Type Here to Get Search Results !

Vinays Info

Forest Area in India

అడవులు
-ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు. 
-అడవులను ఇంగ్లిష్‌లో ఫారెస్ట్ (Forest) అంటారు. ఫారెస్ట్ అనేది లాటిన్ భాషాపదం అయిన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం. 
-అడవులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఫారెస్టరీ అంటారు. 
-1927లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాన్ని చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో నూతన అటవీ విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి.
-తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రిపోర్ట్ 2015-16 ప్రకారం రాష్ట్ర అటవీ విస్తీర్ణం 27,292 చ.కి.మీ. 2018-19 నివేదిక ప్రకారం ఇది 27,857 చ.కి.మీ.కు పెరిగింది. 
-రాష్ట్ర విస్తీర్ణంలో మొత్తం అటవీ విస్తీర్ణ శాతం 24.35 శాతం
-దేశంలో అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ 12వ స్థానంలో ఉంది. 

అటవీ విధాన లక్ష్యం
-అటవీరంగం ద్వారా జీవనోపాధి కల్పన
-గ్రామీణ పేదరిక నిర్మూలనకు అడవులను ఆయుధంగా చేసుకోవడం (కలప సేకరణ, పండ్లు, పూలు, తేనె, గింజలు మొదలైనవి సేకరించి మార్కెట్‌లో విక్రయించడం)

తెలంగాణలో జీవ వైవిధ్యం
-మొత్తం 1945 రకాల మొక్కలు
-365 రకాల పక్షిజాతులు
-40 రకాల క్షీరద జాతులు
-48 రకాల సరీసృపాలు
-15 రకాల ఉభయ చరాలు
-166 రకాల చేపల జాతులు
-52 రకాల కీటక జాతులు
-153 రకాల సీతాకోక చిలుక జాతులు
-30 రకాల సాలీడు జాతులు 
-రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య పరిరక్షణ కోసం 12 పరిరక్షణ కేంద్రాలను ప్రకటించింది. వీటిలో జాతీయ పార్కులు- 3, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు)-9 ఉన్నాయి. 
-తెలంగాణ రాష్ట్ర చేప- కొర్రమీను
-రాష్ట్రంలో చిరుతపులి, అడవిదున్న, పులులు, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, బురద మొసలి, డేగలు మొదలైన జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. 
-వీటిని కాపడటానికి ఆవాసాంతర రక్షణ (Insitu protection), ఆవాసేతర రక్షణ (Exsitu protection)లను ఏర్పాటు చేయాల్సిన అవరసం ఉంది. 
-ఆవాసాంతర రక్షణ: జాతీయపార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్‌లు
-ఆవాసేతర రక్షణ: జీన్ బ్యాంకుల ఏర్పాటు

Elephants

ఇన్‌సిటు ప్రొటెక్షన్స్
-ఏదైనా ఒక భౌగోళికప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాల్లో సంరక్షించడం. 
-దేశంలో మొత్తం జాతీయ పార్కుల సంఖ్య 110 (2018 జూలై వరకు). వీటిలో రాష్ట్రంలోని పార్కులు 3. అవి.. 

కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ దీన్ని 1998లో స్థాపించారు. 
-విస్తీర్ణం 1.42 చ.కి.మీ.
-ఇది పక్షులకు ప్రసిద్ధి. 
-ఇందులో పక్షిజాతుల సంఖ్య 140, మొక్కల జాతుల సంఖ్య 600. 

మహావీర్ హరిణ వనస్థలి
-దీన్ని 1975లో రంగారెడ్డి జిల్లా వనస్థలీపురంలో స్థాపించారు.
-14.59 చ.కి.మీ విస్తరించి ఉన్న పార్కులో జింకలను సంరక్షిస్తున్నారు. 

