తెలంగాణ సిద్ధాంత కర్త?
- ప్రొ. జయశంకర్
సీఎం కేసీఆర్ జాతీయ జండాను తొలిసారిగా ఎక్కడ ఎగురవేశారు?
- గోలకొండ కోటపై, ఆగస్టు 15న
తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎన్ని కి.మీ.లు?
- 1586.09 కి.మీ. (6 జాతీయ రహదారులు)
తెలంగాణ లక్ష్మీబాయి అని ఎవరికి పేరు?
- సంగెం లక్ష్మీబాయి
హైదరాబాద్ ప్రకాశం అంటే ఎవరు?
- స్వామి రామానంద తీర్థ
1952-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్?
- కాశీనాథరావ్ వైద్య
ఇండియన్ తోరోదత్ అని ఎవరిని అంటారు?
- సరోజినీ నాయుడు
తెలంగాణ పటేల్ అంటే ఎవరు?
- బొమ్మకంటి సత్యనారాయణ రావు
హైదరాబాద్ సింహం?
- పండిత నరేంద్రజీ
ఇండియన్ మార్టిన్ లూథర్, ఇడియన్ ఐన్‌స్టీన్ ఎవరు?
- ఆచార్య నాగార్జునుడు
దాశరథి కృష్ణమాచార్యుని రచనలు?
- అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, కవితా పుష్పకం, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం
ఉమర్ ఖయ్యూం రచించిన తెలంగాణ కవి?
- బూర్గుల రామకృష్ణారావు
1921లో జరిగిన ఆంధ్రజనసంఘం సమావేశంలో తొలిసారిగా తెలుగులో మాట్లాడిన వ్యక్తి?
- అల్లంపల్లి వెంకట రామారావు
హైదరాబాద్ భారతదేశం అనే గుండెపై పుట్టిన రాచపుండు అన్నదెవరు?
- సర్దార్ పటేల్
పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు సభ్యులు ఎవరు?
- కేవీ రంగారెడ్డి, జేవీ రంగారావు, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి
తెలంగాణలో ఒగ్గు కథా చక్రవర్తి అని ఎవరిని అంటారు?
- మిద్దె రాములు