Type Here to Get Search Results !

Vinays Info

నోబెల్ బహుమతులు - 2016 | Nobel prizes - 2016 - VINAYS INFO

👉2016కుగాను నోబెల్ బహుమతులను ప్రకటించారు. నోబెల్ బహుమతుల ప్రకటన అక్టోబర్ 3న ప్రారంభమై అక్టోబర్ 13న ముగిసింది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా తొలి పురస్కారాన్ని వైద్యరంగానికే ప్రకటించారు.

👉మెడిసిన్

-వైద్యరంగంలో జపాన్ శాస్త్రవేత్త యోషినోరీ ఓహ్సుమికి ప్రకటించారు.
-కణాల స్వీయభక్షక ప్రక్రియ ఆటోఫేగిపై చేసిన కృషికి గుర్తింపుగా పురస్కారం దక్కింది.
-దీంతో క్యాన్సర్లు, పార్కిన్సన్, టైప్-2 మధుమేహం లాంటి సమస్యలపై మెరుగైన అవగాహనకు దారితీసే అవకాశం ఉంది.
-దెబ్బతిన్న కణభాగాల పునఃవినియోగానికి ఆటోఫేగి ప్రక్రియ అవసరం
-ఓహ్సుమి ప్రస్తుతం టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.
-ఈ పురస్కారం కింద సుమారు రూ. 6.22 కోట్లు అందుతాయి.
-ఓహ్సుమి జపాన్ తరపున వైద్యరంగంలో నోబెల్ పొందిన ఆరో వ్యక్తి కాగా, ఆ దేశ నోబెల్ విజేతల్లో 23వ వ్యక్తి.

👉ఫిజిక్స్

-ముగ్గురు బ్రిటన్ శాస్త్రవేత్తలకు లభించింది.
-డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టెర్లిట్ట్‌లకు నోబెల్ ఫిజిక్స్ అందుకోనున్నారు.
-భవిష్యత్తులో అత్యంత వేగంగా పనిచేసే, అతి చిన్న కంప్యూటర్ల ఆవిష్కారానికి దారితీసే పదార్థం అసాధారణ దశలపై జరిపిన పరిశోధనలకుగాను వీరికి నోబెల్ వరించింది.
- రూ. 6.20 కోట్ల బహుమతి లో సగం డేవిడ్‌కు, మిగతా సగాన్ని డంకన్, మైఖేల్ పంచుకుంటారు.
-అమెరికాలో ఉండే ముగ్గురు శాస్త్రవేత్తలు గణితంలో అత్యంత ప్రత్యేక విభాగమైన టోపాలజీలో కృషి చేస్తూ పదార్థం అసాధారణ దశలపై అధ్యయనం చేపట్టారు.
-సూపర్ కండక్టర్లు, సూపర్ ఫ్లూయిడ్లు, పలుచని అయస్కాంత పట్టీల సంబంధిత పదార్థ అసాధారణ దశలను అధ్యయనం చేసేందుకు వీరు అత్యాధునిక గణిత నమూనాల్ని ఉపయోగించారు.

👉కెమిస్ట్రీ

-కెమిస్ట్రీలోనూ ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు.
-భవిష్యత్తులో సూక్ష్మ రోబోలు, కృత్రిమ అవయవాలకు యాంత్రిక కండరాల్లా పనిచేసే ప్రపంచంలోనే అతి చిన్న యంత్రాల్ని ఆవిష్కరించే దిశగా సాగించిన పరిశోధనలకు నోబెల్ లభించింది.
-కొత్త వస్తువులు, సెన్సర్లు, విద్యుత్ నిల్వ వ్యవస్థల అభివృద్ధిలో ఉపయోగించే అవకాశం ఉన్న మాలిక్యులర్ సూక్ష్మ యంత్రాల అభివృద్ధిపై పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలు జీన్ పియర్రే సావేజ్ (ఫ్రాన్స్), జే ఫ్రేజర్ స్టాడర్ట్ (బ్రిటన్), బెర్నాల్డ్ ఫెరింగా (నెదర్లాండ్స్)లు నోబెల్ అందుకోనున్నారు. రూ. 6.20 కోట్ల బహుమతి మొత్తాన్ని ఈ ముగ్గురు పంచుకుంటారు.

