Type Here to Get Search Results !

Vinays Info

Science Bits

గెలాక్టోజ్ (C6H12O6)
-దీనిని Milk Sugar అంటారు. ఇది పాలలో కరిగిన స్థితిలో ఉంటుంది.
-దీనిలో 6 కార్బన్‌లు ఉంటాయి. కాబట్టి ఇది కూడా హెక్సోజ్ చక్కెర
-దీనిలో ఆల్డీహైడ్ ప్రమేయ సమూహం ఉంటుంది.
-ఇందులో 6 కార్బన్లు, ఆల్డీహైడ్ గ్రూపు ఉండటంతో దీన్ని ఆల్డోహెక్సోజ్ అంటారు.
-ఇది గ్లూకోజ్‌కు సంబంధించిన C4 ఎపిమర్.

రైబోజ్ (C5H10O5)
-ఇది RNA లో ఉండే చక్కెర.
-దీనిలో 5 కార్బన్‌లు ఉంటాయి. కాబట్టి దీన్ని పెంటోజ్ చక్కెర అంటారు.
-దీనిలో ఆల్డీహైడ్ ప్రమేయ సమూహం ఉంటుంది.
-దీనిలో 5 కార్బన్లు, ఆల్డీహైడ్ గ్రూపు ఉండటంతో దీన్ని ఆల్డోపెంటోజ్ అంటారు.

డీఆక్సీరైబోజ్ (C4H10O4)
  • -ఇది DNA లో ఉండే చక్కెర
  • -రైబోజ్ చక్కెరలోని 2వ కార్బన్ వద్ద ఉన్న ఆక్సిజన్‌ను కోల్పోవడంవల్ల డీ ఆక్సీరైబోజ్ ఏర్పడుతుంది. ఈ కారణంగానే దీనిని 2-డీ ఆక్సీరైబోజ్ అంటారు.
  • -ఇది కూడా పెంటోజ్ చక్కెర.
  • -దీనిలో ఆల్డీహైడ్ ప్రమేయ సమూహం ఉంటుంది.
  • -ఇందులో 5 కార్బన్లు, ఆల్డీహైడ్ గ్రూపు ఉండటతో దీన్ని ఆల్డోపెంటోజ్ అంటారు.

డైశాఖరైడ్‌లు (Disacchrides)
  1. -రెండు మోనోశాఖరైడ్‌లు ైగ్లెకోసిడిక్ బంధం ద్వారా కలుప బడి డైశాఖరైడ్‌లు ఏర్పడుతాయి.
  2. -రెండు మోనోశాఖరైడ్‌ల మధ్యగల ైగ్లెకోసిడిక్ బంధం ఆల్ఫా ైగ్లెకోసిడిక్ బంధంగాని/బీటా ైగ్లెకోసిడిక్ బంధంగాని అయి ఉంటుంది.
  3. -డైశాఖరైడ్‌లు జలవిశ్లేషణం చెంది రెండు మోనోశాఖరైడ్‌లను ఏర్పరుస్తాయి.

ఉదాహరణ:
-మాల్టోజ్ (గ్లూకోజ్+ గ్లూకోజ్)
- లాక్టోజ్ (గ్లూకోజ్ +గెలాక్టోజ్)
-సుక్రోజ్ (గ్లూకోజ్ + ఫ్రక్టోజ్)

మాల్టోజ్ (Maltose)
-ఇది బార్లీ గింజలలో ఉండటంవల్ల దీనిని Malt sugar అంటారు.
-ఇది ఆల్కహాల్ తయారీలో ఉపయోగపడుతుంది.
-ఇది రెండు గ్లూకోజ్‌ల కలయిక ద్వారా ఏర్పడుతుంది.
-రెండు గ్లూకోజ్ మోనోశాఖరైడ్‌ల మధ్య 4 ైగ్లెకోసిడిక్ ఉంటుంది.
-ఇది క్షయీకరణ చక్కెర (Reducing Sugar)

సుక్రోజ్
-ఇది చెరకు నుంచి లభించడంవల్ల దీనిని Cane Sugar అని, నిత్యజీవితంలో వాడటంవల్ల Table Sugar అని అంటారు.
-ఇది చెరకు రసం, బీట్‌రూట్, కొబ్బరిపాలలో ఉంటుంది.
-ధృవప్రాంతాల్లో ఈ చక్కెరను బీట్‌రూట్, ఆలుగడ్డ నుంచి తయారు చేస్తారు.
-ఇది గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌ల కలయిక ద్వారా ఏర్పడుతుంది.
-గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌ల మధ్య 2 ైగ్లెకోసిడిక్ బంధం ఉంటుంది.
-ఇది అక్షయీకరణ చక్కెర (Non Reducing Sugar)

