Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆధునిక శతకకర్తలు

Top Post Ad

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆధునిక శతకకర్తలు

కపిలవాయి లింగమూర్తి
- ఈయన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట సమీపంలోని జిన్నుకుంటలో 1928, మార్చి 31న జన్మించారు. తల్లిదండ్రులు మాణిక్యమ్మ, వెంకటాచలం. ఈయన రాసిన శతకాలు - ఆర్యా శతకం, తిరుమలేశ శతకం, దుర్గాభర్గ శతకం, పండరినాథ విఠల శతకం, పరమహంస శతకం.
- ఇతర రచనలు - చక్రతీర్థ మహాత్మ్యం, పాలమూరు జిల్లా దేవాలయాలు, ఛత్రపతి, గద్వాల హనుద్వచనాలు, సౌర శిఖరం, పద్యకథా పరిమళం మొదలైనవి.
- బిరుదులు - కవితా కళానిధి, పరిశోధన పంచానన, గురు శిరోమణి, వేదాంత విశారద, సాహితీ విరాన్మూర్తి మొదలైనవి.
కూరెళ్ల విఠలాచార్య
- ఈయన 1938, జూలై 9న నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, వెంకట రాజయ్య. స్వస్థలం వెల్లంకి గ్రామం. ఈయన రాసిన విఠలేశ్వర శతకం సాహితీలోకంలో చాలా ప్రసిద్ధిగాంచింది.
- ఇతర రచనలు - జీవన వేదం, ఆత్మదర్శనం, అమరవాక్‌సుధా స్రవంతి మొదలైనవి.
పండిత రామసింహ కవి
- ఈయన 1855-1963 మధ్య జీవించారు. జన్మస్థలం కరీంనగర్ జిల్లా. ఈయన శతకం - విశ్వకర్మ శతకం.
ఉత్పల సత్యనారాయణాచార్య
- ఈయన ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో 1927, జూలై 4న జన్మించారు. 2007, అక్టోబర్ 23న హైదరాబాద్‌లో మరణించారు. ఈయన రాసిన శతకం - ఉత్పలమాల శతకం.
- ఇతర రచనలు - ఈ జంట నగరాలు హేమంత శిఖరాలు, గజేంద్రమోక్షం, భ్రమర గీతం, గోపీ గీతం, రాజమాత, వేణు గీతం, యశోదనంద, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి.
- శ్రీకృష్ణ చంద్రోదయానికి 2003లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
గౌరీభట్ల రఘురామ శాస్త్రి
- ఈయన మెదక్ జిల్లా రిమ్మనగూడలో 1929, ఏప్రిల్ 22న జన్మించారు. 2004, ఫిబ్రవరి 4న మరణించారు. ఈయన శతకం - శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక.
- ఇతర రచనలు - వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణదాస చరిత్రం, శివపద మణిమాల, భావానందస్వామి చరిత్ర మొదలైనవి.
అందె వెంకటరాజం
- కరీంనగర్ జిల్లా కోరుట్లలో 1933, అక్టోబర్ 14న జన్మించారు. 2006, సెప్టెంబర్ 11న మరణించారు. ఈయన శతకాలు - నింబగిరి శతకం, ఈశ్వర శతకం.
- వానమామలై వరదాచార్యుల కృతులు-అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశారు.
-బిరుదులు - కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన మొదలైనవి.
ఇమ్మడిజెట్టి చంద్రయ్య
- మహబూబ్‌నగర్ జిల్లా తాళ్లపల్లి గ్రామంలో 1934, మార్చి 31న జన్మించారు. 2001 మార్చి 1న మరణించారు. ఈయన రాసిన శతకాలు - చంద్రమౌళీశ్వర శతకం, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వేంకటేశ్వర శతకం.
- ఇతర రచనలు - హనుమద్రమ సంగ్రామం, భక్త సిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం, శ్రీ శిరీష నగగండికా మహాత్మ్యం, కర్పరాద్రి మహాత్మ్యం మొదలైనవి.
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
- మెదక్ జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. ఈయన 1934-2011 మధ్య కాలంలో జీవించారు. 300లకు పైగా అష్టావధానాలు చేసి అవధాన శశాంక, ఆశు కవితాకేసరి అనే బిరుదులు పొందారు. ఈయన రాసిన శతకం - విశ్వనాథేశ్వర శతకం.
- ఇతర రచనలు - కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీ స్తుతి మొదలైనవి.
