Type Here to Get Search Results !

Vinays Info

Current Affairs

Top Post Ad

Telangana
GATTU-LISPENCHIKAL

గట్టు ఎత్తిపోతలకు సీఎం శంకుస్థాపన

సీఎం కే చంద్రశేఖర్‌రావు జూన్ 29న జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రూ. 553 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టువల్ల 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు, 41 చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. ప్రాజెక్టు కుడికాలువ కింద 18,500 ఎకరాలు, ఎడమ కాలువ కింద 9,500 ఎకరాలతోపాటు సౌర విద్యుత్ ప్రాజెక్టు కింద రిజర్వ్ చేసిన 5,000 ఎకరాలకు సాగునీరు అండనుంది. చెరువులను నింపడంవల్ల మరో 3,000 ఎకరాలు సాగులోకి రానుంది.

ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్డు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

కన్జ్యూమర్స్ ఫోరం చైర్మన్‌గా జైశ్వాల్

జూన్ 25న తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్ నియమితులయ్యారు. ఆయనకు 67 ఏండ్ల వయస్సు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు.

సింగరేణి సీఎండీకి అవార్డు

దుబాయిలో ఆర్థికాంశాల అధ్యయన సంస్థ నుంచి అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డును సింగరేణి సీఎండీ శ్రీధర్ అందుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశ ప్రముఖుల నుంచి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

కేసీఆర్‌తో యూఏఈ విదేశాంగ మంత్రి భేటీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్.. జూన్ 28న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ యూఏఈ, తెలంగాణ మధ్య సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు, అనుబంధాల గురించి చర్చించారు.

టీఎస్ వెదర్ యాప్

టీఎస్ వెదర్ యాప్‌ను జూన్ 29న ఆవిష్కరించారు. ఎన్‌ఐసీ సహకారంతో రూపొందించిన ఈ యాప్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో పనిచేస్తుంది. Awards
baahubali2

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం బాహుబలి-2

బాహుబలి-2 సినిమా మరో అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. జూన్ 27న కాలిఫోర్నియాలో జరిగిన 44వ శాటరన్ అవార్డుల ప్రదానోత్సవంలో.. బాహుబలి-2కు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును ప్రదానం చేశారు. ఏటా వివిధ జానర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలకు అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ అనే సంస్థ అవార్డులను అందజేస్తుంది. 2017, ఫిబ్రవరి - 2018, ఫిబ్రవరి మధ్య విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. National
IDBI

మహలనోబిస్ గౌరవార్థం రూ. 125 నాణెం

ప్రముఖ ఆర్థిక గణాంక నిపుణుడు, రెండో పంచవర్ష ప్రణాళిక నమూనా రూపకర్త పీసీ మహలనోబిస్ 125వ జయంతి (జాతీయ గణాంక దినోత్సవం) సందర్భంగా ఆయన గౌరవార్థం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రూ. 125 నాణెంతోపాటు కొత్త రూ. 5 నాణేలను ఆవిష్కరించారు. 2007 నుంచి ఏటా మహలనోబిస్ జయంతి రోజైన జూన్ 29ని జాతీయ గణాంక దినంగా నిర్వహిస్తున్నారు.

IDBI సీఈవోగా శ్రీరామ్

ఎస్‌బీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బీ శ్రీరామ్.. ఐడీబీఐ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జూన్ 22న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు IDBI ఎండీ, సీఈవోగా పనిచేసిన మహేష్‌కుమార్ జైన్ RBI డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. కేంద్రప్రభుత్వం ఆయన స్థానాన్ని శ్రీరామ్‌తో భర్తీచేసింది. ఆయన మూడు నెలలపాటు పదవిలో కొనసాగనున్నారు. శ్రీరామ్ జూన్ 21 వరకు ఎస్‌బీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు.

యునెస్కో వారసత్వ సంపదలో మరో రెండు కట్టడాలు

యునెస్కో వారసత్వ సంపద జాబితాలో భారత్ నుంచి రెండు రకాల విశిష్ఠ నిర్మాణ శైలులను ప్రతిబింబించే ముంబయిలోని కొన్ని భవనాలకు చోటు లభించింది. విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో వాస్తు నిర్మాణ శైలులకు ప్రతీకలుగా నిలిచే మహారాష్ట్రలోని పాత సచివాలయం, యూనివర్సిటీ లైబ్రరీ, కన్వెన్షన్ హాల్, బాంబే హైకోర్టు, ప్రజాపనుల శాఖ కార్యాలయం, వాట్సన్ హోటల్, డేవిడ్ ససూన్ లైబ్రరీ, ఎల్ఫిస్టోన్ కళాశాలలకు ఈ ఏడాది యునెస్కో గుర్తింపు లభించింది. భారత్ తరఫున ఇప్పటికే 37 ప్రముఖ ప్రాచీన, సాంస్కృతిక కట్టడాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందాయి. ప్రపంచం మొత్తంలో విశిష్ట సంపద జాబితాలో ఆరో స్థానంలో భారత్ ఉంది.

పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్‌గా రమేష్

కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్‌గా రమేష్ నియమితులయ్యారు. 2013 - 16 వరకు చెన్నై కస్టమ్స్ జోన్ చీఫ్ కమిషనర్‌గా రమేష్ పనిచేశారు.

ఎమర్జెన్సీపై సూర్యప్రకాష్ పుస్తకం

ప్రసారభారతి చైర్మన్ ఎన్ సూర్యప్రకాష్ రాసిన ఎమర్జెన్సీ-ఇండియన్ డెమొక్రసీస్ డార్కెస్ట్ అవర్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూన్ 25న ఢిల్లీలో ఆవిష్కరించారు. హిందీ, తెలుగు, కన్నడ, గుజరాతీ భాషల్లో ఈ పుస్తకాన్ని రూపొందించారు.

కబీర్‌దాస్ 500వ వర్ధంతి

పదిహేనో శతాబ్దానికి చెందిన గొప్ప కవి, సాధువు కబీర్‌దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకుని జూన్ 28న యూపీలోని సంత్‌కబీర్‌నగర్ జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులోభాగంగా లక్నోకు 250 కిలోమీటర్ల దూరంలో కబీర్‌దాస్ తుదిశ్వాస విడిచిన మగ్‌హర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

తొలి హిజ్రా న్యాయవాది సత్యశ్రీ

దేశంలోనే మొదటి హిజ్రా న్యాయవాదిగా తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిల పేరు నమోదు చేసుకున్నారు. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన సత్యశ్రీ 2004-08 మధ్యకాలంలో న్యాయవిద్యను అభ్యసించారు. Sports
rahul-dravid

హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రవిడ్

ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్-2018లో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు. ఈ పురస్కారం పొందిన ఐదో భారత క్రీడాకారుడు. ద్రవిడ్‌తోపాటు ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ క్రీడాకారిణి క్లేరి టేలర్ కూడా ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రతిభకనబర్చడంతోపాటు క్రికెట్‌కు విశేష సేవలు అందిస్తున్న వారికి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ పేరిట పురస్కారాలను అందిస్తుంది.

కబడ్డీ టోర్నీ విజేత భారత్

జూన్ 30న దుబాయిలో ఆరు దేశాల జట్లతో కబడ్డీ మాస్టర్ టోర్నీని నిర్వహించారు. ఈ ట్రోఫీని భారత్ జట్టు కైవసం చేసుకుంది. ఇరాన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. International
Getty

సీషెల్స్ అధ్యక్షుడి భారత పర్యటన

సీషెల్స్ అధ్యక్షుడు డానీ ఫార్ జూన్ 26, 27 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ, సైబర్ భద్రత, నౌకాయానం సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి.

టర్కీ అధ్యక్షుడిగా మరోసారి ఎర్డోగాన్

టర్కీ అధ్యక్షుడిగా రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు. మొత్తం 600 స్థానాలకుగాను అధికార జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ 52.5 శాతం ఓట్లతో 293 స్థానాల్లో విజయం సాధించింది. ఎర్డోగాన్ ఐదేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

భారత్‌లో నిక్కీహేలి పర్యటన

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలి జూన్ 27, 28 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రతినిధులతో ఆమె రక్షణరంగం, ఉగ్రవాదం నిర్మూలన సహా పలు అంశాలపై చర్చించారు.

అరుణామిల్లర్ ఓటమి

మేరిలాండ్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ప్రతినిధుల సభకు పోటీచేసిన భారతసంతతి మహిళ అరుణామిల్లర్ (53) ఓటమిపాలయ్యారు. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన ఆమె ఏడేండ్ల వయస్సులోనే 1972లో ఆమెరికాకు వలసవెళ్లారు.

డెమొక్రటిక్ పార్టీ సీఈవోగా సీమానంద్

జూన్ 30న అమెరికాలోని డెమొక్రటిక్ పార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా భారత సంసతికి చెందిన సీమానంద్ నియమితులయ్యారు. పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాలు తీసుకునే డెమొక్రటిక్ నేషనల్ కమిటీకి సీఈవోగా వ్యవహరిస్తారు.

పాకిస్థాన్‌లో చానల్‌లో యాంకర్‌గా సిక్కు వ్యక్తి

పాకిస్థాన్‌లో తొలిసారిగా ఉర్దూ వార్తా చానల్ పబ్లిక్ న్యూస్‌లో సిక్కు వ్యక్తి హర్మీత్‌సింగ్ వ్యాఖ్యాతగా నియమితులయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చకేసార్ పట్టణం ఆయ స్వస్థలం.

హంబన్‌టోటాలో దక్షిణ నావికాదళం

చైనాకు లీజుకిచ్చిన హంబన్‌టోటా నౌకాశ్రయానికి దక్షిణ నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని శ్రీలంక నిర్ణయించింది. ఈ ఓడరేవును 99 ఏండ్లపాటు చైనాకు శ్రీలంక లీజుకు ఇచ్చింది.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.