👉శాంతి

-కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయేల్ శాంటోస్ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
-52 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధాన్ని అంతం చేయడానికి, దేశంలో శాంతి నెలకొల్పడానికి చేసిన కృషికి గుర్తింపుగా శాంటోస్‌కు శాంతి బహుమతిని ప్రదానం చేయాలని నిర్ణయించారు.
-పౌర యుద్ధ విరమణకు శాంటోస్ సెప్టెంబర్ 26న తిరుగుబాటు సాయుధ బలగాల (ఎఫ్‌ఏఆర్‌సీ) అధినేత రోడ్రిగో లండన్‌తో చరిత్రాత్మక ఒప్పందం కుదర్చుకున్నారు.
-2016 అక్టోబర్ 2న ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, దీనికి ఆమోదం పొందాలని నిర్ణయించారు. కానీ ఒప్పందం నిబంధనలను ఓటర్లు తిరస్కరించినప్పటికీ శాంటోస్‌కు నోబెల్ బహుమతిని ప్రకటించారు.

👉ఎకనామిక్స్
-ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం బ్రిటన్‌కు చెందిన ఓలివర్ హార్ట్, ఫిన్లాండ్‌కు చెందిన బెంగ్ట్ హూంస్టోర్మ్‌లకు సంయుక్తంగా దక్కింది.
-అమెరికాలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వీరు ఒప్పంద సిద్ధాంతం (కాంట్రాక్ట్ థియరీ)పై విశేష పరిశోధన చేశారు.
-ఉన్నతస్థాయి ఉద్యోగులకు చెల్లింపులు ఎలా ఉండాలి, పాఠశాలలు, కారాగారాలు, ఆస్పత్రులు లాంటి ప్రజాసేవలు అందించే సంస్థలను ప్రభుత్వ యాజమాన్యంలో నడపాలా లేదా ప్రైవేట్ యాజమాన్యంలోనా లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి వీరి పరిశోధన ఎంతో ఉపకరించింది.
-ఈ సిద్ధాంతం ఆర్థిక శాస్ర్తానికే కాదు సామాజిక శాస్ర్తాలకు కూడా చాలా ముఖ్యం. మేనేజర్లు లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగులకు బోనస్‌లు చెల్లించాలా లేదా షేర్లు కేటాయించాలా, ఉపాధ్యాయులు లేదా ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి స్థిర వేతనం చెల్లించాలా లేదా పనితీరు ఆధారిత చెల్లింపులు ఉండాలా లాంటి పలు అంశాలను ఒప్పంద సిద్ధాంతం వివరిస్తుంది.
-హార్ట్ (60), బెంగ్ట్ (67) ఇద్దరూ అమెరికాలోనే ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హార్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలో బెంగ్ట్ ఎంఐటీలో పనిచేస్తున్నారు.
-నోబెల్ పురస్కారం కింద వీరిద్దరూ దాదాపు రూ.6.15 కోట్లు (9,24,000) అమెరికా డాలర్ల నగదును పంచుకుంటారు.

👉సాహిత్యం

-అమెరికాకు చెందిన ప్రఖ్యాత గేయ రచయిత బాబ్ డిలాన్‌కు నోబెల్ సాహిత్య బహుమతిని ప్రకటించారు.
-అమెరికా గేయ సంప్రదాయంలో కొత్త కవితా భావజాలాన్ని రూపొందించినందుకుగానూ బాబ్‌కు ఈ పురస్కారం దక్కింది.
-బాబ్ అసలు పేరు రాబర్ట్ ఎలెన్ జిమ్మర్‌మ్యాన్
-బాబ్ చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తితో గేయ రచయితగా, గాయకుడిగా ఎదిగారు.
-బాబ్ రచించిన బ్లోయింగ్ ఇన్ ది విండ్, ది టైమ్స్ దే ఆర్ ఎ-చేంజింగ్ గేయాలు అమెరికా పౌర హక్కులు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చే గీతాలుగా మారాయి.
-చిత్రకారుడు కూడా అయిన బాబ్ పెయింటింగ్స్‌ను ఆయన ఆల్బమ్స్‌కి కవర్స్‌గా కూడా వేశారు.
-డ్రాన్ బ్లాంక్ పేరుతో బాబ్ డ్రాయింగ్స్‌ని ర్యాండమ్ హౌస్ పుస్తకంగా ప్రచురించింది.

👉నోబెల్ బహుమతులు-నేపథ్యం

-నోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఏర్పాటుచేశారు.

-ఆల్‌ఫ్రెడ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న జన్మించారు.
-ఆల్‌ఫ్రెడ్ నోబెల్ 1895లో రాసిన వీలునామా ప్రకారం నోబెల్ బహుమతులను ఇస్తున్నారు.

