నాటకం(Naatakam)
దృశ్య కావ్యమయిన నాటకం దశరూపకాల్లో అన్యతమము. నాటకంలో వస్తువు ప్రఖ్యాతం, నాయకుడు ప్రఖ్యాతుడు, ఉదాత్తుడు,దివ్యమైన రాజర్షివంశ చరిత్ర, నానా విభూతులు, అభ్యుదయ విలాసాది గుణాలు, అంకం, ప్రవేశం మొ॥ వాటన్నిటినీ కలిపి నాటకమంటారు.
నాటకంలో 1. పూర్వరంగం, 2. నాంది, 3. ప్రస్తావన, 4. అంకం, 5. అర్థోపక్షేపకాలు, 6. అర్థ ప్రకృతులు, 7. కార్యావస్థలు, 8.పంచసంధులు, 9. పతాకస్థాయిలు, 10. భరత వాక్యం ఉంటాయి.
తెలుగులో చిత్రకవి పెద్దన తొలిసారిగా నాటక లక్షణాలను తన లక్షణ సార సంగ్రహంలో వివరించాడు.
కోరాడ రామచంద్ర శాస్త్రి మంజరీ మధుకరీయమనే (1860) నాటకాన్ని రచించాడు. ఇది తెలుగులో తొలి నాటకంగా గుర్తించబడినది.
కొక్కొండ వేంకటరత్నం పంతులు నరకాసుర విజయ వ్యాయోగమనే (1871) సంస్కృత రూపకాన్ని అనువదించాడు.
వావిలాల వాసుదేవ శాస్త్రి జూలియట్సీజర్ అనే అనువాదం, నందక రాజ్యమనే సాంఘిక నాటకం రచించాడు.
కందుకూరి వ్యవహార ధర్మ బోధిని (1880) తొలి ప్రదర్శిత నాటకం.
ఆంధ్ర నాటక పితామహుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు చిత్రనళీయం, విషాధ సారంగధర మొ॥ 23 నాటకాలను రచించాడు.
వసురాయకవిగా పేరుపొందిన వడ్డాది సుబ్బారాయ కవి, భక్త చింతామణి, వేణీ సంహారం, చండకౌశిక నాటకాలను రచించాడు.
చిలకమర్తి గయోపాఖ్యానం (1889) రచించగా వేదం వేంకట రాయశాస్త్రి ప్రతాపరుద్రీయం, గురజాడ అప్పారావు కన్యాశుల్కం(1897) కోలాచలం శ్రీనివాసరావు రామరాజు చరిత్రము (1907), పానుగంటి లక్ష్మీనరసింహం సారంగధర, రాధాకృష్ణ, విప్రనారాయణమొ॥ నాటకాలను రచించారు.