లాక్టోజ్ (Lactose)
-ఇది పాలలో ఉండటంతో దీన్ని Milk Sugar అంటారు.
-ఇది తక్కువ తీపిదనాన్ని కలిగిఉంటుంది.
-ఇది పాలలో 7-8శాతం ఉంటుంది.
-ఇది పాలకు తెలుపు రంగును ఇస్తుంది.
-ఇది ఒక గ్లూకోజ్ ఒక గెలాక్టోజ్ కలయిక ద్వారా ఏర్పడుతుంది.
-గ్లూకోజ్, గెలాక్టోజ్ మధ్య 4 ైగ్లెకోసిడిక్ బంధం ఉంటుంది.
-ఇది క్షయీకరణ చక్కెర (Reducing Sugar)

ఆలిగోశాఖరైడ్‌లు (Oligosaccharides)
-3-10 మోనోశాఖరైడ్‌లు కలిగిన చక్కెరలను ఆలిగోశాఖరైడ్‌లు అంటారు. ఇవి జలవిశ్లేషణం పొంది 3- 10 మోనోశాఖరైడ్ ప్రమాణాలను ఏర్పరుస్తాయి.
-వీటి మధ్య ఉండే బంధం- ైగ్లెకోసిడిక్ బంధం

ఉదా:
-రాఫినోజ్ (Glucose+ Galactose+ Fructose)
- రాఫినోజ్ అనేది ఒక ట్రైశాఖరైడ్

పాలీశాఖరైడ్‌లు (Polysaccharides)
-అనేక మోనోశాఖరైడ్‌లు కలిసి పాలీశాఖరైడ్‌లు ఏర్పడుతాయి. వీటి మధ్య ఉండే బంధం ైగ్లెకోసిడిక్ బంధం.
-ఈ పాలీశాఖరైడ్‌లు శాఖాయుతంగాగాని/శాఖారహితంగాగాని ఉంటాయి.
-ఇవి నీటిలో కరగవు.

ఉదా: స్టార్చ్, ైగ్లెకోజెన్, సెల్యులోజ్, ఖైటిన్, ఇన్సులిన్, పెక్టిన్, హెమిసెల్యులోజ్, మ్యూకోపాలీశాఖరైడ్.
-పాలీశాఖరైడ్‌లను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.. హోమోపాలీశాఖరైడ్‌లు, హెటిరో పాలీశాఖరైడ్‌లు

హోమోపాలీశాఖరైడ్‌లు
-ఒకే రకమైన మోనోశాఖరైడ్ ప్రమాణాలతో ఏర్పడిన పాలీశాఖరైడ్‌లను హోమోపాలీశాఖరైడ్‌లు అంటారు.
glucose

హెటిరో పాలీశాఖరైడ్‌లు
-ఒకటి కంటే ఎక్కువ రకాల మోనోశాఖరైడ్ ప్రమాణాలతో ఏర్పడిన పాలీశాఖరైడ్‌లను హెటిరోపాలీశాఖరైడ్‌లు అంటా రు.

ఉదా: -హెమీసెల్యులోజ్- అరబినోజ్, జైలోజ్, గ్లూకోజ్, మానోజ్, గెలాక్టోజ్‌లతో ఏర్పడుతుంది.
-పెక్టిన్- అరబినోజ్, గెలాక్టోజ్ జైలోజ్, గెలాక్టురోనిక్‌ఆమ్లం
-విధులను ఆధారంగా చేసుకుని పాలీశాఖరైడ్‌లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. నిర్మాణాత్మక పాలీశాఖరైడ్‌లు, నిల్వ పాలీశాఖరైడ్‌లు

నిర్మాణాత్మక పాలీశాఖరైడ్‌లు
-జీవుల దేహభాగాల నిర్మాణంలో పాల్గొనే పాలీశాఖరైడ్‌లను నిర్మాణాత్మక పాలీశాఖరైడ్ (Structural poly saccharides)లు అంటారు.

ఉదా:
- సెల్యులోజ్- మొక్కల కణకవచ నిర్మాణంలో తోడ్పడుతుంది.
-ఖైటిన్- ఆర్థ్రోపొడా జీవుల బాహ్యాస్థిపంజరంలో, శిలీంధ్రాల కణకవచ నిర్మాణంలో తోడ్పడుతుంది.

నిల్వపాలీశాఖరైడ్‌లు
-జీవులలో ఆహారపదార్థాల నిలువకు తోడ్పడే పాలీశాఖరైడ్‌లను నిల్వపాలీశాఖరైడ్‌లు అంటారు.

ఉదా:
స్టార్చ్- మొక్కల్లో నిల్వ ఆహార పదార్థం
ైగ్లెకోజన్- జంతువులలో నిల్వ ఆహారపదార్థం

స్టార్చ్ (Starch)
-ఇది నిల్వ పాలీశాఖరైడ్
-ఇది మొక్కల్లో నిల్వ ఆహారం
-ఇది గ్లూకోజ్ మోనోశాఖరైడ్‌లచే ఏర్పడుతుంది.
-ఇది అమైలోజ్, అమైలోపెక్టిన్‌గా ఉంటుంది.
-ఇది మొక్కల్లో మాత్రమే ఉండి జంతువుల్లో లోపిస్తుంది.
-ఇది ఎక్కువగా వరి, గోధుమ, మొక్కజొన్న, ఆలుగడ్డల్లో ఉంటుంది.

