దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఒకేసారి 11 మంది పేర్లను క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదించింది. 2021 ఏడాదికిగాను ప్రతిపాదించిన ఈ అవార్డులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోద ముద్ర వేయడం లాంఛనం కానుంది. తమ ప్రతిభతో దేశానికి పేరు తెచ్చిన మరో 35 మంది పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కూడా సిఫారసు చేశారు. అర్జున అవార్డుల జాబితాలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఎంపిక కమిటీ సిఫార్సులు ఇలా ఉన్నాయి.
ఖేల్‌రత్న అవార్డులకు...
1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్): టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం
2. మిథాలీ రాజ్ (క్రికెట్)
3. సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
4. రవికుమార్ దహియా (రెజ్లింగ్): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం
5. పీఆర్ శ్రీజేశ్ (హాకీ): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో సభ్యుడు
6. లవ్లీనా బోర్గోహెయిన్ (బాక్సింగ్): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం
7. ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
8. సుమీత్ అంటిల్ (జావెలిన్ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
9. అవని లేఖరా (షూటింగ్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం
10. కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం
11. మనీశ్ నర్వాల్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం