Type Here to Get Search Results !

Vinays Info

సాంప్రదాయక విద్యా ధ్యేయాలు (Classical Aims of Education)

సాంప్రదాయక విద్యా ధ్యేయాలు (Classical Aims of Education)

సాంప్రదాయక విద్యా ధ్యేయాలు ఏడు అవి:

1. జ్ఞానం కోసం విద్య 

2. శీలం కోసం విద్య

3. వృత్తి కోసం విద్య

4. సాంస్కృతిక వారసత్వం కోసం విద్య

5. విరామకాల సద్వినియోగం కోసం విద్య

6. ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య

7. మానవత్వం కోసం విద్య.

జ్ఞానం కోసం విద్య

'జ్ఞానాభివృద్ధికి' విద్య అవసరం. మానవ అభివృద్ధికోసం జ్ఞానం. తోడ్పడుతుంది. అందరికి సంపూర్ణ జ్ఞానం (complete knowledge for all) కావాలని Poacon -అంటాడు. జ్ఞానం మానవతా విలువలను పెంచుతుంది. జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించడమే సరైన విద్య. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మానవ కళ్యాణానికి ఉపయోగపడేదిగా ఉండాలి. 

శీలంకోసం విద్య : 

విద్యావేత్తలు సత్ప్రవర్తనను వృద్ధిచేయడమే విద్యాలక్ష్యంగా భావిస్తారు. జ్ఞానం - bacon నైతిక విలువలు, ఆదర్శాలున్న ప్రవర్తనను సత్ప్రవర్తన అని హెర్బర్ట్ అంటాడు. "విద్య అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టడం" అని సోక్రటీస్ అంటాడు. "సత్ ప్రవర్తనా నిర్మాణమే విద్యా ధ్యేయం" అని గాంధీజీ అభిప్రాయం. ఉపాధ్యాయుడి అంతిమ లక్ష్యం సత్ప్రవర్తన, ఉన్నత వైఖరులను విద్యార్థులలో అలవడేటట్లు చేయడం అని రేమాంట్' అంటాడు.

వృత్తికోసం విద్య 

పూర్వం పిల్లలు తమ తల్లిదండ్రుల వృత్తులనే చేపట్టేవారు. పారిశ్రామిక విప్లవం తరువాత జీవన విధానాలలో చాలా మార్పు వచ్చింది. సమాజ అవసరాలను తీర్చేందుకు వృత్తివిద్యా సంస్థలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. వృత్తి విద్య చాలా ప్రాముఖ్యం అయింది.. వృత్తి విద్య వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగిస్తుంది. చదువుతోపాటు తోటపని, అగరబత్తీల తయారీ వంటివి ప్రవేశపెట్టడం జరిగింది. గాంధీగారి బేసిక్ విద్యావిధానంలోని. మూలసూత్రం కూడా ఇదే. జాతీయ విద్యా కమీషన్ ఈ ఉద్ధేశంతోనే "పని అనుభవం”. ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. వృత్తికోసం వ్యక్తిని తయారుచేయడం విద్యాధ్యేయం అయినప్పటికి విద్య సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడాలి..

సాంస్కృతిక వారసత్వం కోసం విద్య 

సంస్కృతి అనగా జీవన విధానం. జ్ఞానం, నమ్మకాలు, కట్టుబాట్లు, విలువలు, ఆర్ధిక, నైతిక, న్యాయ, మత సంబంధ సంప్రదాయాలన్నింటిని కలిపి సంస్కృతి అంటారు. మానవ సంస్కృతిని పదిలపరచి, అభివృద్ధి పరచి తరవాత సంతతివారికి అందించేదే విద్య.

విరామకాల సద్వినియోగం కోసం విద్య

జీవనోపాధికి సంబంధించిన పనుల్లో నిమగ్నంగాకుండా ఉన్న కాలాన్ని విరామకాలం అంటారు. విరామకాలాన్ని సద్వినియోగం . చేసుకుంటే మానవుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. విద్యలేని వ్యక్తి తన విరామకాలాన్ని నిరుపయోగమైన మాటలతో, కొట్లాటలతో, వ్యసనాలతో వ్యర్థపరుస్తారు. విద్యావంతులు జ్ఞానాభివృద్ధికి, స్వీయ అభివృద్ధికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో, సంఘసేవ కార్యక్రమాల్లోను 'పాల్గొని సమాజానికి ఉపయోగపడుతూ, ఉల్లాసంగాను, ఉత్సాహంగాను ఉంటారు.

ఆత్మసాక్షాత్కారం కోసం విద్య

ఆత్మ సాక్షాత్కారం అంటే ప్రకృతి. మానవుడు, దేవుడు వీటికి గల అన్యోన్య సంబంధం గురించి అవగాహన ఉండటం. కొందరు విద్యావేత్తలు శిశువులో ఉన్నత నైతిక విలువలను పెంపొందించి, ఆధ్యాత్మిక జ్ఞానం సాధించేటట్లు చేయడమే విద్యాలక్ష్యంగా భావిస్తారు. శాంతి, సంతోషం, ఆనందం మానవులకు ఆత్మ సాక్షాత్కారం అంటారు. 

మానవత్వం కోసం విద్య

జ్ఞాన సముపార్జన ఒక్కటే మానవుడికి ప్రధానంకాదు. దురదృష్టవశాత్తు మానవుడు తన స్వభావాలను విడనాడి విశాల హృదయాన్ని పెంచుకోలేక పోతున్నాడు. "బలమే న్యాయం" అనే ఆటవిక న్యాయాన్ని చూపుతూ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, మోసాలు విపరీతంగా పెరిగి సభ్యసమాజం తలవంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి స్థితిలో మానవుడిలో మానవతా విలువలు పెంపొందించవలసిన అవసరమున్నది. విద్య మానవుడిలో ఆలోచనాశక్తిని పెంచుతుంది. మానవసేవయే మాధవసేవ అనే భావాన్ని


“అందరికీ సౌఖ్యం, దుఃఖం ఎవరికీ వద్దు" (Happiness to all sorrow to none) “సర్వేజనా సుఖినోభవంతు" సూత్రాలను అందరూ పాటించేటట్లు చూడాలి. విద్య మానవులను మానవతా వాదులుగా చేయాలి. అలా చేయడానికి విద్య దోహదపడుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section