పోషకాహారలోపం (Malnutrition) : తగినంత మొత్తాలలో పోషకాలు, తగు మొత్తాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవటాన్ని 'పోషకాహార లోపం' అంటారు.
ప్రపంచం మొత్తం జనాభాలో 'మూడింట్లో రెండు వంతుల మంది’ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
కారణాలు :
1) పస్తులు లేక ఉపవాసాలు (Starvation) ఉండటం లేక తక్కువ ఆహారాన్ని తీసుకోవడం.
2) వ్యక్తి అనారోగ్యం - వ్యాధులు రావడం, తరచుగా అతిసారవ్యాధి, ఏలిక పాములు శరీరంలోనికి ప్రవేశించడం.
3) ఆహార పోషక విలువలు, ఎంత పోషకాహారం అవసరమో తెలియక పోవడం, ఆహారాన్ని గురించి అజ్ఞానమైన, మూఢనమ్మకాలు కలిగి ఉండటం. ఆహార అలవాట్లు గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండటం.
4) సాంఘిక - ఆర్థిక కారణాలు - పేదరికం పోషకాహార లోపానికి కారణం. ఒకే కుటుంబంలో వివిధ వ్యక్తులకు (మగపిల్లలకు, ఆడపిల్లలకు) వేర్వేరు ఆహార పదార్థాలు, వేర్వేరు మొత్తాలలో ఇవ్వడం వల్ల కూడా పోషకాహార లోపం కలుగుతుంది.
5) పూరిళ్ళు, పారిశుద్ధ్య లోపం, పరిశుభ్రమైన త్రాగేనీరు లేకపోవడం
వివిధ పోషకాహార లోపాలు (Different types of malnutritions): పిల్లల్లో పోషకాహార లోపం 'మూడు రకాలుగా' ఉంటుంది.
1. కేలరీల పోషకాహార లోపం (Calorie malnutrition)
2. ప్రోటీన్ పోషకాహార లోపం (Protein malnutrition)
3. ప్రోటీన్ - కేలరీ పోషకాహార లోపం (Protein calorie malnutrition)
A) క్వాషియోర్కర్ (Kwashiorkor) :
- క్వాషియోర్కర్ అనేది ఆఫ్రికా పదము. దీని అర్థం నిర్లక్ష్యం చేయబడిన శిశువు (Displaced child)
- ఆహారంలో ప్రోటీన్ లోపం వలన ఈ వ్యాధి కలుగుతుంది.
- ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి - క్వాషియోర్కర్
- వ్యాధికి గురైన పిల్లల్లో పెరుగుదల మందగిస్తుంది.
- కణాల మధ్య ఖాళీలలో నీరు చేరడం వలన శరీర భాగాలు ఉబ్బుతాయి.
- కండరాల అభివృద్ధి సక్రమంగా ఉండదు.
- కాళ్ళు సామాన్యంగా ఉబ్బి ఉంటాయి. మొహం ఉబ్బి గుండ్రంగా ఉంటుంది.
- ఆకలి తగ్గి, సక్రమంగా ఆహారాన్ని తీసుకోవడానికి కష్టపడతారు.
- తరచూ అతిసారవ్యాధితో బాధపడతారు.
- రోమాలు పలుచబడి ఉండి వాటి మూలాలు నిగారింపు
- చర్మం ‘పొడిగా, వదులుగా వేలాడుతూ ఉంటుంది.
- ఈ శిశువులు 'బద్ధకంగా ఉండి, తమ చుట్టూ ఉండే పరిసరాల్లో కాని, ఆటలలోకాని, చదువులో కాని ఉత్సాహం' చూపించరు.
B) మెరాస్మస్ (Marasmus)
- ఈ వ్యాధి 'ప్రోటీన్, కేలరీలు' రెండింటి లోపం వలన కలుగుతుంది.
- ప్రోటీన్ లోపం వలన శరీరం పెరుగుదల తక్కువగా ఉంటుంది.
- కార్బోహైడ్రేట్ల లోపం వల్ల 'క్రొవ్వులు, ప్రోటీనులు శక్తి విడుదల కోసం’ వాడుకోబడతాయి.
- దీని వల్ల శిశువు తన వయస్సుకు చిన్నగా, శుష్కించి సన్నగా, నీరసంగా అగుపిస్తుంది.
- ఆవయస్సులో ఉండవలసిన శరీర బరువులో ‘60%' మాత్రమే ఇలాంటి శిశువులో ఉంటుంది.
- కాళ్ళు, చేతులు పుల్లలుగా ఉండి 'ప్రక్కటెముకలు' ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
- శరీర రక్షణ వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందదు. అందువలన శిశువు అతిసారం' వల్ల బాధపడుతుంది.
- ఇటువంటి శిశువులు కోపంగా ఉంటారు.
- తమ చుట్టూ ఉండే 'పరిసరాలతో కాని, భౌతిక, మానసిక కార్యాలలో' వీరు అతితక్కువ ఉత్సాహం చూపిస్తారు.
C) స్థూలకాయత్వం (Obesity)
- అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన ఈ వ్యాధి కలుగుతుంది.
- శరీరం మొత్తం బరువులో 20% కంటే ఎక్కువ బరువు క్రొవ్వుల వలన అయితే అటువంటి వారిని స్థూలకాయులుగా చెప్పవచ్చును.
- అతిగా తినటం వలన అదనపు శక్తి క్రొవ్వుగా మార్చబడుతుంది. ఇది చర్మం క్రింద ‘ఎడిపోజ్ కణజాలం'లో నిల్వచేయబడుతుంది.
- స్థూలకాయత్వం మధుమేహవ్యాధికి, హృదయానికి, రక్తనాళాలకు, మూత్రపిండము, పిత్తాశయానికి సంబంధించిన వ్యాధులకు దారి తీస్తుంది.
- జంక్ ఫుడ్స్, మసాలాలతో కూడిన ఆహారం తినడం వలన కూడా స్థూలకాయత్వానికి గురవుతున్నారు.
- వీరు సంతులిత ఆహారాన్ని, పీచు తంతువులు' ఎక్కువగా ఉండే ఆహారాన్ని (Fibre rich food) తీసుకోవాలి.