Type Here to Get Search Results !

Vinays Info

Handcrafts in Telangana - తెలంగాణ హస్తకళలు

 తెలంగాణ హస్తకళలు 

అధిక వర్ణాలు, సంస్కృతులు, సాంప్రదాయాలకు నెలవైన తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటకానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి

ప్రాచీన జీవన సంప్రదాయాలను వెల్లడించే కొన్ని అద్భుతమైన, సుసంపన్నమైన హస్తకళలకు తెలంగాణ కేంద్రంగా ఉంది 

గ్రామీణ పర్యాటకం గ్రామీణ ప్రజల జీవనం, సంస్కృతి, హస్తకళా నైపుణ్యం వంటి వాటిని పర్యాటకులు తెలుసుకోవచ్చు 

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తెలంగాణలో కొన్ని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులను గుర్తించింది 


పోచంపల్లి హస్తకళలు (యాదాద్రి భువనగిరి) 

పోచంపల్లి గ్రామం లోని ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రపంచ ప్రఖ్యాతి పొందినది 

దీనికి జి.ఐ. ట్యాగ్ గుర్తింపు లభించింది 

పోచంపల్లి స్థానిక జానపదులు ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలోను, అమ్మటంలోను నిమగ్నమై ఉంటారు  

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కంప్యూటర్-ఆధారిత నేత డిజైన్లను అందిస్తుంది 


పెంబర్తి హస్తకళలు (జనగాం) 

కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కే కళ పెంబర్తి గ్రామంలో పుట్టింది 

పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశంలోని ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం 


 


కాకతీయుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళానైపుణ్యం ఉచ్చ దశకు చెందింది 


నిర్మల్ హస్తకళలు 

నిర్మల్ హస్తకళలు కాకతీయుల కాలంలో ఆవిర్భవించాయి 

నిర్మల్ లోని అస్త కళాకారులను నకాషీలుగా గుర్తిస్తారు 

17వ శతాబ్దికి చెందిన నిమ్మనాయుడు టేకు, పునికి చెట్ల కలప నుండి బొమ్మలు తయారు చేసే కళను అధికంగా ప్రోత్సహించాడు 

అతని పేరు పైన ఆ పట్టణానికి నిర్మల్ అని పేరు వచ్చింది 

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నిర్మల్ పెయింటింగ్స్ మరియు బొమ్మలు ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందినాయి

మౌలికసారంతో తయారుచేసిన నిర్మల్ బొమ్మలు సహజమైన బంగారు మెరుపుతో ఉంటాయి 

నిర్మల్ బొమ్మలను అలంకరించటానికి ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్స్ ను వాడుతారు 


చేర్యాల హస్తకళలు 

సిద్దిపేట జిల్లాలో చేర్యాల అనే గ్రామం ఉంది 

చేర్యాల గ్రామం ప్రఖ్యాతి చెందిన స్క్రోల్ పెయింటింగ్ కు పుట్టినిల్లు 

పురాణ, ఇతిహాసాలను డిజైన్లు గా తీసుకొని మట్టి రంగులతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్ వేస్తారు 


ఆసియా (తేలియా) రుమాల్ 

యాదాద్రి జిల్లా పోచంపల్లి వీటి తయారీకి ప్రసిద్ధి చెందింది 

ఇకత్ అనే నేతను దీనిలో ఉపయోగిస్తారు 

సంక్లిష్టమైన రేఖాచిత్రాలు, మార్జిన్ లను వీటిపై ఉపయోగిస్తారు 

దారాన్ని తైలంలో ముంచి ఆరవేస్తారు. వీటిని గొర్రెపేడతో నింపిన నీటిలో ఒక రాత్రి ఉంచి మరునాడు ఆరపెడతారు . ఇలా నాలుగు రోజులపాటు చేస్తారు 

తరువాత టై-డై  ప్రక్రియలో రంగుల చిత్రాలు గీస్తారు. ఈ రుమాల్ అపి చిన్న చిన్న బ్లాక్లులు,నక్షత్రాలు, చుక్కలు, గీతలు, డైమండ్ ఆకారాలు చిత్రిస్తారు 

సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షించుకునేందుకు తలపాగాగా కూడా దీనిని ఉపయోగిస్తారు 


బిద్రి వస్తువులు 

హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న బీదర్ లో(ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) ఈ కళ అభివృద్ధి చెందింది 

ఆ పేరు మీదనే ఈ కళకు ఆ పేరు(బీదర్ బిద్రీ) వచ్చింది 

ఇరాన్ నుండి ఈ కళ హైదరాబాద్ రాష్ట్రానికి వలస వచ్చింది 


బంజారా నీడిల్క్రాఫ్ట్(బంజారా సూది కళ)

తెలంగాణలో ఉన్న బంజరాలచే అభివృద్ధి చెందిన వాస్తుకళ వస్త్రాలు 

వివిధ రంగుల ఎంబ్రాయిడరీ దారంతో, చిన్న చిన్న అద్దాలు, రాళ్లు, గవ్వలు వంటి వాటితో వస్త్రాలను అలంకరిస్తారు 


సిల్వర్ ఫిలిగ్రీ(వెండి తీగ పని) 

200 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా ఎలగందల్ ప్రాంతంలో ఆవిర్భవించింది 

ఎలగందల్ లో ఈ కళను ప్రవేశపెట్టినది కార్ల రామయ్య అనే స్వర్ణకారుడు సి

ల్వర్ ఫిలిగ్రీ కి దేశంలో రెండవ పట్టణం గా కరీంనగర్ కొనసాగుతుంది 

బంగారు, వెండి తీగలతో అద్భుతమైన కళాకృతులను సృష్టిస్తున్నారు 


డోక్రా మెటల్ క్రాఫ్ట్

డోక్రా అనగా బెల్ మెటల్ కళ 

ఈ హస్తకళ అదిలాబాద్ గిరిజన ప్రాంతాలలో అధికంగా కనిపిస్తుంది 

ఈ కళకు ఉషగావ్, జమగావ్, కేశల గుడ (జైనూరు మండలం) మరియు కెరమెరి మండలం మరియు చిత్తల్ బరి సహజ ఆవాసాలుగా చెప్పవచ్చు 


కంచు ప్రతి రూపాలు 

తెలంగాణ రాష్ట్రం కంచు ప్రతి రూపాల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచినది 

శిల్పారామం (హైదరాబాద్) ఈ హస్త కళ వస్తువులకు వేదికగా ఉంది 


గద్వాల-కొత్తకోట చీరలు 

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కొత్తకోట ప్రాంతాల్లో కొన్ని వందల కుటుంబాలు ఈ తరహా చేనేత చీరలు నేస్తారు. పట్టు, జరీ, పట్టు జరీ, లేసులు, కలంకారీలు ఉపయోగించి వీటిని అతి నైపుణ్యంతో తయారు చేస్తారు 


నాయక్ పాడ్ ల మాస్కులు 

మతపరమైన నమ్మకాలు మరియు ఇతిహాసాల వంటివి కళలకు ప్రేరణగా నిలుస్తాయి 

నాయక్ పాడ్లు లక్ష్మీదేవరను, కృష్ణుడిని, పంచపాండవులను మరియు వారి దైవాలైన పోతురాజు, గొర్రెపోతు మొదలగు దేవుళ్ళను మాస్కుల రూపంలో పూజిస్తారు 


లంబాడ ఎంబ్రాయిడరీ 

నిజామాబాద్ జిల్లాలోని లంబాడ మహిళలు రంగురంగుల దుస్తులు మరియు బంగారం, వెండి, ఐవరీ మరియు బిడ్స్ తో తయారుచేసిన ఆభరణాలతో అలంకరించుకుంటారు 

లంబాడ మహిళలు ఎంబ్రాయిడరీ వర్క్ మరియు వారి యొక్క బట్టలు,  స్కర్ట్లు, పెట్టయ్య, రవికలు(చంచులు), ఓని (టుక్రి) లు తమ కోసం తయారు చేసుకోవటం లో సిద్ధహస్తులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section