ప్రపంచ హోమియోపతి దినోత్సవం(Wold Homeopathy Day)
ప్రపంచ హోమియోపతి దినోత్సవం(Wold Homeopathy Day)
ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి ఏట ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. జర్మన్ దేశానికి చెందిన డా. క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ అనే ఫిజిషియన్ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు.
మలేరియా వ్యాధి నివారణకు సంకోనబెరడుతో చేసిన మందువాడుతారని తెలుసుకున్న హనెమన్ ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెల్సుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనమీద తన స్నేహితులమీద ప్రయోగాలు జరిపి, ఏ ఔషదమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషదం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు. తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించడంతోపాటు, ఈ నూతన వైద్య విధానికి హోమియోపతి గా నామకరణం చేశాడు.