-కాలాన్ని కొలుచుటకు లేదా తెలుసుకొనుటకు ఉపయోగించే పరికరాన్ని గడియారం అంటారు.
-గడియారం అనేది ఆవర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
-గడియారంలోని మొత్తం భాగాల సంఖ్య 211.
-లోలకాన్ని కనుగొన్నది గెలీలియో.
-గడియారంలోని లోలకం పొడవు 100 సెం.మీ.
-గడియారంలోని లోలకం అటు, ఇటు తిరుగుటనే డోలనావర్తన కాలం అంటారు.
-ఈ డోలనావర్తన కాలం విలువ 2 సెకన్లు అయితే దాన్ని సెకన్ల లోలకం లేదా సామాన్య లోలకం అంటారు.
-లోలకంలో ఒక కంపనానికి పట్టేకాలం ఒక సెకన్.
-గడియారంతో కాలాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లలో తెలుసుకోవచ్చు.
-గడియారంలోని ముఖ్యమైన భాగాలు
1. డయల్
2. గంటల ముల్లు
3. నిమిషాల ముల్లు
4. సెకన్ల ముల్లు
డయల్
-డయల్ అనేది ఒక గడియారం బాహ్యభాగం. దీని లోపల ఒక వృత్తాకరపు లోహపు పలకపై 1 నుంచి 12 వరకు గల అంకెలు సమానదూరాల్లో ఉంటాయి. ఒక్కొక్క అంకె ఒక్కొక్క గంటను సూచిస్తుంది. మొత్తం మీద గడియారం 12 గంటలను సూచిస్తుంది. ఒక పూర్తిరోజు (24 గంటలు) గడువాలంటే గంటల ముల్లు రెండు పూర్తి భ్రమణాలు పూర్తిచేయాలి.
-గడియారంలోని ముళ్ల చలనాన్ని కోణాల్లో తీసుకున్నట్లయితే ప్రతిముల్లు ఒక పూర్తి భ్రమణానికి 360 డిగ్రీల కోణం చేస్తుంది.
-గడియారంలోని 12 గంటల మధ్యదూరాన్ని కోణాల్లో తెలియజేసినపుడు రెండు పక్కపక్క అంకెల మధ్యదూరం 360/12 = 30 డిగ్రీలకు సమానం.
గంటల ముల్లు (చిన్న ముల్లు)
-ఒక గడియారంలో గంటల ముల్లు అన్ని ముల్లుల కంటె చిన్నది.
-చిన్న ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టేకాలం – 12 గంటలు.
-అంటే 12 గంటల్లో చిన్న ముల్లు చేసే కోణం – 3600
-ఒక గంటలో చిన్న ముల్లు చేసే కోణం – 360/12 = 300
-60 నిమిషాల్లో చిన్న ముల్లు చేసే కోణం – 300
-ఒక నిమిషంలో చిన్న ముల్లు చేసే కోణం – 30/60 = 1/2 డిగ్రీలు.
-60 సెకన్లలో చిన్న ముల్లు చేసే కోణం – 1/2 డిగ్రీలు
-1 సెకన్‌లో చిన్న ముల్లు చేసే కోణం – 1/120 డిగ్రీలు
పెద్దముల్లు (నిమిషాల ముల్లు)
-ఒక గడియారంలో నిమిషాల ముల్లు గంటల ముల్లు కంటె పెద్దది, సెకన్ల ముల్లు కంటె చిన్నది.
-నిమిషాల ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టుకాలం = ఒక గంట లేదా 60 నిమిషాలు.
-అంటే నిమిషాల ముల్లు 60 నిమిషాల్లో చేసే కోణం – 3600
-ఒక నిమిషంలో పెద్దముల్లు చేసే కోణం – 360/60 = 60
-నిమిషాల ముల్లు ఒక నిమిషంలో చేసే కోణం – 60
-అంటే నిమిషాల ముల్లు 60 సెకన్లలో చేసే కోణం – 60
-నిమిషాల ముల్లు ఒక సెకన్‌లో చేసే కోణం – 6/60 = 1/10 డిగ్రీలు.
సెకన్ల ముల్లు
-ఒక గడియాంలో అన్ని ముళ్లలోకి పొడవైనది సెకన్ల ముల్లు.
-అంతేగాక గంటల ముల్లు, నిమిషాల ముల్లు కంటే సెకన్ల ముల్లు వేగంగా కదులుతుంది.
-సెకన్ల ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఒక నిమిషం పడుతుంది.
-అంటే 60 సెకన్లు పూర్తి చేయడానికి 360 డిగ్రీల కోణం చేస్తుంది.
-ఒక సెకనుకు 6 డిగ్రీల కోణం చేస్తుంది.
-సెకన్ల ముల్లు వేగం = 360 డిగ్రీలు/ నిమిషం = 6 డిగ్రీలు/సెకన్
గమనిక-1
-గడియారంలో పెద్ద, చిన్న ముల్లుల నిష్పత్తి..
= 6 : 1/2
= 12 : 1
= 360 : 30
-గడియారంలో పెద్ద, చిన్న ముల్లుల సాపేక్ష వేగం/ఉమ్మడి వేగం = 6 -1/2 = 11/2 డిగ్రీలు = 51/2 డిగ్రీలు.
గమనిక-2
-గడియారంలో ఒంటి గంట సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం – 30 డిగ్రీలు.
-గడియారంలో రెండు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం – 2 (30) = 60 డిగ్రీలు.
-గడియారంలో నాలుగు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్యకోణం = 4(30) = 120 డిగ్రీలు
-గడియారంలో ఐదు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం = 5(30) = 150 డిగ్రీలు
-గడియారంలో ఎనిమిది గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం = 8(30) = 240 డిగ్రీలు
-గంటల ముల్లు, నిమిషాల ముల్లుల మధ్య కోణం = 30h-(11/2)m లేదా (11/2)m-30h
-ఇక్కడ అంటే పరమమూల్యం విలువ అని అర్థం. ఈ రెండు గీతల మధ్య ఉన్న విలువను ఎల్లప్పుడు ధనాత్మకంగా తీసుకోవాలి