అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం, ప్రతి సంవత్సరం నవంబరు 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాల సూచిక పాత్రను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ (ఇఎస్ఆర్), రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్‌ఎస్‌ఎన్‌ఎ), అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ (ఎసిఆర్) కలిసి సంయుక్తంగా 2012లో ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200లకు పైగా జాతీయ, ఇతర సంస్థలు ఈ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఎక్స్-రేను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపబడుతోంది.
నేపథ్యం(History of Radiology Day)
2011లో ప్రారంభించిన యూరోపియన్ రేడియాలజీ దినోత్సవం, ఆ మరుసటి సంవత్సరం అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా మార్చబడింది. ఎక్స్-రే కిరణాలను కనుగొన్న విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ వర్ధంతి సందర్భంగా 2011, ఫిబ్రవరి 10న యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ ఆధ్వర్యంలో మొదటి, ఒకేఒక యూరోపియన్ రేడియాలజీ దినోత్సవం జరిగింది. ఆ దినోత్సవం విజయవంతం అవడంవల్ల దీనిని అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా నిర్వహించడానికి యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ సంస్థ రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ సంస్థల సహకారం తీసుకుంది. ఈ దినోత్సవం రోంట్జెన్ వర్ధంతి రోజు నుండి అతను ఎక్స్-రే కనుగొన్న తేదీకి (నవంబరు 8) మార్చాలని కూడా నిర్ణయించారు. 2011, నవంబరు 28న చికాగోలో జరిగిన రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వార్షిక సమావేశంలో మూడు వ్యవస్థాపక సంఘాలు నవంబరు 8వ తేదీని అధికారికంగా ధృవీకరించాయి.
1895, నవంబరు 8న విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ కాథోడ్ కిరణాలను పరిశోధించేటప్పుడు అనుకోకుండా ఎక్స్-రే కిరణాలను కనుగొనడంతో రేడియాలజీ వైద్య విభాగానికి పునాది పడింది. ఈ ఆవిష్కరణ రోగ లక్షణాల సూచికకు వివిధ పద్ధతులను చేర్చడానికి, ఆధునిక వైద్య అంశంగా స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా రేడియోలాజికల్ సంస్థలు నిర్వహించే వేడుకలకోసం నవంబరు 8 తగిన రోజుగా ఎంపిక చేయబడింది.
రేడియాలజీ సాధారణ గుర్తింపుతో పాటు, ప్రతి సంవత్సరం ఒక అంశం ఎంపిక చేయబడుతుంది. ఇది రేడియాలజీ ప్రత్యేకతలు, ఉప-ప్రత్యేకతలపై దృష్టి పెడుతుంది.
2021:
2020:
2019: స్పోర్ట్స్ ఇమేజింగ్
2018: కార్డియాక్ ఇమేజింగ్
2017: అత్యవసర ఇమేజింగ్
2016: బ్రెస్ట్ ఇమేజింగ్
2015: పీడియాట్రిక్ ఇమేజింగ్
2014: బ్రెయిన్ ఇమేజింగ్
2013: థొరాసిక్ ఇమేజింగ్
2012: ఆంకోలాజిక్ ఇమేజింగ్