Type Here to Get Search Results !

Vinays Info

Telangana Folk Arts-జానపద కళలు

 జానపద కళలు 


పిచ్చకుంట్ల 

పాల్కురికి సోమనాధుని కాలంలో ఉన్నట్లు పండితారాధ్యచరిత్ర వల్ల తెలుస్తుంది 

వీరు రెడ్లను, యాదవులను యాచించి జీవనం సాగించే శైవ మతానికి చెందినవారు 

కథలు: విల్ల నాగిరెడ్డి, వేమారెడ్డి 


దాసర్లు 

దాసర్లులలో బుక్కదాసరి, పాగా దాసరి, భాగవతి దాసరి, చిన్న దాసరి, దండె దాసరి, మాలదాసరి అనే ఉప జాతులు ఉన్నాయి. వీరు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తారు 

బొబ్బిలి బాలనాగమ్మ, చిన్నమ్మ, కాకమ్మ కథల్ని పాడుతారు. విష్ణు సంకీర్తనలతో ఇంటింటా బిక్షం అడుగుతారు 


విప్రవినోదులు 

తెలంగాణ ప్రాంతంలో మాయాజాలం ఒక అద్భుత ప్రదర్శన 


గంగిరెద్దులాట 

పూజ గొల్ల కుల కళాకారులు నిర్వహించే ప్రదర్శన గంగిరెద్దులాట 

ఒక వ్యక్తి గంట వాయిస్తూ గంగిరెద్దును ఆడిస్తుండగా ఇద్దరు సన్నాయి, డోలు వాయిస్తూ సహకరిస్తుంటారు 


బుడబుక్కలు 

తెల్ల తెల్లవారుతుండగా వీధుల్లో తిరుగుతూ క్షుద్రశక్తులను  పారదోలేల యత్నిస్తుంటారు 

వీరు సంచార జాతులు 

జోస్యం చెప్పడం, తాయెత్తులు కట్టడం వీరి వృత్తి 


కప్పతల్లి 

ఇది అతి ప్రాచీన నృత్య కళా రూపం 

నృత్యం, గీతం, తప్పెటలయ తో కలిసి ప్రదర్శించే కళారూపం 


ఒగ్గు కథ 

కురుమ కులానికి చెందిన పురోహితులైన వీర శైవాదరకులు ప్రదర్శించే కళారూపం 

ఒగ్గు అంటే శివుని శరణు వేడు కోవటం, దీక్షను తీసుకోవటం 


కాటిపాపల 

అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా కాటిపాపల ఇంద్రజాల ప్రదర్శన నిర్వహిస్తారు 

గ్రామాల్లో ఎవరైనా చనిపోతే శవ యాత్ర లో పాల్గొని చనిపోయిన వ్యక్తులను కీర్తించి యాచిస్తారు 


పెద్దమ్మలోళ్లు 

సంచార జాతికి చెందిన మహిళా కళాకారులే పెద్దమ్మలోళ్లు  

వీరు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఒక చేతిలో ఉంచుతారు 


జమ్ముకలవారు 

ఎల్లమ్మ, పోచమ్మ, అంకమ్మ, సారంగధర చరిత్ర కథలను అతి రమ్యంగా గానం చేస్తారు

జమడిక  ల లేదా బవనిక అనే వాయిద్యం ప్రధానమైనది 

ఖమ్మం,నల్గొండ జిల్లాల్లో వీరికి ఆదరణ ఎక్కువ


జంగాలు 

తెలుగు గేయ సాహిత్యంలో పద్యాలను, కీర్తనలను యక్షగాన పద్ధతిలో వీరు గానం చేసిన వీరంజంగం కథలు ప్రసిద్ధిపొందాయి 

ప్రాచీన కాలం నుంచి జానపద సాహిత్యం వీరివలన ఊపిరిపోసుకుంది 

వీరు శైవ గాథలనే వీరావేశంగా చెబుతారు 


ఆసాదులు 

తెలంగాణలో ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మలను గ్రామ దేవతలగా పూజిస్తారు 

