారామేశ్వరరావు. ఇతను వనపర్తి సంస్థాన చరిత్రలో మొదటిసారిగా శాశ్వత భూమిశస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు.
-ఈ సంస్థాన చివరి పాలకుడు రాజారామేశ్వరరావు. ఈయన తల్లి సరళాదేవి.
-ఈ సంస్థానం 1948లో భారత యూనియన్‌లో విలీనమైంది.
3. అమరచింత సంస్థానం
-మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆత్మకూరు సంస్థానం అమరచింత సంస్థానంగా వర్థిల్లింది.
-ఈ సంస్థాన మొదటి రాజధాని తివుడంపల్లి.
-తరువాత రాజధానిని కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న ఆత్మకూరుకు మార్చారు.
-ఈ సంస్థాన పాలకులు పాకనాటి రెడ్డి కులస్తులు. వీరి ఇంటిపేరు ముక్కెరవారు.
-ఈ సంస్థానానికి మూలపురుషుడు గోపాల్ రెడ్డి.
-ఈ సంస్థాన పాలకుడైన పెద్ద వెంకటరెడ్డి రాజధానిని తివుడంపల్లి నుంచి ఆత్మకూరుకు మార్చాడు.
-ఈ సంస్థాన చివరి పాలకురాలు రాణి రాంభూపాల శ్రీమంత స్వయ్ రాణి భాగ్యలక్ష్మమ్మ. ఈమె శ్రీరాంభూపాల్ బల్వంత్ బహద్దూర్ భార్య.
-అమరచింత సంస్థానంలో తయారైన మస్లిన్ వస్ర్తాలు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచాయి.
4. జటప్రోలు సంస్థానం
-కొల్లాపూర్ సంస్థానంగా పిలిచే ఈ జటప్రోలు సంస్థానం మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది ఎడమ తీరాన ఉంది.
-ఈ సంస్థానాధీశులు పద్మనాయక వంశీయులు.
-వీరి ఇంటిపేరు సురభి. వీరిది రేచర్ల గోత్రం.
-ఈ సంస్థాన స్థాపకుడు పిల్లలమర్రి భేతాళరెడ్డి.
-వీరి రాజధాని జటప్రోలు. సురభి లక్ష్మణరాయలు తన రాజధానిని 1840లో జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చాడు.
-ఈ సంస్థానాన్ని పరిపాలించిన రాజా వెంటక లక్ష్మణరావును నిజాం ప్రభువు మహబూబ్‌నగర్ అలీఖాన్ అని ప్రశంసించి 1905 డిసెంబర్ 28న వంత్ బహద్దూర్ అనే బిరుదు ఇచ్చాడు.
-ఈ సంస్థాన చివరి పాలకుడు రాజా వెంకట జగన్నాథరావు.
-ఇతనికాలంలో జటప్రోలు సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది.
5. దోమకొండ సంస్థానం
-తొలుత బిక్కవోలు సంస్థానంగా పిలిచే దోమకొండ సంస్థానం నిజామాబాద్ జిల్లాలో ఉంది.
-దోమకొండ సంస్థానం కుతుబ్‌షాహీల కాలంలో ఆవిర్భవించింది.
-ఈ సంస్థానాధీశులు పాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు.
-ఈ పాలకులు కామినేని వంశీయులు. వీరిది రాచమళ్ల గోత్రం. బిక్కనూరు (బిక్కవోలు)లో వెలసిన సిద్ధరామేశ్వరుడు వీరి కులదైవం.
-ఈ సంస్థాన మూలపురుషుడు కామనేడు.
-ఈ సంస్థాన స్థాపకుడు కామినేని చౌదరి.
-దోమకొండ సంస్థాన రాజధాని బిక్కవోలు (బిక్కనూరు)ను రాజన్న చౌదరి కామారెడ్డికి మార్చాడు.
-రాజన్న చౌదరి కుమారుడు రాజేశ్వరరావు రాజధానిని కామారెడ్డి నుంచి దోమకొండకు మార్చాడు.
-దోమకొండ సంస్థానాధీశుల్లో సుప్రసిద్ధుడు రాజేశ్వరరావు.
-దోమకొండ సంస్థాన చివరి పాలకుడు రాజా సోమేశ్వరరావు.
-ఇతని కాలంలో ఈ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది.
6. పాపన్నపేట సంస్థానం
-పాపన్నపేట సంస్థానం ప్రాచీన సంస్థానాల్లో ఒకటి.
-ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్‌గా ఉన్న సమయంలో ఈ సంస్థానం ఏర్పడింది.
-మెదక్ మొత్తం పాపన్నపేట సంస్థానంలో ఉంది.
