Type Here to Get Search Results !

Vinays Info

Current Affairs

మందారం సంపుటి ఆవిష్కరణ

తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి సాహిత్య ప్రస్థానంపై రూపొందించిన మందారం సంపుటిని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు అక్టోబర్ 11న తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించారు.

హైదరాబాద్‌లో విత్తన సదస్సు

హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు-2019 లోగో, కరపత్రాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అక్టోబర్ 11న విడుదల చేశారు. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు ఈ సదస్సు జరుగనున్నది. 83 దేశాల నుంచి విత్తర పరిశోధన, ఉత్పత్తి, నాణ్యత మొదలైన రంగాలకు చెందిన 800 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

మిస్ హైదరాబాద్‌గా గౌరీప్రియ

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అక్టోబర్ 10న మిస్ హైదరాబాద్-2018 పోటీలు నిర్వహించారు. 24 మంది పాల్గొన్న ఈ పోటీల్లో మిస్ హైదరాబాద్‌గా గౌరీప్రియ నిలిచారు.National
National

జమ్ములో ఇస్రో సెంటర్

జమ్ముకశ్మీర్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ (సీయూజే)లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీశ్ ధావన్ సెంటర్ పేరుతో తన నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు సీయూజే వైస్‌చాన్స్‌లర్ అశోక్ ఐమా, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ అధికారులతో అవగాహన ఒప్పందాన్ని అక్టోబర్ 11న కుదుర్చుకున్నారు.

బిల్డింగ్ ఏ లెగసీ పుస్తకావిష్కరణ

ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ అనుమోలు రామకృష్ణ బయోగ్రఫీ బిల్డింగ్ ఏ లెగసీ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలో అక్టోబర్ 12న ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయితలు వీ పట్టాభిరామ్, ఆర్ మోహన్.

సీఎఫ్‌ఐఆర్ ప్రారంభం

సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీఎఫ్‌ఐఆర్)ను అక్టోబర్ 10న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, కొత్త ఆలోచనలు ఆవిష్కరణల అంశాలపై విశ్లేషించనున్నారు.

జ్ఞానపీఠ్ బోర్డు చైర్మన్‌గా ప్రతిభారాయ్

జ్ఞానపీఠ్ అవార్డు బోర్డు చైర్మన్‌గా ఒడిశా రాష్ర్టానికి చెందిన ప్రతిభారాయ్ అక్టోబర్ 9న నియమితులయ్యారు. గతంలో ఆమె జ్ఞానపీఠ్ అవార్డు, మూర్తిదేవి అవార్డులను అందుకున్నారు.

కరప్షన్ సర్వే

ఇండియా కరప్షన్ సర్వే జాబితాలో ఉత్తరప్రదేశ్ (59 శాతం) మొదటిస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పంజాబ్ (56 శాతం) రెండో స్థానంలో, తమిళనాడు (52 శాతం) మూడో స్థానంలో నిలవగా, తెలంగాణ (43 శాతం) ఎనిమిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ (38 శాతం) 11వ స్థానంలో నిలిచాయి.

మిస్ ఇండియా ట్రాన్స్‌క్వీన్

ముంబైలో అక్టోబర్ 8న ట్రాన్స్‌జెండర్ల కోసం అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మిస్ ఇండియా ట్రాన్స్‌క్వీన్‌గా వీణా సెంద్రా, మొదటి రన్నరప్‌గా సానియా నిలిచారు.

చోటురామ్ విగ్రహావిష్కరణ

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా గర్హిసంప్లాలో రైతు నేత, దీన్‌బంధు సర్ చోటురామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రానికి ముందు చోటురామ్ అన్నదాతలు ఆర్థికంగా బలపడేందుకు, వారికోసం సంక్షేమ చట్టాలు తీసకువచ్చేందుకు పోరాడారు.International
International

షాంఘై సదస్సులో సుష్మాస్వరాజ్

అక్టోబర్ 12న తజకిస్థాన్ రాజధాని డుషన్‌బేలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల ప్రభుత్వ విభాగాధిపతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు.

రక్షణ మంత్రి ఫ్రాన్స్‌లో పర్యటన

అక్టోబర్ 12న భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు.

ఐరాస మానవ హక్కుల మండలికి భారత్

అక్టోబర్ 12న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సభ్యదేశాల ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కనీసం 97 ఓట్లు అవసరం కాగా, భారత్ 188 ఓట్లతో విజయం సాధించింది. 2019, జనవరి 1 నుంచి మూడేండ్లపాటు మావన హక్కుల మండలిలో సభ్యదేశంగా భారత్ ఉండనున్నది. 2011-14, 2014-17 మధ్య భారత్ రెండుసార్లు మానవ హక్కుల మండలికి ఎంపికైంది.

మలేషియాలో మరణశిక్ష రద్దు

త్వరలో మలేషియాలో మరణశిక్ష రద్దు కానున్నది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను రద్దు చేయాలని మలేషియా ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యతన సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి.

హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్

ప్రపంచ బ్యాంక్ విద్య, ఆరోగ్యం, శిశు మరణాలు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌ను అక్టోబర్ 11న విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ను 115వ దేశంగా గుర్తించగా భారత్ ఈ ర్యాంకును తిరస్కరించింది.

భారత్ వృద్ధిరేటు 7.3 శాతం

భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018లో 7.3 శాతంగా, 2019లో 7.4 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అక్టోబర్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. 2017లో భారత్ వృద్ధిరేటు 6.7 శాతం నమోదు కాగా, 6.9 శాతంతో చైనా మొదటిస్థానంలో ఉందని ఈ నివేదిక తెలిపింది. 2018లో చైనా వృద్ధిరేటు 6.6 శాతం, 2019లో 6.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. 2018, 2019లో ప్రపంచ వృద్ధిరేటు 3.7 శాతంగా ఉంటుందని వెల్లడించింది.Persons
Persons

సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా

భారత సొలిసిటర్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. ఆయన 2020, జూన్ 30 వరకు పదవిలో కొనసాగుతారు. గత అక్టోబర్‌లో సొలిసిటర్ జనరల్ పదవికి రంజిత్‌కుమార్ రాజీనామా చేశారు.

నాగాలాండ్ గాంధీ మృతి

నాగాలాండ్ గాంధీగా పేరుగాంచిన సామాజిక కార్యకర్త నట్వర్ ఠక్కర్ మృతిచెందారు. నాగాలాండ్‌లోని చుచుయిమ్‌లాంగ్ గ్రామంలో నాగాలాండ్ గాంధీ ఆశ్రమాన్ని స్థాపించారు. 1994లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 1999లో పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.

ఐఎస్‌ఐ చీఫ్‌గా అసీం మునీర్

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) చీఫ్‌గా సైనిక నిఘా విభాగం మాజీ అధికారి జనరల్ అసీం మునీర్ నియమితులయ్యారు.

ఐడీబీఐ ఎండీగా రాకేశ్

ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రాకేశ్‌శర్మ నియమితులయ్యారు. ఐడీబీఐ ఎండీ, సీఈవో బీ శ్రీరామ్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేశారు.

అగర్వాల్ మృతి

గంగా నది పరిరక్షణ కోసం నిరశన దీక్ష చేపట్టిన ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ గుండెపోటుతో అక్టోబర్ 11న మృతిచెందారు. కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అయిన ఆయన గంగా నదిని కాలుష్యరహితం చేయాలని కోరుతూ జూన్ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. Sports


Sports
యూత్ ఒలింపిక్స్

అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో 62 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా స్వర్ణ పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరి స్వర్ణ పతకం గెలిచాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ రజత పతకం సాధించాడు. షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ స్వర్ణం దక్కించుకుంది.

షేన్‌వార్న్ ఆత్మకథ

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ నో స్పిన్ పేరిట ఆత్మకథ రాశారు.

జొహార్ కప్‌లో భారత్‌కు రజతం

మలేషియాలోని జొహార్ బరులో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ అండర్- 18 టోర్నీలో భారత్ హాకీ జట్టు రజత పతకం గెలిచింది. ఫైనల్‌లో భారత్.. బ్రిటన్ చేతిలో పరాజయం పాలైంది.

పారా ఆసియా క్రీడలు

ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు సాధించారు. జావెలిన్ త్రోలో సందీప్ చౌదరి, స్విమ్మింగ్‌లో సుయాశ్ జాదవ్, మహిళల 1500 మీటర్ల పరుగులో రాజు రక్షిత, మహిళల క్లబ్ త్రోలో ఏక్తా, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మనీష్ నర్వాల్, 100 మీటర్ల పరుగులో నారాయణ్ ఠాకూర్, ఆర్చరీలో పురుషుల వ్యక్తిగత రికర్వ్ డబ్ల్యూ2/ఎస్‌టీ విభాగంలో హర్విందర్ సింగ్, హైజంప్ (టీ42/63)లో శరద్‌కుమార్, చెస్ మహిళల వ్యక్తిగత ర్యాపిడ్ పీ1 ఈవెంట్లో జెన్నితా అంటో, పురుషుల వ్యక్తిగత 6-బీ2/బీ3 ఈవెంట్లో కిషన్ గంగోలి, పారా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ (ఎస్‌ఎల్3)లో పారుల్ పర్మార్, పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్55)లో నీరజ్‌యాదవ్, పురుషుల క్లబ్ త్రోలో అమిత్‌కుమార్ స్వర్ణ పతకాలు సాధించారు.
కీర్తనకు ప్రపంచ స్నూకర్ టైటిల్ భారత క్రీడాకారిణి కీర్తన పాండ్యన్ ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను గెలిచింది. ఫైనల్‌లో కీర్తన అల్బినా లెస్‌చుక్ (బెలారస్)ను ఓడించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section