ైగ్లెకోజెన్ (Glycogen)
-ఇది నిల్వ పాలీశాఖరైడ్
-ఇది జంతువుల్లో నిల్వ ఆహారం
-ఇది సుమారు 30వేల గ్లూకోజ్ మోనోశాఖరైడ్‌లతో ఏర్పడుతుంది.
-ఇది జంతువుల్లో మాత్రమే ఉండి మొక్కల్లో లోపిస్తుంది.
-ఇది కాలేయం, కండరాలలో నిల్వ ఉంటుంది.

ఖైటిన్ (Chitin)
-ఇది కీటకాల బాహ్యాస్థిపంజరంలో, శిలీంధ్రాల కణకవచంలో ఉంటుంది.
-ఇది N- acetylglucosamine ప్రమాణాలతో ఏర్పడుతుంది.
సెల్యులోజ్ (Cellulose)
-ఇది మొక్కల కణకవచంలో ఉంటుంది. జంతువుల్లో ఉండదు.
-ఇది సుమారు 6వేల గ్లూకోజ్ మోనోశాఖరైడ్‌లతో ఏర్పడుతుంది.
-ఇది ప్రపంచంలో అతి ఎక్కువగా ఉండే సహజపాలిమర్.
-ఇది మానవుడి లాంటి మాంసాహారుల్లో జీర్ణం కాదు. కారణం సెల్యులోజ్ అనే ఎంజైమ్ లోపించడంవల్ల. కాని శాకాహార జంతువుల్లో జీర్ణం అవుతుంది. వీటిలో సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉంటుంది.

మ్యూకోపాలీశాఖరైడ్‌లు
-ఇవి Slimy polysaccharides & హెటిరక్ష పాలీశాఖరైడ్‌లు.
-ఇవి బ్యాక్టీరియా కణకవచం, సంధాయక కణజాలాలు అయిన టెండాన్, లిగమెంట్, జంతువుల దేహ ద్రవాల్లో ఉంటాయి.
ఉదా: మ్యూసిలేజ్, హయలురోనిక్‌ఆమ్లం, కెరాటిన్ సల్ఫేట్, హెపారిన్

Artificial-Sweeteners
కృత్రిమ చక్కెరలు
-డయాబెటిక్ వ్యాధి ఉన్నవారికోసం తీపిని పెంచి క్యాలరీలను తగ్గించే చక్కెరలను కృత్రిమ చక్కెరలు అంటారు.

శాకరిన్
-ఇది చక్కెర కంటే సుమారు 550 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది.
-ఇది వివిధ రకాల ఆహరపదార్థలకు తీపిని ఇచ్చే కృత్రిమ చక్కెర.

సుక్రలోజ్
-ఇది చక్కెర కంటే సుమారు 320-1000 రెట్లు ఎక్కువ తియ్యదనాన్ని కలిగి ఉంటుంది.

అలిటేమ్
-ఇది చక్కెర కంటే సుమారు 2వేల రెట్లు ఎక్కువ తియ్యదనాన్ని కలిగి ఉంటుంది.

ఆస్పర్టేమ్
-ఇది చక్కెర కంటే 100 రెట్లు ఎక్కువ తియ్యదనాన్ని కలిగి ఉంటుంది.

కార్బోహ్రైడ్రేట్‌ల జీవక్రియ
-ైగ్లెకోజెనెసిస్: గ్లూకోజ్ నుంచి ైగ్లెకోజెన్ ఏర్పడటాన్ని ైగ్లెకోజెనెసిస్ అంటారు. ఇది దేహంలోని అన్ని కణజాలాల్లో జరిగినప్పటికి ఎక్కువగా కాలేయం, కండరాల్లో జరుగుతుంది.
-ైగ్లెకోజెనాలిసిస్: ైగ్లెకోజెన్ విచ్ఛిత్తి చెంది గ్లూకోజ్‌గా ఏర్పడటాన్ని ైగ్లెకోజెనాలిసిస్ అంటారు. ఇది దేహంలోని అన్ని కణజాలాల్లో జరిగినప్పటికి ఎక్కువగా కాలేయం, కండరాల్లో జరుగుతుంది. కాలేయంలోకి ైగ్లెకోజెన్ విచ్ఛిత్తి చెంది గ్లూకోజ్‌గాను, కండరాల్లోని ైగ్లెకోజెన్ విచ్ఛిత్తి చెంది గ్లూకోజ్-6-పాస్ఫేట్‌గా ఏర్పడుతుంది.
Glycolysis: గ్లూకోజ్ నుంచి రెండు పైరువిక్ ఆమ్లాలు ఏర్పడుతాయి. ఇది దేహంలోని అన్ని కణాల్లో జరుగుతుంది.
Gluconeogenesis: కార్బోహైడ్రేటేతర పదార్థాల నుంచి గ్లూకోజ్ ఏర్పడటాన్ని గ్లూకోనియోజెనెసిస్ అంటారు. ఇది కాలేయంలో జరుగుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section