నంబి శ్రీధరరావు
-నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 1934లో జన్మించారు. 2000లో మరణించారు. ఈయన రాసిన శతకాలు - శ్రీలొంక రామేశ్వర శతకం, శ్రీమన్నింబగిరి నరసింహ శతకం. ఈయనకు గల బిరుదు కవిరాజు.
గడిగె భీమకవి
- రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో 1920, జనవరి 14న జన్మించారు. 2010, ఏప్రిల్ 3న మరణించారు. ఈయన రాసిన శతకం - వేణుగోపాల శతకం.
కౌకుంట్ల నారాయణరావు
- రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామంలో 1883లో జన్మించారు. 1953లో మరణించారు. ఈయన రాసిన ప్రభు తనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది.
శిరశినగల్ కృష్ణమాచార్యుల
- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 1905, ఆగస్టు 13న జన్మించారు. 1992, ఏప్రిల్ 15న మరణించారు. ఈయన రాసిన శతకం - గాంధీతాత శతకం.
- ఇతర రచనలు - కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రా ప్రబంధం, రత్నమాల మొదలైనవి.
- నైజాం రాష్ట్ర ఆద్య శతావధానిగా ప్రసిద్ధిగాంచారు. అభినవ కాళిదాసు అనే బిరుదు పొందారు.
సూరోజు బాల నరసింహాచారి
-నల్లగొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో 1946, మే 9న జన్మించారు. 2014, ఫిబ్రవరి 2న మరణించారు. ఈయన రాసిన శతకాలు - బాలనృసింహ శతకం, మహేశ్వర శతకం.
- ఇతర రచనలు - కవితాకేతనం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైనవి. సహజకవిగా ప్రసిద్ధుడు.
రావికంటి రామయ్య గుప్త
-కరీంనగర్ జిల్లా మంథనిలో 1936, జూన్ 17న జన్మించారు. 2009, మార్చి 30న మరణించారు. ఈయన రాసిన శతకాలు - నగ్నసత్యాలు శతకం, గౌతమేశ్వర శతకం.
-ఇతర రచనలు - గీతామృతం, వరదగోదావరి.
- వరకవి పేరిట మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. ఈయనకు కవిరత్న అనే బిరుదు ఉంది.
ఆడెపు చంద్రమౌళి
- వరంగల్‌కు చెందిన ఈయన 1939, ఏప్రిల్ 7న జన్మించారు. 2009, సెప్టెంబర్ 28న మరణించారు. ఈయన రాసిన శతకాలు - శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, వేములవాడ రాజరాజేశ్వర శతకం. ఈయన రాసిన పద్యకావ్యం - రామాయణ రమణీయం.
- ఈయనకు కవిశశాంక అనే బిరుదు ఉంది.
ధూపాటి సంపత్కుమారాచార్య
- ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన రాసిన శతకం శ్రీ యాదగిరి లక్ష్మీనారసింహ శతకం.
ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు
- నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామంలో 1936, ఏప్రిల్ 11న జన్మించారు. 2011, జనవరి 9న మరణించారు. ఈయన శతకాలు యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, శ్రీ వేంకటేశ్వర శతకం.
- ఇతర రచనలు - గోదాదేవి, గోదావరి, సత్యవతీస్వాంతం, మారుతి మొదలైనవి.
- విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందారు.
వెంకటరావు పంతులు
- రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 1937, ఫిబ్రవరి 3న జన్మించారు. 1994, ఆగస్టు 26న మరణించారు. ఈయన రాసిన శతకం - శ్రీబాక వరాంజనేయ శతకం.
సమ్మెట గోపాలకృష్ణ
-నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో 1937, మార్చి 2న జన్మించారు. తల్లిదండ్రులు రాములమ్మ, చంద్రయ్య. ఈయన రాసిన శతకాలు - కృష్ణ శతకం, సమ్మెట పలుకులు, ఆర్య శతకం, కాలధర్మాలు, సీస పద్యమాలిక. ఇతర రచన - మావూరు-నాడు నేడు

Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.