Type Here to Get Search Results !

Vinays Info

వైయక్తిక విద్యా ధ్యేయాలు (Individual Aims of Education)

వైయక్తిక విద్యా ధ్యేయాలు (Individual Aims of Education) - Perspectives in Education

వైయక్తిక విద్యా ధ్యేయాలు (Individual Aims of Education) - Vidhya Drukpathalu - Vinays Info


Perspectives in Education(toc)

వ్యక్తి కేంద్రంగా రూపొందినవి వైయక్తిక లక్ష్యాలు. ప్రతిజీవికి వంశపారంపర్యంగా, 'స్వభావ సిద్ధంగా ఎంతో కొంత మేరకు విజ్ఞానం అనువంశికతా దృష్ట్యా సంక్రమిస్తుంది. అది ' సహజసిద్ధం. ఈ విజ్ఞానం ఒక్కొక్కరిలో ఒక్కొక్క మోతాదులో ఉంటుంది. ఈ వ్యత్యాసానికి అనేక శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక కారణాలు ప్రాధాన్యత వహిస్తాయి. విద్య కొన్ని లక్ష్యాలతో అందరిని తీర్చిదిద్దేందుకు దోహదపడి, సమాజ అభ్యున్నతిలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. 'వ్యక్తిత్వం జీవితాదర్శం' అంటూ తుదకు ఒక విద్యాపథకాన్ని అత్యున్నతమైన వైయక్తిక శ్రేష్ఠతను పెంపొందించడంలో ఏ మేరకు విజయవంతమైంది అనే అంశం ఆధారంగా అంచనా వేయాలి' సర్ పెర్వీనన్. విద్య వ్యక్తి శిక్షణ, అతని అభివృద్ధి లక్ష్యంగా పురోగమిస్తుంది. వ్యక్తికి, సమాజంలోని తన హక్కులను, బాధ్యతలను గుర్తించడమే తన లక్ష్యంగా విద్య పనిచేస్తుంది. వైయక్తిక విద్యాలక్ష్యాన్ని ఈ కింది అభిప్రాయాల ద్వారా మరింతగా విశ్లేషించవచ్చు. 

జీవితావసర దృక్పథం (Biological Perspective)

ప్రతి వ్యక్తి స్వభావ సిద్ధ భావజాలంతో జన్మిస్తాడు. అతడి స్వభావంలో మార్పుతేవడం చాలా కష్టం.

"విద్య వ్యక్తి కోసం ఉద్దేశించబడింది. వ్యక్తి సమాజంలో బ్రతుకుతూ, సంపూర్ణ ఆనందమయమైన జీవితాన్ని గడపడంలో తగు సామర్ధ్యాలను పెంపొందింప జేయడంలో విద్యపాత్ర " - ప్రొ.జి. థాంసన్

విద్యా ప్రగతి సాధనలో అన్నివేళలా కార్యసిద్ధులై సంపూర్ణమైన, ఆనందమయమైన జీవితాన్ని గడిపే సామర్ధ్యాన్ని పెంపొందించడమే విద్యావిధి. ఇందులో అన్ని కార్యక్రమాలను సమర్ధవంతమైన విధివిధానాలతో ప్రగతికి నాంది పలికే కేంద్ర బిందువుగా వ్యక్తి మారాలి.

పుట్టిన ప్రతిజీవి జీవనానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించడం 'ఒక విద్యాలక్ష్యం'గా భావించబడుతుంది.


ప్రాకృతిక దృక్పథం (Naturalistic perspective)

వ్యక్తి స్వభావం దైనందిన అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ విద్య నిర్వహించబడాలి. ప్రకృతి మానవునికి అతని జీవనానికి తోడ్పడే అన్ని వనరులను సహజసిద్ధంగా సమకూర్చింది. మానవునిలో జ్ఞాన పిపాసను కలిగించి, అతని జీవితం ఫలవంతంగా, సంపూర్ణంగా వికసించే అవకాశం ప్రకృతి ప్రసాదితం. వ్యక్తి స్వతంత్ర్య అభివృద్ధియే విద్య ప్రధాన లక్ష్యం.. వ్యక్తి ఎలా ఉండాలో అలా తయారు ప్రకృతి ప్రకారమే నిర్వహించబడాలి.


మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథం (Psychological Perspective)

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు శిశు స్వభావాన్ని అనుసరించి విద్యా ప్రక్రియలో ఏయే లక్ష్యాలు ఏయే దశలలో ఎంతవరకు సాధ్యమో మేధోసంపత్తిని, సామర్థ్యాలను, నైపుణ్యాలను విశ్లేషించి, లక్ష్యసాధనకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికను, బోధనా విధానాలను రూపొందించి వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికై కృషి సల్పుతారు. పాఠ్యప్రణాళికను వైయక్తిక భేదాల కనుగుణంగా సరళంగా (Flexible), విస్తృతం (Broad) గా రూపొందిస్తారు. విద్యాలక్ష్యాలు విద్యా ప్రక్రియకు బాహ్యమైన పరిస్థితులనుంచే ఉత్పన్నమవుతాయి.


ప్రగతిశీల దృక్పథం. (Progressive Perspective)

విద్యార్థి అత్యున్నతమైన వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యంగా పాఠశాలలోని కార్యక్రమాలను రూపకల్పన చేయవలసిన ఆవశ్యకత ఉంది. విద్యా ప్రమాణాలు వ్యక్తి సంపూర్ణాభివృద్ధికి తోడ్పడే పరిస్థితులను రూపొందించవలసి ఉంటుంది. ప్రపంచ చరిత్రలో అనేక గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలు, విద్వాంసులు, మేధావులు ఉద్భవించి ప్రపంచగతిని ప్రగతిపథంలోకి మళ్లించి, సమాజ వికాసానికి, వ్యక్తి వికాసానికి ఎంతగానో తోడ్పడ్డారు. వారినుండి పొందిన స్ఫూర్తి ఆధారంగానే నేటి వ్యవస్థ రూపుదిద్దుకుంది.


ఆధ్యాత్మిక దృక్పథం (Philosophical Perspective)

'మనిషి గొప్ప దైవాంశ శక్తులున్నవాడు. విద్యద్వారా బాహ్య అంతర్గత ప్రకృతిని నియంత్రించడం ద్వారా ఈ గొప్ప శక్తులను తనలోనే వ్యక్తమయ్యేటట్లు చేయడమే ఆశయం'- స్వామి వివేకానంద.

ప్రతి వ్యక్తి అస్థిత్వం కలవాడే. అతని క్రియలకు, అతడే కారణం. ఆధ్యాత్మిక వికాసం వ్యక్తిగతమైనపుడు, వ్యక్తి ఆత్మసిద్ధి పొందేవిధంగా, జీవిత ఉన్నత విలువలు గ్రహించే విధంగా చేయడమే విద్య ముఖ్య విధి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section