Type Here to Get Search Results !

Vinays Info

రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో విధివిధానాలివే.

చెక్కుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు, అధికారులు అనుసరించాల్సిన, పాటించాల్సిన అంశాలపై ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు కరపత్రాలద్వారా ప్రచారం నిర్వహించారు. వారంపాటు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఇవీ వివరాలు..
* చెక్కుల పంపిణీకి నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
* మొదటి కేంద్రంలో 1బీ, పహాణీని పరిశీలిస్తారు.
* రెండో కేంద్రంలో పట్టాదార్ పాస్‌బుక్, చెక్కు అందజేస్తారు.
* మూడో కేంద్రంలో రైతు సంతకం తీసుకుంటారు.
* నాల్గో కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు.
* గ్రామంలో చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటుచేసిన కౌంటర్లలో రైతులు వారి చెక్కులు ఏ కౌంటర్లలో ఉందో స్లిప్పు మీద ఉన్న నంబరును బట్టి గుర్తించాలి.
* ఏ కౌంటర్లలో ఏ నంబర్ పాసుబుక్కులు ఉన్నాయో ప్రత్యేకమైన తెరపై ప్రదర్శిస్తారు.
* ఆధార్‌కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* పట్టాదారు మాత్రమే చెక్కును తీసుకోవడానికి రావాలి.
* పట్టాదారు అనారోగ్యంతో ఉంటే అధికారులు ఇంటికి వెళ్లి అందజేస్తారు.
* సంబంధిత అధికారులకు రైతులు ఒరిజినల్ ఆధార్‌కార్డు చూపించిన తర్వాత చెక్కు ఇస్తారు.
* ఆధార్‌కార్డు నంబర్ ఇవ్వనివారికి పాస్‌బుక్కు ఇవ్వరు. కేవలం చెక్కులు మాత్రమే ఇస్తారు. చెక్కులు తీసుకొని ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి.
* భూమి వివరాలు సరిగ్గా పడకపోయినా, చెక్ మీద మొత్తం తక్కువగా ముద్రించినా వెంటనే వాటిని ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో గ్రీవెన్స్ ఫారంలో నింపి అధికారులకు అందజేయాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section