యాత్రా చరిత్ర
యాత్రవలన తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశవిదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక,సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి.
ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసిన కాశీయాత్రా చరిత్ర తెలుగులో వెలువడిన తొలి యాత్రా చరిత్ర.
కోలాశేషాచల కవి నీలగిరి యాత్రలు అనే యాత్రా రచనలో దక్షిణ దేశ వర్ణన చేసాడు.
వెన్నెలకంటి సుబ్బారావు 'ఎ లైఫ్ జర్మీ ఆఫ్సుబ్బారావు' అను ఆంగ్లంలోని యాత్రానుభవాన్ని తెలుగులో అనువదించినవాడు - అక్కిరాజు రమాపతిరావు.
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి యాత్రారచన - కాశీయాత్ర
నా ఉత్తర దేశయాత్ర పేరుతో ఉత్తర భారతదేశాన్ని వర్ణించినవాడు - కె.వి. సుబ్బయ్య.
ఆ కాశారాన్ని వర్ణిస్తూ నాయని కృష్ణకుమారి వ్రాసిన యాత్రారచన - కాశ్మీర దీపకళిక
కాశీ యాత్రాచరిత్రల్లో కొన్ని ముఖ్యమైనవి పరబ్రహ్మశాస్త్రి వ్రాసిన కాశీయాత్ర, ఆదిభట్ల నారాయణదాసు వ్రాసిన కాశీ శతకం,
పాతూరి వ్రాసిన నాయాత్ర, రామసుబ్బారాయుడు వ్రాసిన కాశీయాత్ర కమలాదేవి రచించిన కాశీయాత్ర
బ్రహ్మ మానస సరోవర యాత్ర కాశ్మీర యాత్రను రచించినవాడు - పి.వి. మనోహర్.
- దాశరథి రచించిన యాత్రాచరి - అమెరికా సందర్శనం.
ముద్దు రామకృష్ణయ్య అనే విద్యావేత్త రచించిన యాత్రా చరిత్ర - నా ప్రథమ విదేశీ యాత్ర
సి. నారాయణ రెడ్డి కలం నుండి జాలువారిన యాత్రా చరిత్రలు - 1. పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు, 2. సోవియట్ రష్యాలో కొన్ని రోజులు, 3. సోవియట్ యూనియన్ లో మరోసారి
* సి.నా.రె., దాశరథులు సంయుక్తంగా రచించిన యాత్రాచరిత్ర - ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వరంగ యాత్ర
'నవభారతి' అనే పేరుతో భారతదేశ యాత్రా విశేషాలు రచించినది - మాలతీ చందూర్
హంపీ విహార యాత్రను రచించినది - ముమ్మనేని లక్ష్మీనారాయణ.
నా భారతదేశ యాత్ర అను యాత్రారచన చేసినవాడు - కాళోజీ.