Plants around us | మన చుట్టూ ఉన్న మొక్కలు
- మర్రి,చింత, వేప, మామిడి వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి.
- చెట్ల వలన మనకు కలప లభిస్తుంది.
- చెట్లు మనకు చల్లని గాలిని ఇస్తాయి.
- ఆపిల్ - శాస్త్రీయ నామం - మాలూస్ డొమెస్టికా
- తామర - నెలంబో న్యూసిఫిరా
- కలబంద - ఆలో వేర
- నాగ జెమ్ముడు -
- కాలువ, తామర వంటివి - నీటిలో పెరుగుతాయి. వీటిని నీటి మొక్కలు అంటారు.
- బ్రహ్మ జెమ్ముడు, నాగజేమ్ముడు,కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లోను, ఇసుకలోను పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అని అంటారు.
- Different plants grow in our localities.
- మన ఇళ్లల్లో, చుట్టుపక్కల వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి.
- The plants around us are different. Some grow very tall. Some are very short. Some are small in size.
- మన చుట్టూ ఉండే మొక్కలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని చాలా ఎత్తుగా, కొన్ని తక్కువ ఎత్తులో, ఇంకొన్ని మరీ చిన్నగా పెరుగుతాయి.
- Trees like neem grow bigger with branches. Trees like palm grow taller without branches.
- వేప చెట్ల వంటివి అనేక కొమ్మలతో పెద్దగా ఉంటాయి. తాటి చెట్ల వంటివి కొమ్మలు లేకుండా ఎత్తుగా పెరుగుతాయి.
- There are many uses of trees. We get flowers, fruits and wood from trees.
- చెట్లవల్ల అనేక ఉపయోగాలున్నాయి. వీటి నుంచి పూలు, పండ్లు, కలప వంటివి లభిస్తాయి.
- Some trees do not grow in our surroundings. But we use the flowers, fruits and wood of these trees.
- కొన్ని చెట్లు మన పరిసరాలలో పెరగవు. కాని వాటినుంచి లభించే పూలు, పండ్లు వంటి వాటిని మనం చూస్తూంటాం, ఉపయోగిస్తూంటాం.
- We plants saplings in our school, in the premises of our house and as many places as possible and protect.
- మనం పాఠశాలలోను, ఇంటి అవరణలోను విలైనన్ని ప్రదేశాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించుకుంటాము.
- The plants like cactus, aloevera grow in sandy soils. These are called desert plants.
- ఇసుకనేలల్లో బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద వంటి మొక్కలు పెరుగుతాయి. వీటిని ఎడారిమొక్కలు అంటారు.