EdelGive Hurun India: 2021 ఫిలాంత్రోపీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంపన్నుడు
దాతృత్వానికి సంబంధించి హరూన్ ఇండియా–ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ సంయుక్తంగా రూపొందించిన ‘ఎడెల్‌గివ్ హరూన్ ఇండియా ఫిలాంత్రోపీ జాబితా 2021’లో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. నివేదిక ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ... గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) రూ.9,713 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంటే ప్రతీ రోజూ 27 కోట్ల చొప్పున సమాజం కోసం దానం చేశారు. అజీమ్ ప్రేమ్‌జీ తర్వాత హెచ్‌సీఎల్ సంస్థ అధినేత శివ్‌నాడార్ రెండో స్థానంలో ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నాడార్ రూ.1,263 కోట్లను విరాళంగా ఇచ్చారు.
ర్యాంకు | పేరు | విరాళంగా ఇచ్చిన మొత్తం |
1 | అజీమ్‌ప్రేమ్‌జీ(విప్రో) | రూ.9,713 కోట్లు |
2 | శివ్‌నాడార్(హెచ్‌సీఎల్) | రూ.1,263 కోట్లు |
3 | ముకేశ్ అంబానీ(రిలయన్స్) | రూ.577 కోట్లు |
4 | కుమారమంగళం బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్) | రూ.377 కోట్లు |
5 | నందన్ నీలేకని(ఇన్ఫోసిస్) | రూ.183 కోట్లు |