డా॥ మాల్కం ఆదిశేషయ్య - 1978 | Dr. Malcolm Adiseshaiah Committee - 1978
ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తివిద్యాకోర్సులను ప్రవేశపెట్టడానికి మద్రాసు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన డా॥ మాల్కం ఆదిశేషయ్యగారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ 1978లో "లెర్నింగ్ టు డు(Learning to Do)" అనే శీర్షికతో రిపోర్టు అందచేసింది. ఇందులో విద్యతోపాటు వృత్తిపరమైన విద్యాబోధన సాగాలనీ, గ్రామీణ పరిసరాల కనుగుణంగా వ్యవసాయం, వాణిజ్యం, ఆరోగ్యం, వైద్యం మొదలైన కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలనీ, వృత్తివిద్య పూర్తి చేసిన వారికి అప్రెంటీస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్రస్థాయిలోను జాతీయస్థాయిలోను వృత్తివిద్యాపరిషత్లు నెలకొల్పాలనీ, సెమిష్టర్ పద్ధతి కొనసాగాలని సూచించారు.