Type Here to Get Search Results !

Vinays Info

శతకాలు

Top Post Ad

అధిక్షేప శతకాలు
- భగవంతుడిని అధిక్షేపిస్తూ విమర్శనాత్మకంగా రాసిన శతకాలకు అధిక్షేప శతకాలు అని పేరు.
- తెలుగు అధిక్షేప శతకాల్లో మొదటిది చౌడప్ప శతకం. ఈ శతకాన్ని రాసిన కవి చౌడప్ప.
- పది నీతులు, పది బూతులు, పది శృంగారాలు గల పద్యాలను సభలో చదివినవాడే అధికుడని చెప్పిన కవి చౌడప్ప.
కొన్ని అధిక్షేప శతకాలు
- భార్గవ శతకం, కుక్కుటేశ్వర శతకం, భక్త మందార శతకాలు - కూసుమంచి జగ్గకవి.
- రామలింగేశ శతకం - ఆడిదము సూరకవి. (ఈ శతకం 18వ శతాబ్ద కాలం నాటి సాంఘిక చరిత్రకు దర్పణం పడుతుంది)
- గువ్వలచెన్న శతకం - గువ్వలచెన్నడు
- సిరిసిరిమువ్వ శతకం - శ్రీశ్రీ
- నార్లవారి మాట శతకం - నార్ల వెంకటేశ్వరరావు
- దాశరథి శతకం - దాశరథి కృష్ణమాచార్యులు
- పిల్లి శతకం - బోయి భీమన్న
- సమ దర్శనం - సీ నారాయణరెడ్డి
- శ్రీనివాస శతకం - కృష్ణ కౌండిన్య
శృంగార శతకాలు
- శృంగార రసాత్మకమైన శతకాలకు శృంగార శతకాలు అని పేరు.
- శృంగార శతకాల్లో మొదటిది తాళ్లపాక అన్నమాచార్యులు రాసిన శ్రీవేంకటేశ్వర శతకం.
శృంగార శతకాల్లో ముఖ్యమైనవి
- నందనందన శతకం - పుసులూరి సోమరాజ కవి
- సుందరీమణి శతకం - గోగులపాటి కూర్మనాథ కవి
- బ్రహ్మానంద శతకం - గోపీనాథం వెంకట కవి
- కీరవాణి శతకం - గంగాధర కవి
- కృష్ణ శతకం - సెట్టి లక్ష్మీనరసింహ కవి
- శృంగార శతకం - మల్లాది శివరాం
హాస్య శతకాలు
- హాస్య శతకాలు అంటే హాస్యరస సంబంధమైనవి.
హాస్య శతకాల్లో ముఖ్యమైనవి
- పొగచుట్ట శతకం - కవి పేరు తెలియదు
- చీపురుపుల్ల శతకం - సామినేని వెంకటాద్రి కవి
- విసనకర్ర శతకం - హరిబ్రహ్మేశ్వర కవులు
ప్రకీర్ణ శతకాలు
- ప్రకీర్ణ శతకం అంటే వస్తు నియమాన్ని ఒక క్రమంగా పాటించక విభిన్న అంశాలను ఒకచోట చేర్చి రాసిన శత కం. ఈ శతకాన్ని రాసినవారిలో మొదటివాడు వేమన.
కొన్ని ప్రకీర్ణ శతకాలు
- శాంతానంద యోగిరామ శతకం - శాంతానందయోగి
- అహంకార శతకం - తోట వెంకట నర్సయ్య
- సర్వలోకేశ్వర శతకం - శేషాద్రి రమణ కవులు
- మందేశ్వర శతకం - దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి
విభిన్న వస్తుక శతకాలు
- విభిన్న వస్తువులతో కూడిన శతకాలకు విభిన్న వస్తుక శతకాలు అని పేరు.
ఈ శతకాల్లో ముఖ్యమైనవి
- వేంకటేశాంధ్రం అనే అచ్చ తెలుగు నిఘంటువు శతకం - గణపవరపు వెంకట కవి.
- ఆంధ్రనామ శేషం అనే నిఘంటువు - ఆడిదము సూరకవి.
- అలంకార వసంతం - చలమచర్ల రంగాచార్యులు.
- భాషా వ్యాకరణ శాస్త్ర విశేషాంశాలకు సంబంధించి గిడుగు సీతాపతి రాసిన శతకం - భారతీ శతకం.
- శతక రూపంలో వెలువడిన స్మృతి కావ్యాల్లో ప్రథమ గణ్యమైనది - విశ్వనాథ సత్యనారాయణ రాసిన వరలక్ష్మీ త్రిశతి.
- హరిజన శతకం - కుసుమ ధర్మన్న.
- అమృతాంజన శతకం - కరినారాయణాచార్యులు
కథాత్మక శతకాలు
- కథ ప్రధానంగా రాసిన శతకాలు.
కథాత్మక శతకాల్లో ముఖ్యమైనవి
- ముకుంద రాఘవ శతకం - జూలూరి లక్ష్మణ కవి.
- ప్రసన్న రాఘవ శతకం - వంగూరి ముద్దు నర్సకవి.
- రామాయణ సంగ్రహ శతకం - మంగిపూడి వీరయ సిద్ధాంతి.
- భారత కృష్ణ శతకం - భువనగిరి లక్ష్మీకాంతం
- ఆత్మకథా రూపంలో వెలువడిన శతకం - హరిహరేశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినది మండపాక పార్వతీశ్వర శాస్త్రి.
- బిల్హేశ్వర శతకం - కొక్కొండ వెంకటరత్నం పంతులు.
- టెంకాయ చిప్ప శతకం - వావిలకొలను సుబ్బారావు.
- బాలకోటేశ్వర శతకం - తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి.
- దారుణ శతకం - చిదంబర శాస్త్రి
- చెళ్లపిల్ల వెంకటశాస్త్రి రాసిన శతకాలు - ఆరోగ్య కామేశ్వరి శతకం, ఆరోగ్య భాస్కరస్తవం, మృత్యుంజయ శతకం.

Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.