ఈ పూజలు నిర్వహించే పూజారులను ఆసాదులు అంటారు 

దళితులైన మాల, మాదిగల తో పాటు కుమ్మర్లు కూడా ఆసాదులుగా ఉంటారు 

గ్రామ దేవతలకు పూజలు చేసే క్రమంలో అమ్మవార్లను ప్రార్థిస్తూ స్తుతిస్తారు 

వీరు ఉపయోగించే వాద్యాలు: జవికి, చేడిక 

అమ్మవార్ల కొలువంతా  తాంత్రిక పద్ధతిలో జరుగుతుంది 


యానాది భాగవతం 

యానాదులు చెప్పేదే యానాది భాగవతం 

చెంచులక్ష్మి చిత్రకథని వీరు అత్యంత రమ్యంగా చెబుతారు 

దీనిని గరుడాచల భాగవతంగా పిలుస్తారు 

వీరు నృత్యం చేస్తూ కథా గానం చేస్తారు 


మందెచ్చు  కళాకారులు 

వీరు యాదవ కులానికి చెందిన కళాకారులు 

ఒల్లమాదేవి జానపద గానం చేస్తారు 

ప్రధాన కథకుడు కత్తి మరో చేతితో చిడుతలు పట్టుకొని గానం చేస్తాడు 

మరో ఇద్దరిలో ఒకరు కత్తి మరొకరు కర్ర పట్టుకొని కథకునికి వంత పాడుతారు 


బండారు కళాకారులు 

పెరిక కులానికి చెందినవారు వీరిని పోషిస్తారు 

వీరు పెరిక జాతి పురాణం కధ చెబుతారు  

ఈ ప్రదర్శనలో వాయిద్యం లేకుండానే ఒకరు పాడుతూ కథ చెబుతుంటే, మరో ఇద్దరు ఊ కొడుతూ సహకారం అందిస్తారు 


రంజు కళాకారులు 

గిరిజన తెగలైన కోయ, గోండు, నాయకపోడు కులాలకు సంబంధించిన కులోత్పత్తి గాథలు చెప్పేవారు తోటి కళాకారులు 

గిరిజన జాతులు, తెగలకు ఆశ్రిత కులాలవారు తోటివారు 

గిరిజన లక్ష్మీదేవర, సంతతి, కురువంశానికి చెందిన వారుగాను, వారి వారసులుగా భావిస్తారు 

వీరు కురు వంశ మూల పురుషుడు కథలు చెబుతారు 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని గిరిజనులు ఈ కథలు చెబుతుంటారు 


బుర్రకథలు 

ఈ జానపద కళా రూపాన్ని తంబూర కథ అని తందాన కథ అని వ్యవహరిస్తారు 

ముగ్గురు వ్యక్తులు చెప్పే ఈ కథలో ప్రధాన వ్యక్తి దగ్గర తంబూర ఉంటుంది మిగిలిన ఇద్దరి వద్ద గుమెట్లు ఉంటాయి 


 


పలు పౌరాణిక, చారిత్రక గాథలు చెప్పటంలో వీరు సిద్ధహస్తులు 


బైండ్ల కథలు 

బైండ్ల వారు చెప్పే గ్రామ దేవతల కథలు 


శారద కథలు 

మున్నూరు, ముతరాశి మొదలైన కులాల నుండి ఉద్భవించిన జాతులలో శారదకాండ్రు జాతి ఒకటని బిరుదురాజు రామరాజు గారు తెలిపారు 

వీరు వాయించే తంబుర పేరు శారద, శారద వాయిద్యాన్ని వాయిస్తూ పాడే పాట శారద కథ 

శారద గాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధులైన రేణికుంట రామిరెడ్డి, చింతలపూడి రామిరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైన వారి యొక్క వీరోచిత పోరాటాలను కథలుగా మలిచారు 


 


'రేణిగుంట పోరాటం' అనే శారద కథని ప్రముఖంగా చెప్పుకోవచ్చు 

వీరి కథ శారదాదేవి ప్రోత్సాహంతో ప్రారంభమవుతుంది 

తెలంగాణలో ప్రచారంలో ఉన్న ప్రసిద్ధ వీర కథలైన సదాశివరెడ్డి కథ, సర్వాయి పాపన్న కథలను అద్భుతంగా పాడి వినిపిస్తారు 

అదేవిధంగా పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం మొదలైన కథలను చెబుతుంటారు 

వీరు ఎక్కువగా వరంగల్, నల్గొండ జిల్లాలలో ఉంటారు 


డోలి కళాకారులు 

వీరు గిరిజనులైన కోయతెగ పుట్టుక, వంశ మూల పురుషుల చరిత్ర చెప్పేవారు 

వీరు కోయలకు ఆశ్రితులు, వీరిని ఇంటోళ్లు, నాగ స్థంభం వారని కూడా పిలుస్తారు 


 


కోయాల్లో మూడో గట్టుకు చెందిన మూల పురుషుడు పేరు బోయరాజు కథను చెబుతారు 

వీరి ప్రధాన వాయిద్యం డోలు 


డాడీ ల ప్రదర్శన 

సంచారజాతులైన బంజారాలనే లంబాడీలు, సుగాలీలు అని అంటారు 

వీరు బంజారాల మూలపురుషుల జీవిత చరిత్రను గానం చేస్తూ సంచారం చేస్తూ జీవనం సాగిస్తారు 

వీరు ఆయా తండాలకు వెళ్లి అక్కడ పెద్దలను కలిసి ప్రదర్శన నిర్వహిస్తారు 

వీరిని భట్టు,భట్లని కూడా పిలుస్తారు 

వీరిది బృందగాన రూపం 


భిక్ష కుంట్లు 

భిక్ష కుంట్లు కళాకారులు సత్యహరిశ్చంద్ర, మార్కండేయ, ప్రహ్లాద, గంగ-గౌరీ వంటి కథలు చెప్తారు 

ముగ్గురు నలుగురు కళాకారులు కలిసి ఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు 

ప్రధాన కథకుడు పొన్నుకర్ర చేతిలో ఉంచుకొని ఊపుతూ కథ చెబుతాడు 

సహ కళాకారులు మద్దెలు, హార్మోనియం, తాళాలు వాయిస్తారు 


పర్దాన్ కళాకారులు 

ఆదివాసి జాతికి చెందిన పర్దాన్లు దేవాల్ పునాక్(కోయపున్నమి) పురాణ గాథను గానంచేస్తూ ప్రదర్శిస్తారు 

ఇది గోండు జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలిపే చరిత్ర 

వీరి వాయిద్యాలు: కేకిరి(కింకిరి), డక్కి తాళాలు 



గారడి విద్యలు 

ఎ) కాటిపాపలు 

అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా కాటిపాపలు ఇంద్రజాల ప్రదర్శన నిర్వహిస్తారు 

గ్రామాల్లో ఎవరైనా చనిపోతే శవయాత్రలో పాల్గొని చనిపోయిన వ్యక్తులను కీర్తించి యాచిస్తారు 


బి) సాధనాశూరులు 

వీరుకూడా ఇంద్రజాల విద్యను ప్రదర్శించి వారే 

వీరు పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు 

ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి సంచరిస్తూ పద్మశాలీల అనుమతితో వీరు తమ ప్రదర్శనను ప్రారంభిస్తారు 


సి) పగటి వేషాలు 

ఈ పగటివేషాల గురించి యథావాక్కుల అన్నమయ్య తాను రచించిన సర్వేశ్వర శతకంలో వేషాలను బహురూపాలుగా ప్రస్తావించాడు 

శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలలో బహు రూపాలను ప్రదర్శించే వారిని పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర ద్వారా తెలుస్తుంది 


డి) పిట్టలదొర వేషం 

అతనికి గల ఇతర పేర్లు: లత్కోరు సాబు, బుడ్డర్ ఖాన్, తుపాకి వెంకట్రాముడు 

పిట్టలదొర వేషం పగటి వేషాలలో ప్రముఖమైనది 

పిట్టలదొర వేషధారి ఖాకి రంగు ప్యాంటును మోకాళ్ళ పైకి మలుచుకొని, చిరిగిన ఖాకి షర్టు వేసుకుంటాడు. తలపై ఒక టోపీ, చేతిలో కట్టె తుపాకి, మెడలో రుమాలు కట్టుకుంటాడు 

సమాజంలోని అన్యాయాలను హాస్య ధోరణిలో భయపెడుతూ యాచిస్తాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section