-మానవాళి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఐదు రంగాల్లో బహుమతులు ఇవ్వాలని వీలునామాలో రాసి 1896 డిసెంబర్ 10న మృతిచెందారు.

-ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేర్కొన్న ఐదు విభాగాలు..
1. భౌతికశాస్త్రం
2. రసాయనశాస్త్రం
3. వైద్యశాస్త్రం/ఫిజియాలజీ
4. సాహిత్యం
5. శాంతి
-నోబెల్ బహుమతులను తొలిసారి 1901లో ప్రదానం చేశారు.
-నోబెల్ బహుమతులను ప్రతి సంవత్సరం ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్థంతి అయిన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు.
-స్వీడన్ కేంద్ర బ్యాంక్ స్వెర్జిస్ రిక్స్ బ్యాంక్ 1968లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆర్థికశాస్త్రంలో బహుమతిని ఏర్పాటుచేసింది. 1969 నుంచి దీన్ని అందజేస్తున్నారు.
-ప్రస్తుతం ఆరు విభాగాల్లో నోబెల్ బహుమతులను ఇస్తున్నారు.
-ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌లో నోబెల్ బహుమతులను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తున్నది.
-స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడిసిన్, స్వీడీష్ అకాడమీ లిటరేచర్‌లు నోబెల్ ప్రదానం చేస్తాయి.
-శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వే రాజధాని ఓస్లాలో ఇస్తుంది.
-మిగిలిన ఐదు బహుమతులు స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ప్రదానం చేస్తారు.
-1969లో ఎకనామిక్స్‌లో తొలి నోబెల్‌ను రాగ్నర్ ఫ్రెష్ (నార్వే), జాన్ టింబర్ జాన్ (నెదర్లాండ్స్)లకు ప్రదానం చేశారు.
-ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్ నోబెల్ శాంతి బహుమతిని మూడుసార్లు (1917, 1944, 1963) గెలుచుకుంది.
-జే బార్టీన్ ఫిజిక్స్‌లో రెండుసార్లు (1956, 1972) విజేతగా నిలిచారు.
-మేరీక్యూరీ రెండుసార్లు (1903-ఫిజిక్స్, 1911 కెమిస్ట్రీ) నోబెల్ బహుమతులు సాధించారు.
-ఫ్రెడరిక్ సాంగర్ కెమిస్ట్రీలో రెండుసార్లు (1958, 1980)లో గెలుచుకున్నారు.
-యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ సంస్త (యుఎన్ హెచ్‌సీఆర్) నోబెల్ శాంతిని రెండుసార్లు (1954, 1981) దక్కించుకుంది.
-లైనస్ పౌలింగ్ 1954లో కెమిస్ట్రీలో, 1962లో శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
-ఇప్పటివరకు మొత్తం ఆరుగు వ్యక్తులు లేదా సంస్థలు ఒకటి కంటే ఎక్కువసార్లు నోబెల్ బహుమతులు పొందారు.
-నోబెల్ బహుమతులను మరణాంతరం ఇవ్వరాదని 1974లో నిర్ణయించారు. అంతకుముందు 1931లో ఎరిక్ ఎక్సెల్ కార్ల్ ఫెల్డ్ (సాహిత్యం), 1961లో డాగ్ హోమర్స్ జోల్డ్ (శాంతి)లకు నోబెల్ బహుమతులు మరణాంతరం లభించాయి.
-భారతదేశ పౌరసత్వం ఉన్నవారు, భారతదేశంలో జన్మించి విదేశీ పౌరసత్వం పొందిన మొత్తం 10 మందికి నోబెల్ బహుమతి లభించింది.

👉భారతీయులు నోబెల్ గ్రహీతలు
1. రవీంద్రనాథ్ ఠాగూర్ : 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ అవార్డు లభించిన తొలి ఆసియా ఖండవాసి ఠాగూర్

2. సర్ సీవీ రామన్ : 1930లో ఫిజిక్స్ నోబెల్ లభించింది. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
3. మదర్ థెరిసా : 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు.
4. అమర్త్యసేన్ : సంక్షేమ ఆర్థికశాస్త్రంలో చేసిన కృషికిగాను 1998లో నోబెల్ బహుమతి లభించింది. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఏకైక భారతీయుడు అమర్త్యసేన్
5. కైలాష్ సత్యార్థి : 2014 నోబెల్ శాంతి బహుమతిని మలాల యూసఫ్ జాయ్‌తో కలిసి గెలుచుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section