మృగవని జాతీయ పార్కు
-1994లో రంగారెడ్డి జిల్లా చిలుకూరు (చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్)లో స్థాపించారు. 
-దీని విస్తీర్ణం 3.6 చ.కి.మీ.
-ఇక్కడ కుందేలు, అడవి పిల్లి, రక్త పింజర, పైథాన్ (కొండ చిలువ), అడవి పంది వంటి జంతువులను సంరక్షిస్తున్నారు. 
-దీనికి సమీపంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. 
-దీన్ని 1994లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

దేశంలోని ముఖ్యమైన నేషనల్ పార్కులు
-దీని సరిహద్దును పార్లమెంటు నిర్ణయిస్తుంది. 
-ఇక్కడ వేట, కలప సేకరణ, ప్రైవేటు కార్యకలాపాలు నిషిద్ధం. 
-జంతువులను సహజంగా పరిరక్షిస్తారు. 
-దేశంలో మొదటగా ఏర్పాటు చేసిన జాతీయ పార్కు హేలీ (1936). ప్రస్తుతం దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు. 
-దేశంలో మొత్తం 110 జాతీయ పార్కులు ఉన్నాయి. వీటి వైశాల్యం 40,501 చ.కి.మీ.
అత్యధిక జాతీయ పార్కులు గల ప్రాంతాలు (రాష్ర్టాలు).. మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు

రాష్ర్టాల వారీగా నేషనల్ పార్కులు..

జమ్ముకశ్మీర్
-దచిగామ్ నేషనల్ పార్క్- హంగుల్ దుప్పి ఈ పార్కు ప్రాముఖ్యత
-హెమిస్- దేశంలో పొడవైన నేషనల్‌పార్కు (4400 చ.కి.మీ.)
-కిష్టవార్, సలీం అలీ నేషనల్ పార్కులు

హిమాచల్‌ప్రదేశ్
-గ్రేట్ హిమాలయన్- దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 
-ఇండర్ ఖిల్లా, ఖిర్‌గంగా, పిన్‌వ్యాలీ, సిమ్‌బాల్‌బారా నేషనల్ పార్కులు. 

ఉత్తరాఖండ్
-వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్- దీన్ని ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. 
-నందాదేవి- ఇది వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 
-జిమ్‌కార్బెట్- దేశంలో మొదటి జాతీయ పార్కు. రామ్‌గంగా నదీ తీరంలో ఉన్న ఇది ఒక వేటగాని పేరుమీదుగా ఏర్పడింది. అంతరించి పోయే ప్రమాదంలో ఉన్న బెంగాల్ టైగర్‌ను ఇక్కడ సంరక్షిస్తున్నారు. 
-రాజాజీ, గోవింద్ పాషూ విహార్, గంగోత్రి నేషనల్ పార్కులు. 

ఉత్తరప్రదేశ్
-దుద్వా, చంద్రప్రభ, గోవిందపశువిహార్ జాతీయ పార్కులు

బీహార్
-వాల్మికీ, గౌతమబుద్ధ నేషనల్ పార్కులు. 

జార్ఖండ్
-బెట్లా, హజారీబాగ్, ఫలమావు జాతీయ పార్కులు.

పశ్చిమబెంగాల్
-జల్దపార- ఖడ్గమృగాలకు ప్రసిద్ధి
-గోర్‌మారా- సాంబారు జింకలు, ఖడ్గమృగాలు, ఆసియా ఏనుగులకు ప్రసిద్ధి. 
-సింగలీల, నియోరావ్యాలీ, సుందర్‌బన్ నేషనల్ పార్కులు. 

అసోం
-మానస్ నేషనల్ పార్కు- ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 
-డిబ్రూ- సైకోవా కు ప్రసిద్ధి
-కజిరంగా- ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. దీన్ని 1905లో లార్డ్ కర్జన్ ఏర్పాటు చేశాడు. ఇది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో అత్యధిక పులుల సాంద్రత గల ఈ నేషనల్‌పార్కు గుండా బ్రహ్మపుత్రా నది ప్రవహిస్తున్నది. 
-నమేరి, ఓరాంగ్, గరంపానీ నేషనల్ పార్కులు రాష్ట్రంలో ఉన్నాయి. 

