Type Here to Get Search Results !

Vinays Info

అస్థిపంజర వ్యవస్థ | Skeletal System - VINAYS INFO

🔹అస్థిపంజరం.. ఎముకలతో నిర్మితమైన చట్రం. దీనిలో కొన్ని మృదులాస్థి నిర్మాణాలు కూడా ఉంటాయి. దేహభాగాలకు నిర్దిష్టమైన ఆకృతి, దృఢత్వాన్ని, మెదడు, గుండె, ఊపిరితిత్తులకు రక్షణనిస్తూ శరీర కదలికల్లో అస్థిపంజర వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవుడి దేహంలోని మొత్తం ఎముకలన్నింటినీ కలిపి అస్థిపంజరం అంటారు. అస్థిపంజరం అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. ఎముకల్లో ఉండే ప్రొటీన్ ఆస్టిన్. మానవుడి అస్థిపంజరంలో 206 ఎముకలు ఉంటాయి.

🔹ఎముకలను ఏర్పర్చే కణాలు ఆస్టియోసైట్స్. 🔹ఎముకల్లో ఉండే మూలకాలు కాల్షియం, ఫాస్ఫరస్. ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ ఎక్కువగా, కాల్షియం కార్బొనేట్ తక్కువగా ఉంటుంది. కాల్షియం ఎముకకు దృఢత్వాన్నిస్తుంది.
🔹మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం కాల్షియం.
🔹పాలు, గుడ్లు, ఆకుకూరల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. విటమిన్-డి కూడా చర్మం, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
🔹ఎముకల మధ్య భాగంలో అస్థిమజ్జ ఉంటుంది. 🔹ఎరుపు రంగు అస్థిమజ్జ ఎర్ర రక్తకణాల (ఆర్‌బీసీ)ను ఉత్పత్తి చేస్తుంది.
🔹పక్షుల ఎముకల్లో అస్థిమజ్జ ఉండదు. వీటిలో గాలి ఉంటుంది. వీటిని వాతులాస్థులు (న్యుమాటిక్ బోన్స్) అంటారు.
🔹పక్షుల్లో ఆర్‌బీసీలను ఉత్పత్తి చేసే అవయవం బర్సా.

👉అస్థిపంజరం - రకాలు
1) బాహ్యాస్థిపంజరం
2) అంతరాస్థిపంజరం.

👉బాహ్యాస్థిపంజరం

🔹బాహ్యాస్థిపంజరం జీవి దేహం బయట ఉంటుంది.
🔹వివిధ జీవుల్లోని బాహ్యాస్థిపంజరం..
🔹చేపలు - పొలుసులు
🔹పక్షులు - ఈకలు
🔹కోడిగుడ్లు - పెంకు
🔹నత్తలు, ఆల్చిప్పలు, ప్రవాళాలు (కోరల్స్)- కర్పరం
🔹కీటకాలు - స్ల్కీరైట్స్
🔹సకశేరుకాలు - రోమాలు, నఖాలు, కొమ్ములు, 🔹గిట్టలు మొదలైనవి. వీటిలో ఉండే ప్రొటీన్ ఆల్ఫాకెరాటిన్.
➡నోట్: క్యారెట్‌లోని విటమిన్-ఏను బీటా కెరోటిన్ అంటారు.

🔹గోర్లను కత్తిరించినప్పుడు నొప్పి, బాధ అనిపించకపోవడానికి కారణం అవి మృతకణ జాలంతో తయారైన కొమ్ము వంటి పదార్థంతో ఏర్పడటం.

👉అంతరాస్థిపంజరం

🔹అంతరాస్థిపంజరం దేహం లోపల ఉంటుంది. అస్థిపంజరంలోని ఎముకలు రెండు రకాలు.
ఎ) మృదులాస్థి బి) అస్థి.

👉మృదులాస్థి
🔹మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి ఎముకలు అంటారు. పిండదశలో ఎముకలన్నీ మృదులాస్థి నిర్మితాలు. శిశువు ఎదిగిన తర్వాత ఈ మృదులాస్థులు అస్థులుగా రూపొందుతాయి. మృదులాస్థిలో ఉండే ప్రొటీన్ ‘కాండ్రిన్’. మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు.

🔹మృదులాస్థి ఉండే భాగాలు..

1) ముక్కుకొన (నాసికాగ్రం)
2) వెలుపలి చెవి
3) వాయునాళంలోని ‘సి’ ఆకారపు ఉంగరాలు
4) కొండనాలుక
5) అంగిలి (ఇది నాసికాకుహారం, ఆస్యకుహారాన్ని వేరు చేస్తుంది)
6) సొరచేప అస్థిపంజరం
షార్క్ చేప కాలేయ నూనెలో విటమిన్ - ఎ, డిలు లభిస్తాయి.

