ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ - 1977 | Eshwari Bhai Patel Committee
భారత ప్రభుత్వం 1977 జూన్లో గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీభాయ్ జె. పటేల్ అధ్యక్షులుగా సెకండరీ స్థాయి విద్యాకోర్సులు, సిలబస్లు, పాఠ్యపుస్తకాలను సమీక్షించడానికి గాను ఒక కమిటీని నియమించారు.
కమిటీ సమీక్షించాల్సిన అంశాలు పేర్కొనడమైంది.
- N.C.E.R.T. గుర్తించిన దశలవారీ, విషయాల వారీ లక్ష్యాలను సమీక్షించడం
- N.C.E.R.T. సిద్ధంచేసిన సిలబస్ ను పాఠ్యపుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం.
- 1977 నుంచి అమలులో వున్న వివిధ స్కీములను వివిధ విషయాల అధ్యయనానికి నిర్ధేశించిన కాలపరిమితిని సమీక్షించడం
- ఈ కమిటీ సమర్పించిన ముఖ్యమైన సిఫారసులు ఈ విధంగా ఉన్నాయి.
- కరికులమ్, సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు, విద్యాబోర్డులకు స్వేచ్ఛఉండాలనీ దానిద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా రచన, నిర్వహణకు అవకాశం లభిస్తుందనీ కమిటీ భావించింది.
- కమిటీ సిఫారసు చేసిన స్కీములో మానవీయ శాస్త్రాలు (Humanities), విజ్ఞానశాస్త్రాలు(Sciences) సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తిదాయకకృషి (S.U.P.W.) అను 3 అంశాలు కీలకమైనవి.
- S.U.P. W. తో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులమ్లో ప్రముఖస్థానం కల్పించాలని సూచించింది.
- వీటికి ఒకటి నుంచి 5వ తరగతి వరకు 20% సమయాన్ని టైప్డేబుల్లో కేటాయించాలనీ 6 నుండి 10వ తరగతి వరకు వారానికి 32 గంటల వ్యవధిలో 6 గంటల సమయాన్ని S.U.P. W. కి కేటాయించాల్సిందిగా సిఫారసు చేసింది.
- ఈ సంపూర్ణ విషయానికి (Full fledged subject) అధిక ప్రాముఖ్యతను కల్పించి సర్టిఫికెట్ ప్రధానంలోనూ, పరీక్షలోనూ తగిన స్థానాన్ని కల్పించాల్సిందిగా సూచించింది.
- పాఠశాల కరిక్యులమ్ భాష స్థానం, ప్రాధాన్యతకు సంబంధించి కొఠారీ కమీషన్ చేసిన సిఫారసులనే ఈ కమిటీ సమర్ధించింది.
- ఈ సంఘం 1 నుంచి 5వ తరగతి వరకు ప్రత్యేకంగా కింది సిఫారసులు చేసింది. ప్రాథమిక స్థాయిలో పిల్లలు 2 1/2 నుంచి 3గంటలకంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు.
- కచ్చితమైన టైమ్జీబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానంకాదు.