Type Here to Get Search Results !

Vinays Info

కరెంట్ అఫైర్స్

Top Post Ad


Telangana
Hyderabad.jpg

హైదరాబాద్ ప్రపంచ నెం.1

స్వల్ప కాలంలో వృద్ధిపరంగా అంతర్జాతీయ టాప్-30 నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బెంగళూరు ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పుణె (4), ఢిల్లీ (8), చెన్నై (14), ముంబై (20) ఉన్నాయి. జేఎల్‌ఎల్ (జోన్స్ లాంగ్ లాసల్లే) అనే ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ 2018 ఏడాదికిగాను ఈ సిటీ మూమెంటమ్ ఇండెక్స్‌ను రూపొందించింది. ఈ ఇండెక్స్‌లో భారత నగరాలు ఆధిపత్యం ప్రదర్శించాయి. జేఎల్‌ఎల్ సంస్థ పట్టణాల ఆర్థికవృద్ధి, రియల్టీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది.

పంచాయతీరాజ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలోనే జరుగుతుంది. పంచాయతీ రిజర్వేషన్లను ఐదేండ్ల నుంచి పదేండ్లకు పెంచారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తారు. పరిశ్రమల స్థాపనకు పంచాయతీ NOC అవసరం లేదు. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్‌కు ఉమ్మడి చెక్‌పవర్ కల్పించారు. తప్పుచేసిన సర్పంచ్‌పై చర్య తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంటుంది.

Sports
shooting.jpg

షూటింగ్‌లో భారత్‌కు 9 స్వర్ణాలు

సిడ్నీలో జరిగిన జూనియర్స్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ 22 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. వాటిలో 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. చైనా 25 పతకాలతో మొదటి స్థానంలో ఉంది.

ఏప్రిల్ 7 నుంచి IPL 11వ సీజన్ ప్రారంభం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 11వ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఐపీఎల్‌కు రాజీవ్‌శుక్లా చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఐపీఎల్‌కు మూడేండ్లపాటు స్పాన్సర్‌గా కొనసాగేందుకు టాటా మోటార్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు జరిగిన 10 ఐపీఎల్ టోర్నీల్లో అత్యధికంగా 3 సార్లు ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. చెన్నై సూపర్‌కింగ్స్ 2 సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 సార్లు ట్రోఫీ గెలుచుకున్నాయి. హైదరాబాద్ దక్కన్ చార్జర్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

స్మిత్, వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై మార్చి 29న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.

ముక్కోణపు టీ20 విజేత ఆస్ట్రేలియా

భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరిగిన ముక్కోణపు టీ20 క్రికెట్ టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.

International
international.jpg

అత్యంత పొడవైన సముద్ర వంతెన

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను మార్చి 29న ప్రారంభించారు. దక్షిణ చైనాలోని జుహాయ్‌ను హాంకాంగ్‌తో కలుపుతూ 55 కిలోమీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. దీని కోసం 98 వేల కోట్లు ఖర్చుచేశారు. 4.20 లక్షల టన్నుల స్టీల్‌ను ఉపయోగించారు. ఈ వంతెన 120 ఏండ్లవరకు ఉపయోగపడనుంది.

మయన్మార్ అధ్యక్షుడుగా విన్ మ్యింట్

మార్చి 29న మయన్మార్ నూతన అధ్యక్షుడిగా విన్ మ్యింట్ ఎన్నికయ్యారు. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు ఆంగ్‌సాన్ సూకీకి ఈయన అత్యంత సన్నిహితుడు. మాజీ అధ్యక్షుడు హితిన్ క్యావ్ పదవికి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.

ఐదున్నరేండ్ల తర్వాత స్వదేశానికి మలాలా

పాకిస్థాన్ బాలిక, 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ ఐదున్నరేండ్ల తర్వాత (మార్చి 29న) స్వదేశంలో అడుగుపెట్టింది. 2012 అక్టోబర్‌లో తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్న తర్వాత ఆమె పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

చప్పట్లతో ప్రపంచ రికార్డు

ఫ్లోరిడాకు చెందిన 9 ఏండ్ల బాలుడు సెవెన్ వేడ్ మార్చి 29న ఒక నిమిషంలో 1080 చప్పట్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు 1020 చప్పట్లతో ఈలీ బిషప్ పేరిట ఉంది.