మేఘాలయా
-నోక్రెక్- ఇది యునెస్కో వలర్డ్ బయోస్పియర్ రిజర్వ్‌గా గుర్తింపు పొందింది. 
-బలపాక్రము- ఇక్కడ నీటిగుర్రం ప్రసిద్ధి. 

మణిపూర్
-కైబుల్‌లంజావో- ఇది లోక్‌తక్ సరస్సులో భాగంగా ఉంది. 
-దీంతోపాటు రాష్ట్రంలో సిరోహి, నాకుమ్ జాతీయ పార్కులు ఉన్నాయి. 

మిజోరం
-రాష్ట్రంలో ముర్లేన్, పాన్ గుఫి బ్లూమౌంటేన్ నేషనల్ పార్కులు ఉన్నాయి. 

నాగాలాండ్
-నాంటాంకీ నేషనల్ పార్క్.

సిక్కిం
-కాంగ్‌చాంద్ దైదా- ఇది మంచు చిరుతలకు ప్రసిద్ధి.

అరుణాచల్‌ప్రదేశ్
-నామ్‌దఫా, మౌలింగ్ నేషనల్‌పార్కులు. 

త్రిపుర
-బైసన్ (రాజ్‌బారి), క్లౌడెడ్ (చిరుతకు ప్రసిద్ధి) నేషనల్ పార్కులు ఉన్నాయి. 

అండమాన్ నికోబార్ దీవులు
-సౌత్‌బటన్ దీవి- దేశంలో అతిచిన్న జాతీయ పార్కు అయిన ఇది బ్లూవేల్‌కు ప్రసిద్ధి. 
-సాడెల్‌పీక్, రాణి ఝాన్సీ మెరైన్, నార్త్ బటన్ దీవి, మౌంట్ హరియత్, మిడిల్ బటన్ దీవి, మహాత్మా గాంధీ మెరైన్, గాలాతియా, క్యాంప్‌బెల్ బే నేషనల్ పార్క్‌లు ఉన్నాయి. 

మధ్యప్రదేశ్
-బాంధవ్‌ఘర్- ఇక్కడ 1336 స్థానిక విశిష్టత కలిగిన మొక్కలు (Species of endemic plants) ఉన్నాయి.
-కన్హా- ఈ పార్కు మధ్యగుండా బెట్వానది ప్రవహిస్తున్నది. 
-కునో- ఏసియాటిక్ లయన్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్
-పన్నా- ఈ జాతీయ పార్కు గుండా తపతి నది ప్రవహిస్తున్నది. 
-వీటితోపాటు మాధవ్, పెంచ్, సంజయ్, సాత్పురా, వాన్ విహార్ నేషనల్ పార్కులు ఉన్నాయి. 

ఛత్తీస్‌గఢ్
-ఇంద్రావతి- ఆసియా అడవి దున్నలు, హైనాలకు ప్రసిద్ధి
-గురు గాసిదాస్ (సంజయ్) నేషనల్ పార్కు- జింకలకు ప్రసిద్ధి. 
-కంజర్ ఘాటి నేషనల్ పార్కు. 

ఒడిశా
-బిత్తర్ కానికా- ఇది రాకాసి ఉప్పునీటి మొసలికి ప్రసిద్ధి. ఈ జాతీయ పార్కు బ్రహ్మణి నదీతీరంలో ఉంది. 
-సిమ్లిపాల్- పులులకు ప్రసిద్ధి.
-2018-19 ప్రకారం భారతదేశ అటవీ విస్తీర్ణం 7,08,273 చ.కి.మీ.
-దేశ మొత్తం విస్తీర్ణంలో అటవీ శాతం- 21.54 శాతం
-ప్రపంచంలో అడవుల విస్తీర్ణం పరంగా భారత్ 10వ స్థానంలో ఉంది. 

జీవవైవిద్య చట్టం- 2002
-ఈ చట్టం ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని జమీన్‌పూర్ చెరువును జీవవైవిద్య వారసత్వ సంపద ప్రదేశంగా ప్రకటించారు. దీని విస్తీర్ణం 93.15 ఎకరాలు. 
-దీన్ని పక్షుల స్వర్గం అని కూడా అంటారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section