Type Here to Get Search Results !

Vinays Info

POLITY GK

Top Post Ad

పాలిటి జీకే

» రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా 1942లో ప్రతిపాదించింది క్రిప్స్ మిషన్.
» రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎం.ఎన్. రాయ్.
» క్యాబినెట్ మిషన్ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ను 1946లో ఏర్పాటు చేశారు.
» రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు 1946 జులై నుంచి సెప్టెంబరు వరకు జరిగాయి.
» 1946, డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది.
» మొదటి సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
» 1946, డిసెంబరు 11న డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
» 1946, డిసెంబరు 13న జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
» లక్ష్యాల తీర్మానాన్ని 1947 జనవరి 22న ఆమోదించారు.
» 1947 జులై 22న జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
» రాజ్యాంగ ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు.
» 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు.
» 1950 జనవరి 24న చివరిసారిగా సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలోనే జాతీయ గీతం, జాతీయ గేయాలను ఆమోదించారు.
» 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
» రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు, సంస్థానాలకు ప్రాతినిధ్యం కల్పించారు.
» రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఓటు బదిలీ అనే పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
» మొత్తం సభ్యుల సంఖ్య 389.
» రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 292.
» స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 93.
» చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 4.
» దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య 299.
» 299 మందిలో ఎన్నికైన సభ్యులు 229, నామినేటెడ్ సభ్యులు 70.
» మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211.
» రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
» సమావేశాలు నిర్వహించిన మొత్తం రోజులు 165.

రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు 64 లక్షలు.
» సంప్రదించిన రాజ్యాంగాలు 60.
» రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యులు 9 మంది.
» రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు.
» మౌలిక రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి.
» ప్రస్తుత రాజ్యాంగంలో 462 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.