Type Here to Get Search Results !

Vinays Info

రుతుపవనాలు - Monsoon

రుతుపవనాలు - Monsoon 

  • మాన్‌సూన్ అనే ఆంగ్లపదం 'మౌసమ్' అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం రుతువు.
  • విశాలమైన భూమి, జలభాగాలు (సముద్రాలు) చల్లబడటం, వేడెక్కడంలో తేడాల వల్ల రుతుపవనాలు ఏర్పడతాయి.
  • భారతదేశంలో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల సంభవిస్తుంది. దేశంలో అన్ని అంశాలు రుతుపవనాలతో ముడిపడి ఉన్నాయి.
  • ఆగ్నేయ వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటడంతో వాయువ్య భారతంలో రుతుపవనాలు ఏర్పడతాయి.
  • కొరియాలిస్ ప్రభావం వల్ల భారత ద్వీపకల్పంలో, పొరుగుదేశాల్లో నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి.
  • శీతాకాలంలో పీడన మేఖలు మారడంతో ఈశాన్య వాణిజ్య పవనాలు భూమధ్య రేఖను దాటుతాయి. కొరియోలిస్ ప్రభావం వల్ల ఇవి ఉత్తర, ఈశాన్య ఆస్ట్రేలియాలో వాయువ్య రుతుపవనాలు అవుతాయి.

స్థానిక పవనాలు

  • స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు, పీడనాల్లో తేడాల వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. ఇవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి.
  • స్థానిక పవనాలు ట్రోపో ఆవరణంలోని దిగువ పొరల్లో వీస్తాయి.
  • కొండ, లోయ, పవనాలు, సముద్ర, భూపవనాలు కూడా ఒక రకమైన స్థానిక పవనాలే.
  • వాతావరణంలో కింది పొరలు వేడెక్కడం, చల్లబడటంలో తేడాల వల్ల ఏర్పడే పీడన తేడాల కారణంగా ఈ పవనాలు ఏర్పడతాయి.
  • స్థానిక పవనాలు రెండు రకాలు అవి:

i) ఉష్ణ స్థానిక పవనాలు

ii) శీతల స్థానిక పవనాలు

ఉష్ణ స్థానిక పవనాలు

  • ఉష్ణ స్థానిక పవనాలు ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను పెంచుతాయి. ఉదా: చినూక్.
  • ఉత్తర అమెరికాలోని అమెరికా - కెనడా ప్రాంతంలో ఉన్న రాకీ పర్వతాల కింది భాగంలో వీచే పవనాలను 'చినూక్' అంటారు.
  • చినూక్ అంటే 'మంచును తినేది' అని అర్థం.
  • వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలో ఒక జాతి పేరు.
  • ఈ పవనాల వల్ల పచ్చిక మైదానాల్లో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది.

 

ఫొన్ - Phone

  • యూరప్‌లో వీచే పవనాలను ఫొన్ అంటారు.
  • ఇవి ఆల్ఫ్స్ పర్వతాల ఉత్తరవాలుల మీదుగా వీస్తాయి.
  • ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్షపళ్లు త్వరగా పండటానికి ఈ పవనాలు సహాయం చేస్తాయి.

 

వడగాలులు (లూ)

  • ఉత్తర భారతదేశంలో మే - జూన్‌ల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి, పొడి పవనాలను 'లూ' అంటారు.
  • అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలకు 'వడదెబ్బ' తగలవచ్చు.
  • అరేబియా ఎడారిలో స్థానిక ఉష్ణప్రవాహం - సిమ్మన్.
  • జపాన్‌లో స్థానిక ఉష్ణ ప్రవాహం - యోమా.
  • న్యూజిలాండ్‌లో స్థానిక ఉష్ణప్రవాహం - నార్వెస్టర్.

 

శీతల స్థానిక పవనం

     శీతల స్థానిక పవనాల వల్ల ఒక్కోసారి ప్రభావిత ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే కిందకు పడిపోతాయి. ఉదా: మిస్ట్రాల్

  • శీతల స్థానిక పవనాల్లో ఆల్ఫ్ పర్వతాల నుంచి ఫ్రాన్స్ మీదిగా మధ్యధరా సముద్రం వైపుకు వీచే మిస్ట్రాల్ గాలులు పేరుగాంచినవి.
  • ఇవి రోమ్‌లోయ ద్వారా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగా, పొడిగా ఉంటాయి.
  • ప్యూనా: ఇవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు.
  • పాంపెరా: ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల (గడ్డి మైదానాల) ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section