Type Here to Get Search Results !

Vinays Info

విద్యా ధ్యేయాలు(Aims of Education)

Top Post Ad

విద్యా ధ్యేయాలు(Aims of Education)

విద్య అనేది ఒక అమూర్త భావన కావడంచేత, విద్యాలక్ష్యాలు అనేవి రుచి ఉండవు. ప్రస్తుత లక్ష్యాలన్నీ వ్యక్తులవి, విద్యార్థులవి, ఉపాధ్యాయులవి, తల్లిదండ్రులవి, సమాజానివి. విద్యాలక్ష్యాలు, విధులు వేరువేరుగా భావించరాదు. వ్యక్తి అభిరుచులు, ఆశయాలు తీర్చడంలో . విద్య దోహదపడుతుంది. 'అసహాయుడైన జంతుభావంగల చిన్న పసివాడిని, సంతోషభరితమైన, నైతికవిలువలు పాటించే ఒక సమర్ధవంతమైన మానవుడుగా తయారు చేయడమే విద్యావిధి' అంటారు. -  జాన్ డ్యూయీ

వ్యక్తి అభివృద్ధికి రెండు రంగాలున్నాయి

1. వ్యక్తిగత అభివృద్ధి (Individual development)

2. సామాజిక అభివృద్ధి (Social development)

విద్యాలక్ష్యాలు కూడా ఈ విధంగా విభజించబడతాయి. నిరంతర విజ్ఞానాభివృద్ధి వల్ల మానవుని అవసరాలు, అభిరుచులలో కూడా మార్పులు సహజం. నిరంతర ప్రగతి విద్యావిధులు.. విద్యా లక్ష్యాలలో మార్పులు కలిగిస్తాయి. లక్ష్యం లేని విద్య చుక్కాని లేని నావవంటిది. 

విద్యా ధ్యేయాల ప్రాముఖ్యత.

విద్య ఒక నిర్ణీత కార్యక్రమం. దీనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు విద్యావేత్తలు కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తారు. దానిలో భాగంగా పాఠ్యప్రణాళికలు, బోధనాపద్ధతులు, బోధనాభ్యసన పరిస్థితుల కల్పన జరుగుతుంది. ధ్యేయాలు లేనట్లైతే చుక్కానిలేని పడవవలె విద్యావ్యవస్థ మారుతుంది. విద్యాస్థాయినిబట్టి స్వభావాన్నిబట్టి కూడా లక్ష్యాలు మారతాయి.

విద్యా ధ్యేయాలు ఈ కింది ప్రధాన అవసరాలు తీర్చుటకు ఆధారాలుగా ఉంటాయి. 

1. విద్యా ప్రక్రియల అంచనా

2. లక్ష్యాల గమ్య సాధన

3. అర్ధవంతమైన విద్యాభ్యసన

4. 'సమగ్ర మూల్యాంకనం

5. విద్యాప్రగతి తెలుసుకోవడం

6. పాఠ్య బోధన

విద్యా ధ్యేయాలు(Aims of Education - Vidhya Drukpathalu విద్యా దృక్పథాలు - Perspectives in Education

విద్యా లక్ష్యాలను ప్రధానంగా రెండు విభాగాలుగా పేర్కొంటారు.

1. వైయక్తిక లక్ష్యాలు (Individual Aims)

2.సామాజిక లక్ష్యాలు(Social Aims)

వీటినే సాంప్రదాయక, సమకాలీన విద్యాధ్యేయాలని వర్గీకరించవచ్చు. వీటిని, శాస్త్రీయ / పురాతన లక్ష్యాలని, ఆధునిక లక్ష్యాలని కూడా విభజించెదరు. అంతేగాక వీటిని సాధారణ, సాంకేతిక లక్ష్యాలని కూడ విభజిస్తారు. విద్యా ఉద్దేశ్యాలను అనేక రకాలుగా వర్గీకరించవచ్చని గమనించాలి. ప్రత్యేక, సార్వజనీన ఉద్దేశ్యాలని కూడ విభజిస్తారు. ప్రత్యేక ఉద్ధేశ్యాలు ప్రత్యేక పరిస్థితులలో నిర్ణయిస్తారు. అంతేగాక ఇవి అపరిమితమైనవి, ఒక ప్రాంతానికి కాని, ఒక కాలానికే కాని సంబంధించి ఉంటాయి. వీటికి ప్రాంతీయ, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులతో సంబంధం ఉండదు. వీటివల్ల మొత్తం జాతి లాభం పొందుతుంది. వ్యక్తిగత ఉద్ధేశ్యాలు, వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. సమాజంకంటే వ్యక్తి ముఖ్యమని భావిస్తారు. వ్యక్తి అభివృద్ధే లక్ష్యాలుగా విద్యా కార్యక్రమాలు ఉండాలని వీరి అభిప్రాయం. సామాజిక ఉద్దేశాలు వ్యక్తి అభివృద్ధికన్నా సమాజ అభివృద్ధి ఉన్నతమైనవని భావిస్తారు. సమాజం దృష్టిలో ఉంచుకొని. లక్ష్యాలు నిర్ణయించబడాలని సామాజిక వాదుల భావన. వాస్తవానికి వ్యక్తి, సమాజం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. రెండునూ పరిపూరకంగా ఉంటాయి.

వ్యక్తి మంచి పౌరుడుగా, వ్యక్తులు మంచి పౌరులుగా ఎదగాలంటే ఈ రెండింటి మధ్య అంటే వ్యక్తి, సమాజం మధ్య పరస్పర అవగాహన పూర్వక సమతౌల్యత ఎంతైనా ఆవశ్యకం. ఒక లక్ష్యంతో పనిచేయడమంటే వ్యక్తి, సమాజం ఇరువురూ ప్రగతిని కాంక్షించడమే.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.