Type Here to Get Search Results !

Vinays Info

శాతవాహన పాలకులు

శాతవాహన పాలకులు

శ్రీముఖుడు
-పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు మొదటివాడు.
-ఇతడే శాతవాహన రాజ్య స్థాపకుడు.
-కోటిలింగాల వద్ద దొరికిన శ్రీముఖునికి సంబంధించిన 8 నాణేల్లో ఒకటి మాత్రమే పోటెన్ అనే మిశ్రమ నాణెం, మిగిలినవన్నీ రాగి నాణేలు.
-ఈ నాణేలపై శ్రీముఖుని పేరు చీముకుడని ముద్రించి ఉంది.
-శాసనాల్లో సిముకుడిగా, పురాణాల్లో చిస్మకుడుగా, నాణేలపై చీమకుడుగా ముద్రించారు.
-శ్రీముఖుడు మొదట జైన మతాన్ని స్వీకరించి అనేక జైన గుహలను నిర్మించారు.
-తన చివరి రోజుల్లో వైదికమతాన్ని స్వీకరించాడు.
-ఇతను తన పరిపాలన కాలంలో భూజక, పిటినిక, పుళింద మొదలైన జాతులను ఓడించి రాజ్య విస్తరణకు పునాదులు వేశాడు.
-శ్రీముఖుడు రఠికుల కుమార్తె నాగానికకు తన కుమారుడైన మొదటి శాతకర్ణితో వివాహం జరిపించి, వారి సహాయంతో తన ఆధిక్యతను పెంపొందించుకున్నాడు.
-మౌర్య చక్రవర్తి అశోకుడు శ్రీముఖునికి రాజ అనే బిరుదును ఇచ్చాడు.

కృష్ణుడు (కన్హ)
-శ్రీముఖుని మరణానంతరం అతని కుమారుడైన మొదటి శాతకర్ణి యుక్త వయస్కుడు కానందున శ్రీముఖుని సోదరుడు కృష్ణుడు రాజయ్యాడు.
-ఇతను కన్హేరి, నాసిక్ గుహలను తొలిపించాడు.
-శాతావాహనుల్లో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఇతడు.
-ఇతని శాసనం ప్రకారం ఇతని రాజోద్యోగి (మహామాత్ర) ఒకరు నాసిక్‌లో బౌద్ధగుహాలయాన్ని నిర్మించాడు.
-ఇతను వేయించిన కన్హేరి శాసనంలో మహామాత్ర అనే పదంవల్ల శాతవాహనులు మౌర్యుల పాలనా విధానం కొనసాగించినట్లు తెలుస్తుంది.

మొదటి శాతకర్ణి
-పురాణాలు మొదటి శాతకర్ణి కృష్ణుని కుమారుడని పేర్కొన్నాయి.
-కానీ నానాఘాట్‌లోని శిల్పాలను బట్టి మొదటి శాతకర్ణి శ్రీముఖుని కుమారుడని తెలుస్తుంది.
-ఇతని భార్య నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంవల్ల ఇతని ఘనత తెలుస్తుంది.
-మొదటి శాతకర్ణి శుంగులపై విజయానికి చిహ్నంగా రెండు అశ్వమేథయాగాలు, ఒక రాజసూయయాగం, అనేక క్రతువులు నిర్వహించి దక్షిణాపథపతి అనే బిరుదును పొందారు.
-నానాఘాట్ శాసనాన్ని బట్టి ఇతనికి వీర, శూర, అప్రతిహతచక్ర బిరుదులు ఉన్నట్లు తెలుస్తుంది.
-ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రకారం ఖారవేలుడు మొదటి శాతకర్ణిని లెక్కచేయక తన సైన్యాలను కన్నబెన్న వరకు పురోగమించి ముషిక నగరాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section