జైల్లో అగ్నిప్రమాదం.. 68 మంది మృతి

వెనిజులాలోని కరాబోబో స్టేట్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆధీనంలో ఉన్న వాలెన్షియా నగర జైలులో మార్చి 29న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 66 మంది ఖైదీలు సహా మొత్తం 68 మంది మృతిచెందారు.

మార్స్‌పై పరిశోధనకు నాసా వ్యోమనౌక

అంగారకుడి అంతర్భాగం ఎలా ఉన్నదో నిశితంగా పరిశీలించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ ఏడాది మే 5న ఇన్‌సైట్ అనే వ్యోమనౌకను పంపనుంది.

మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో నెంబర్‌వన్‌గా చైనా

ప్రపంచ మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. భారత్ రెండో స్థానంలో ఉంది.

ముగిసిన హాకింగ్ అంత్యక్రియలు

మార్చి 31న ప్రముఖ భౌతికశాస్త్ర శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంత్యక్రియలు ముగిశాయి. గాన్విలే అండ్ కయూస్ కళాశాల, సెయింట్ మేరి చర్చిల సమీపంలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. సంప్రదాయ క్రైస్తవ పద్ధతిలో హాకింగ్ అంత్యక్రియలు నిర్వహించారు.

సముద్రంలో కూలిన చైనా అంతరిక్ష కేంద్రం

రోదసి నుంచి భూవాతావరణంలోకి చేరి కలవరపెట్టిన చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-1 ఈ ఉదయం 5.16 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని చైనా, అమెరికా అంతరిక్ష సంస్థలు వెల్లడించాయి.

National
RahulDravddid.jpg

కర్ణాటక ఎన్నికల ప్రచారకర్తగా ద్రవిడ్

కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. ఇందులో భాగంగా ద్రవిడ్ నేను ఓటేస్తా, మీరు ఓటేయండి అంటూ వీడియో సందేశమిచ్చారు. 2018 మే 12న కర్ణాటక అసెంబ్లీ (మొత్తం 224 నియోజకవర్గాలు) ఎన్నికలు జరుగనున్నాయి.

ఆయుష్మాన్ భారత్ సీఈవో ఇందు భూషణ్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేంద్ర ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇందు భూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 27న కేంద్రం ప్రకటించింది. ఆయన రెండేండ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు ఈయన ఏడీబీ బ్యాంక్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.

పదవీ విరమణ వయస్సు పెంపు

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏండ్ల నుంచి 62 ఏండ్లకు పెంచింది. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ మార్చి 30న ఈ విషయాన్ని ప్రకటించారు.

మత ఘర్షణల్లో యూపీ అగ్రస్థానం

దేశంలో మతఘర్షణలు ఎక్కువగా జరుగుతున్న రాష్ర్టాల జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో యూపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా కర్ణాటక, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2017లో మతఘర్షణలకు సంబంధించి 19 ఘటనలు నమోదుకాగా.. వాటిలో అధికంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే జరిగాయి.

మెర్సల్ సినిమాకు బ్రిటన్ ఫిల్మ్ అవార్డు

తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమాకు విదేశీ చిత్రం కేటగిరీలో బ్రిటన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. మార్చి 30న జరిగిన వేడుకలో ఈ అవార్డును అందజేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో డబ్బింగ్ చేశారు.

ఫోర్బ్స్ ఆసియా-30లో సింధు

ఫోర్బ్స్ ఆసియా-30 అండర్ 30 పేరిట మార్చి 27 ప్రకటించిన అత్యంత ప్రభావిత ముప్పై ఏండ్లలోపు వ్యక్తుల జాబితాలో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ కింద నలుగురు భారతీయులు ఎంపికయ్యారు. వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెటర్ స్మృతి మందన, జాతీయ పోలో జట్టు కెప్టెన్ పద్మనాభ్‌సింగ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉన్నారు. 
FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.