ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎవరు నిర్మించారు?
- నవాబ్ సర్ విఖారుల్ ఉలమా
పురానాపూల్‌ను పారిస్‌లోని ఫోర్ట్ న్యూఫ్‌తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు?
- ట్రావెర్నియర్ (1645లో)
పురానాపూల్‌కు మరోపేరు?
- బ్రిడ్జ్ ఆఫ్ లవ్
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలిపే చెరువుకట్టను ఏమంటారు?
- హుస్సేన్‌సాగర్ ఆనకట్ట (ట్యాంక్‌బండ్)
ఈసా, మూసా (మూసీ) నదుల సంగమం వద్ద మహాత్మాగాంధీ చితాభస్మాన్ని నీటిలో కలిపారు.
హైదరాబాద్‌లో గోషామహల్‌ను ఎవరు, ఎందుకు నిర్మించారు?
- అంతఃపుర స్త్రీల సరససల్లాపాల కోసం అబుల్ హసన్ తానీషా నిర్మించాడు
పెద్దమనుషుల ఒప్పందంలో (1956 ఫిబ్రవరి 20న) ఉన్న ఉపముఖ్యమంత్రి పదవి ఆరో వేలుతో సమానం అన్నది?
- నీలం సంజీవరెడ్డి
610 జీవోను ఏ కమిటీల సిఫారసు ఆధారంగా ఎన్టీ రామారావు 1985, డిసెంబర్ 30న ప్రవేశపెట్టారు?
- జై భారత్‌రెడ్డి, సుందరేశన్ కమిటీలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని నాటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం పార్లమెంటులో ఎప్పుడు ప్రకటించారు?
- 2013, ఆగస్టు 5న
50 సంవత్సరాల హైదరాబాద్ రచయిత ఎవరు?
- ముందుముల నరసింగరావు
50 సంవత్సరాల జ్ఞాపకాలు రచయిత?
- దేవులపల్లి రామానుజరావు
బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర రాసిందెవరు?
- ఉమ్మెత్తల కేశవరావు
తెలంగాణ పోరాట స్మృతులు రచయిత?
- ఆరుట్ల రామచంద్రారెడ్డి
పులిజాల రంగారావు జీవిత చరిత్ర రచయిత ఎవరు?
- బీఎన్ శాస్త్రి
తెలంగాణ సాయుధ పోరాటం- నా అనుభవాలు రాసిందెవరు?
- నల్లా నర్శింహులు
తెలంగాణ ఉద్యమానికి తొలి వేదిక?
- ఖమ్మం జిల్లా పాల్వంచ
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు?
- దొడ్డి కొమరయ్య, 1946, జూలై 4న కడివెండిలో
కరీంనగర్ జిల్లాలో పశ్చిమ కనుమలకు ఏమని పేరు?
- రాఖీ గుట్టలు
తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు శాస్త్రీయనామం?
- ట్రెనర్స్ కాషియా
ప్రాణహిత నది గోదావరిలో ఎక్కడ కలుస్తుంది?
- చెన్నూరు వద్ద
తెలంగాణలో పటం సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించేవారు?
- కాటిపడగలు, గౌడజెట్టి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కొర్రాజుల, కూనపులి, మాసయ్యలు, పాండువలోల్లు, తెరచీరలు, పూజారి మొదలైనవారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు?
- కాసోజు శ్రీకాంతాచారి (పొడిచేడు గ్రామం), 2009, డిసెంబర్ 3
మునగాల ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలన్నది ఎవరు?
- నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
బర్మా దేశంలో బౌద్ధం వ్యాపించడానికి కారణమైన పాలకులు?
-శాలంకాయనులు
దగాపడ్డ తెలంగాణ అని ఎక్కడ జరిగిన సభకు పేరుపెట్టారు?
- భువనగిరి
తెలంగాణ శాసనమండలిలో నామినేటెడ్ సభ్యుల సంఖ్య?
- ఐదు
మొదటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన వ్యక్తి?
- ఎంవీ రాజు (హుజూర్‌నగర్, నల్లగొండ జిల్లా)
భారతదేశంలోని ప్రసిద్ధ కట్టడాల్లో మక్కా మసీద్ ఒకటి అన్న ఫ్రెంచి యాత్రికుడు?
- ట్రావెర్నియర్
భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసింది ఎవరు?
- నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు
మలి దశ ఉద్యమకాలంలో కేసీఆర్ ఎక్కడ పాదయాత్ర చేశారు?
- కోదాడ నుంచి హాలియా వరకు (నల్లగొండ జిల్లా)
-వరంగల్ జిల్లాలో జనగాం సమీపంలోని ఎర్రిగొల్లిపాడుకు చెందిన పులి రామక్క రజాకార్లను నరికి చంపింది. ఈ సంఘటన చరిత్రలో మరువలేనిది.
భారతదేశపు బుడాపెస్ట్ అని ఏ నగరాన్ని అంటారు?
- హైదరాబాద్