👉అస్థి (బోన్)
🔹అస్థి అంటే దృఢంగా ఉండే ఎముక.
🔹చిన్నపిల్లల్లో 300 పైగా ఎముకలు ఉంటాయి.
👉శరీర భాగం ఎముకల సంఖ్య
1. తల 29 (పుర్రె-22, హయాయిడ్ ఎముక-1, రెండు చెవులు-6)
2. వెన్నుపూసలు 26 (చిన్నపిల్లల్లో- 33)
3. పక్కటెముకలు/రిబ్స్ 24
4. రెండు చేతులు 60
5. రెండు కాళ్లు 60మొత్తం ఎముకల సంఖ్య (పెద్ద వారిలో) 206

గమనిక: ఉరి వేసుకున్న వారిలో హయాయిడ్ ఎముక విరుగుతుంది.
🔹శైశవ దశలో 33 వెన్నుపూసలుంటాయి. తర్వాత వాటిలో చివరి 9 వెన్నుపూసలు (ఐదు కలిసి ఒక త్రికంగా, 4 కలిసి అనుమత్రికంగా) 2 వెన్నుపూసలుగా ఏర్పడతాయి. కాబట్టి పెద్ద వారిలో ఉండే మొత్తం వెన్నుపూసల సంఖ్య 26. తలలోని ఎముకల గూడును పుర్రె అంటారు. పుర్రెలో మెదడు ఉండే పెట్టెవంటి నిర్మాణం కపాలం (క్రీనియం). 🔹కపాలం అధ్యయనాన్ని క్రీనియాలజీ అంటారు.
🔹కపాలంలోని ఎముకలు- 8
🔹ముఖంలోని ఎముకలు -14
🔹పుర్రెలో కదిలే ఎముక - 1
🔹కింది దవడ కదులుతుంది
🔹పుర్రెలో కదలని ఎముకలు- 21
🔹అతిపెద్ద ఎముక - పీమర్ (తొడ ఎముక)
🔹అతిచిన్న ఎముక - స్టెపిస్ (కర్ణాంతరాస్థి)
🔹పుర్రెలో అతిదృఢమైన ఎముక
🔹కింది దవడ (మాండిబ్యూల్)
🔹అతి మెత్తని ఎముక - మృదులాస్థి

👉చేతి ఎముకలు:

🔹ప్రతి చేయిలో 30 ఎముకలుంటాయి.
🔹చేయిలో మూడు భాగాలు ఉంటాయి.
1) పై చేయి (భుజాస్థి ఎముక - హ్యూమరస్ 1)
2) ముంజేయి (రత్ని, అరత్ని ఎముకలు -2)
3) హస్తం
ఎ) మణిబంధాస్థులు -8
బి) కరబాస్థులు - 5
సి) చేతివేళ్లు - 14

గమనిక: రాస్తున్నప్పుడు పెన్నుకు ఆధారాన్నిచ్చే చేతి వేళ్ల ఎముకలను ఫాలింజెస్ అంటారు.

👉కాలు ఎముకలు: ప్రతికాలులో 30 ఎముకలుంటాయి. కాలులో మూడు భాగాలున్నాయి.

1) తొడ: పీమర్ - 1
2) మోకాలు: టిబియా, ఫిబులా (అంతర్‌జంగిక, బహిర్జంగిక- 2)
3) పాదం
ఎ) చీలమండలం (టార్సల్స్)-7
బి) ప్రపాదాస్థులు-మెటాటార్సల్స్-5
సి) కాలివేళ్లు - ఫాలింజస్-14
డి) మోకాలి చిప్ప - పటెల్లా - 1

👉ఉరోమేఖల (పెక్టోరల్ గిర్డిల్): ఇది చేతులను అంటిపెట్టుకుని ఉంటుంది. ఉరోమేఖల / భుజ వలయంలో రెండు ఎముకలుంటాయి. అవి..
ఎ) జతృక (కాలర్ బోన్)
బి) అంస ఫలకం (స్కాపులా) (ఇది త్రిభుజాకారంలో ఉంటుంది)

👉ఉరఃపంజరం: ఉరోస్థి ముందువైపు (రొమ్ము ఎముక), పక్కటెముకల ఇరువైపులా, వెన్నెముక వెనుకవైపు ఉండి గుండె, ఊపిరితిత్తులను రక్షిస్తుంది.

🔹శ్రోణిమేఖల (ఫెల్విన్ గిర్డిల్): ఇది కాలి ఎముకలను అంటుకుని ఉదరం కింది భాగంలో ఉంటుంది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section