Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ చరిత్ర

Top Post Ad

కాళోజీ సోదరులు అంటే ఎవరు?
- కాళోజీ రామేశ్వరరావు (ఉర్దూ), కాళోజీ నారాయణ రావు (తెలుగు)

తొలి తెలుగు కథకురాలు ఎవరు?
- బండారు అచ్చమాంబ

కలం అలలపై తేలేను మనసు మల్లెపూవై అనే సినిమా పాటను రాసిన తెలంగాణ కవి?
- డా. సి.నారాయాణ రెడ్డి (గులే భకావళి కథ)

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన రోజు?
- 2011, జనవరి 6న

రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
- 2014, నవంబర్ 6న (ఎస్సీ, ఎస్టీల కోసం)

కోటిలింగాల బౌద్ధ ఆరాధనా స్థలమని తెలిపే జాతక కథ ఏది?
- శెరవనిజ (శ్రీవనిజ)

గౌతమ బుద్ధుడు చేర్చుకున్న (బౌద్ధ సంఘంలో) రాజ నర్తకి ఎవరు?
- ఆమ్రపాలి

దాశరథి కృష్నమాచార్య రాసిన జాతక కథల పద్యకావ్యం పేరు?
- మహాబోధి (1960)

-బావరి (నిజామాబాద్ జిల్లా) శిష్యులు బుద్ధునితో సంభాషించిన పాళీ భాషలోని గ్రంథాలు
1. సుత్తనిపాత 2. పారాయణ వగ్గ

తెలుగు భాషలో తొలిసారిగా బౌద్ధంతో పరిచయం కలిగించిన గ్రంథం?
- పాల్కురికి సోమన రాసిన పండితారాధ్య చరిత్ర

బుద్ధుని జ్ఞాన సిద్ధాంతానికి పునాది ఏది?
- ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం

తెలంగాణలో బౌద్ధమత వ్యాప్తికి కారణమైన తత్వవేత్తలు?
- ఆచార్య నాగార్జునుడు. ఆర్య దేవుడు, బుద్ధఘోషుడు, బుద్ధ పాలితుడు, వసు బంధుడు, అసంగుడు, ధర్మకీర్తి

తెలంగాణలో ఇక్షాకుల తర్వాత బౌద్ధాన్ని ఆదరించిన రాజులు?
- విష్ణు కుండినులు

నాగార్జునకొండలో నివసించిన బౌద్ధ శాఖ ఏది?
- మహా సాంఘిక శాఖ

డా. సి.నారాయణ రెడ్డి రాసిన పద్యకావ్యం (బౌద్ధం) ఏది

ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో ఏ శిలపై ప్రతిష్టించారు?
- జీబ్రాల్టర్ శిల

వజీర్ సుల్తాన్ కంపెనీని హైదరాబాద్‌లోని అజామాబాద్‌లో ఎప్పుడు నెలకొల్పారు?
- 1930లో

ఢిల్లీకి హైదరాబాద్‌కు మధ్య దూరం?
- 1680 కి.మీ.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని మా భూమిగా సినిమా తీసిన దర్శకుడు?
- బీ నర్సింగరావు (1979) మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఈ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్‌ప్లేకి నందీ అవార్డ్ అందుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత పైడి జయరాజ్ (హిందీ) ఏ జిల్లాకు చెందినవారు?
- కరీంనగర్

1975లో బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు హీరోయిన్?
- సంగీత (హన్మకొండకు చెందినవారు)

తొలి తెలుగు సినీ కవి?
- చందాల కేశవదాసు (భక్త ప్రహ్లాద- 1931). ఆయన ఖమ్మం జిల్లా జక్కెపల్లికి చెందిన వారు.

మషీర్-ఏ-దక్కన్ పత్రికను నడిపించిందెవరు?
- మాడపాటి హన్మంతరావు

తెలంగాణలో తొలి తెలుగు దినపత్రిక?
- తెలంగాణ (1941-42), దీన్ని బుక్కపట్నం రామానుజాచార్యులు నిర్వహించారు.

తెలంగాణ జర్నలిజానికి పూజనీయుడనదగినవాడు?
- షోయబుల్లాఖాన్

వందేమాతరం గీతాన్ని ఆలపించిన రామచంద్రరావు ఇంటిపేరు?
- వావిలాల

ఆర్యసమాజానికి పోటీగా నిజాం స్థాపించిన పోటీ సంస్థలు ఏవి?
- దీన్‌దార్, తబ్లిక్, ఇత్తేహాదుల్ ముసల్మీన్

ఏడో నిజాంపై బాంబు విసిరింది ఎవరు?
- నారాయణరావు పవార్ (20 ఏండ్ల వయస్సులో), 1947, డిసెంబర్ 4న

హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లో ఆర్యసమాజంను ఎప్పుడు స్థాపించారు?
- 1892లో

తెలంగాణ సాయుధపోరాట తొలి విప్లవ విజయం?
- చాకలి ఐలమ్మ పోరాటం (1945)

దేవరకొండ గాంధీ అంటే ఎవరు?
- మునగాల కొండలరావు

కోదాడ గాంధీ అని ఎవరిని అంటారు?
- గుడుగుంట్ల అప్పయ్య

తెలంగాణ సరిహద్దు గాంధీ ఎవరు?
- సర్దార్ జమలాపురం కేశవరావు

దిగంబర కవి నిఖిలేశ్వర్ అసలుపేరు?
- యాదవరెడ్డి

ప్రజానాట్య మండలిని ఎప్పుడు ప్రారంభించారు?
- 1943లో

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.