Type Here to Get Search Results !

Vinays Info

జహంగీర్ పీర్ దర్గా - ఉర్సు :

జహంగీర్ పీర్ దర్గా - ఉర్సు

  • రంగారెడ్డిజిల్లా కొత్తూరు మండలంలో జహంగీర్ పీర్ దర్గా ఉంది.
  • 15వ శతాబ్దంలో ఇచ్చట ఇరాక్ దేశానికి చెందిన సోదరులు సయ్యద్ గౌసుద్దీన్, సయ్యద్ బుర్వానుద్దీన్ దైవ చింతనతో కొద్దికాలం గడిపి మరణించినట్లు కథనం.
  • వీరి సమాధులపై కొందరు చిన్న దర్గాను నిర్మించారు.
  • 17వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ దర్గాని సందర్శించి, ఇబ్రహీం ఆలీ అనే పండితుణ్ణి ఖాజీగా నియమించాడు.
  • అతనే జహంగీర్ పీర్ దర్గాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశాడు.
  • ప్రతిరోజూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి ఇక్కడకు అనేకమంది సందర్శకులు వస్తుంటారు.
  • గురు ఆదివారాలలో వివిధ రాష్ట్రాల నుండి సందర్శకులు వస్తారు.
  • ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి గురువారం నుండి మూడు రోజులు ఉర్సు జరుగుతుంది.
    • మొదటి రోజు - గంధపూజ
    • రెండవరోజు - దీపారాధన
    • మూడవరోజు - ఖవ్వాలీ
  • ఈ ఉత్సవాలలో దేశ విదేశాల నుండి వేలాది హిందూ ముస్లిం భక్తులు పాల్గొని మిఠాయిలు, చాదర్లు సమర్పించి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
  • 'అజ్మీర్ దర్గా' భారతదేశంలో పేరుగాంచిన గొప్ప దర్గా.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section