-పాపన్నపేట సంస్థాన పాలకుల్లో రాయ్‌బగాన్ రాణి శంకరమ్మ 12వ తరానికి చెందినవారు.
-నిజాం ప్రభువు రాణి శంకరమ్మ పరిపాలనాదక్షత, యుద్ధ నైపుణ్యం చూసి రాయ్‌బగాన్ బిరుదుతో సత్కరించి, రాజలాంఛనాన్ని ప్రసాదించాడు.
-రాయ్‌బగాన్ అంటే ఆడ సింహం అని అర్థం.
-సదాశివరెడ్డి (రాణి శంకరమ్మ దత్తపుత్రుడు) పాపన్నపేట సంస్థానాధీశుల్లో ప్రముఖుడు. ఇతని భార్య పార్వతి. ఈమె గద్వాల సంస్థానాధీశుని కూతురు.
-సదాశివరెడ్డి సోదరుడు సంగారెడ్డి పొట్లచెరువు సంస్థానాన్ని పాలించాడు.
-ఈ సంస్థానాధీశులకు చార్‌హజార్ అనే బిరుదు ఉండేది.
-పాపన్నపేట సంస్థాన చివరి పాలకుడు రాజా రామచంద్రారెడ్డి.
-ఇతని కాలంలో ఈ సంస్థానం భారత యూనియన్‌లో కలిసిపోయింది.
7. మునగాల సంస్థానం
-మునగాల సంస్థానం కృష్ణా జిల్లా (ఆంధ్రప్రదేశ్) నందిగామ తాలూకాలోనిది.
-ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో నల్లగొండ జిల్లాలో కలిపారు.
-18వ శతాబ్దాంతం వరకు ఈ సంస్థాన పాలకుల సమాచారం తెలియదు.
-1790లో ఫ్రెంచి-బ్రిటిష్ కంపెనీల మధ్య సంభవించిన యుద్ధాల్లో మునగాల సంస్థానధీశురాలైన కీసర లచ్చమ్మ రావు బ్రిటిష్ కంపెనీకి సహాయం చేశారు.
-1802లో లచ్చమ్మ సేవలకు సంతోషించి బ్రిటిష్‌వారు పేష్కస్ ఇచ్చి సన్మానించారు.
-మునగాల సంస్థానాధీశులు జబ్దతులక్రాన్ బిరుదు వహించారు.
-మునగాల సంస్థాన పాలకుడు కీసర ముకుందప్ప మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు దక్కన్ దండయాత్రల్లో సహకరించి మునగాల సంస్థానాన్ని సనదు ద్వారా పొందాడు.
-రాణి లచ్చమ్మ దత్తపుత్రుడు నాయని వెంకటరంగారావు 1900లో మునగాల రాజాగా పదవి స్వీకరించాడు.
-వీరి సంస్థానంలో దివాను కొమర్రాజు వెంకటలక్ష్మణరావు.
-వెంకటరంగారావు వీరి సంస్థాన పరిధిలో ఉన్న తాడువాయి గ్రామంలోని మహాలింగ దేవాలయాన్ని పునరుద్ధరించాడు.
-రాజా వెంకటరంగారావు కుమార్తె సరళాదేవి. ఈమె వనపర్తి రాజా కృష్ణదేవరాయల సతీమణి.
-సరళాదేవి పేరున వనపర్తి సమీపంలో సరళా సాగర్ నిర్మించారు.
-1947లో మునగాల సంస్థానం మద్రాసు రాష్ట్రంలో విలీనమైంది.
8. పాల్వంచ సంస్థానం
-పూర్వం శంకరగిరి సంస్థానంగా పేరుగాంచిన పాల్వంచ సంస్థానం ఖమ్మం జిల్లాలో ఉంది.
-పాల్వంచ సంస్థానాధీశుల పూర్వీకులు కాకతీయ ప్రతాపరుద్రుని సేనానులుగాను, అశ్వసైన్యాధీశులుగాను వ్యవహరించిన పద్మనాయక వంశీయులు.
-1324లో అప్పన్న అనే వ్యక్తి శంకరగిరి, హసనాబాద్ ప్రాంత పాలకునిగా ఉన్నాడు.
-1698 వరకు ఇతని వంశీయులు బహమని, ముసునూరి, పద్మనాయక, గోల్కొండ సుల్తాన్లకు సామంతులుగా వ్యవహరించారు.
-1769లో పాల్వంచ పాలకుడు నరసింహ అశ్వారావు.
-1796లో వెంకటరామ నరసింహ అప్పారావు పాల్వంచ సంస్థానాధీశుడుయ్యాడు.
-పాల్వంచ సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకుడు విజయ అప్పారావు.
-ఇతని కాలంలో పాల్వంచ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది.
-పాల్వంచ సంస్థాన చరిత్రను రచించింది కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ శర్మ.