డిసెంబర్ 10 అంటే మనకు గుర్తు కు వచ్చేది మానవ హక్కుల దినోత్సవం ...దీనికి సంబంధించి న కొన్ని సంగతులు తెలుసుకుందాం ....
హక్కు అంటే ఒక విధమైన స్వేచ్ఛ. . ఆ స్వేచ్ఛ ను అనుభవించే అధికారం మనకు ఉంది. ఫలానాది మాత్రమే హక్కు అని నిర్వచనం ఇవ్వాలేము . అమ్మ కడుపులో నుండే మన హక్కులు మొదలు అయి చివర శ్వాస వరకు ఉంటాయి .
ఉదాహరణ ::-జీవించే హక్కు
మానవ హక్కులు అత్యంత ముఖ్యమైనవి. ఈ మానవ హక్కుల కోసం ఎంతోమంది తమ ప్రాణాలు సైతం అర్పించారు. వేల సంవత్సరాలపాటు ఈ పోరాటం చేసారు ఇప్పటికీ పోరాటం సాగుతుంది ..
కోంత కాలం క్రితంవరకు మనకు మానవ హక్కులు లేనేలేవు. కాలక్రమేణా ప్రజలకు హక్కులు, స్వేచ్ఛకావాలనే భావానికి ఊపిరులందాయి.
మొదట్లో కేవలం ధనికులకు భూస్వాములకు మాత్రమే ఉండేవి . సాధారణ ప్రజలకు ఏ విధమైన భద్రతా లేదు. ఏ హక్కులూ లేవు.
సంవత్సరాలు గడిచేకొద్ది ప్రతి వ్యక్తిలో హక్కులు కావాలనే భావానికి ఆదరణ పెరిగింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్య దేశాలు మానవ హక్కుల ఆవశ్యకతను గుర్తించి దాని ఫలిత మే
ఈ హక్కుల పత్రమే ‘సార్వజనీన మానవ హక్కుల ప్రకటన’గా ఖ్యాతిపొందింది
మానవ హక్కుల పత్రంలో మొదటి హక్కుగా ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం సిద్ధించాయి. ప్రతి ఒక్కరికీ సొంత ఆలోచనలు, భావాలు ఉన్నాయి. అందర్నీ ఒకేలా ఆదరించాలి.
, క్రీస్తుపూర్వం 539 సంవత్సరంలో ‘సైరస్ ది గ్రేట్’ బాబిలాన్ నగరాన్ని చేజిక్కించుకున్నాక, ఎవరూ ఊహించని విధంగా బానిసలను విడుదల చేసి, వాళ్ళు సొంత ఇళ్ళకి వెళ్ళేలా చర్యలు తీసుకున్నాడు. అంతేకాకుండా, ప్రజలు తమకు ఇష్టమైన మతాన్ని చేపట్టవచ్చని స్పష్టంచేశాడు.
మట్టితో చేసిన పత్రంపై ముద్రించిన ‘సైరస్ సిలిండర్’ ప్రతిపాదనలే చరిత్రలో మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన.
చరిత్ర లో మానవ హక్కుల చట్టాలు
1215: ది మాగ్న కార్ట- ప్రజలకు నూతన హక్కులు కల్పించి, రాజు చట్టానికి బద్ధుడిగా చేయడం
1628: హక్కుల పత్రం- ప్రజల హక్కుల్ని సిద్ధంచేయడం
1776: అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్య్ర ప్రకటన- జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందంగా బతకడం
1789: పౌరుల, పురుషుల హక్కుల ప్రకటన: చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమని ఫ్రాన్స్ ప్రకటించింది.
1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఐ.రా.స ఉద్భవించింది. ఈ సంస్థ ద్వారా మానవ హక్కులు, శాంతి నీ కాపాడటానికి
‘సార్వజనీన మానవ హక్కుల ప్రకటన పత్రం’ రూపోందిచారు..
1948: సార్వజనీన మానవ హక్కుల ప్రకటన: ప్రతి మానవుడికి సంక్రమించిన హక్కులను ప్రప్రథమంగా ముద్రించిన పత్రం.
భారతదేశంలో 1993లో రూ పొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి 8 నుండి అమలులోకివచ్చింది.
రాష్ట్ర స్థాయిలలో కూడా మానవ హక్కుల కమి షన్‌లకు ఏర్పాటు చేయాలని సూచించినా దేశంలో కొన్ని రాష్ట్రాలకు మానవ హక్కుల కమిషన్‌లు లేవు
‘చట్టం ముందు అందరూ సమానులే’, అనే పాలకుల మాటలు నీటి మూటలని తేట తెల్లమైంది. ప్రజాపోరాటాల ద్వారానే, చరి త్రలో ‘హక్కులు’ సంక్రమించాయి తప్ప అవి పాలకుల ‘భిక్ష’ కాదు.
కానీ ప్రస్తుతం ‘హక్కు ల’ ఉల్లంఘన నిత్యం జరుగుతోంది. దీనిని ఎదుర్కోవాలంటే సంఘటిత శాంతి పోరాటమే ఏకైక మార్గం దీనికి చదువు ప్రేరణ అందిచాలి... సమాజం లో
కులం జాతి రంగు మతం వంటి వాటికి స్థానం లేకుండా మానవత్వ ని కి విలువ ఇచ్చిన రోజే నిజమైన దినోత్సవం ...
...
✍ written by జి.లెనిన్ S.A SOCIAL STUDIES