హైదరాబాద్ శాస్త్రవేత్తకు బాబా స్మారక అవార్డు
-ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్ చంద్ జైన్‌కు హెచ్‌జే బాబా స్మారక అవార్డును కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రదానం చేశారు. జైన్ హైదరాబాద్ డీఆర్‌డీఎల్‌లో పనిచేస్తున్న ఆయన ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ రంగంలో చేసిన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది. ఇంఫాల్‌లో జరిగిన 105వ సైన్స్ కాంగ్రెస్‌లో అవార్డు ప్రదానం జరిగింది.
సీఐఐ చైర్మన్‌గా సంజయ్‌సింగ్
-2018-19 ఏడాదికిగాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ చైర్మన్‌గా సంజయ్‌సింగ్, వైస్ చైర్మన్‌గా డీ రాజు ఎన్నికయ్యారు.ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
-రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 12న ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ను మార్చి 15న ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసనమండలిలో సమర్పించారు.పెంచిన కళ్యాణ లక్ష్మీ
-నిరుపేదల పెండ్లి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకు ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు రూ. 51 వేలు ఇచ్చారు. తర్వాత దీన్ని రూ. 75 వేలకు పెంచారు. ఇకనుంచి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ సాహాయాన్ని రూ. 1,00, 116/- పెంచారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 3 లక్షల 65 వేలమంది మహిళలకు లబ్ధి చేకూరింది.నేపాల్ అధ్యక్షురాలిగా భండారీ
-నేపాల్‌లో మార్చి 14న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విద్యా దేవి భండారీ ఎన్నికయ్యారు. లెఫ్ట్ కూటమికి చెందిన భండారీ నేపాలీ, కాంగ్రెస్ అభ్యర్థి కుమారి లక్ష్మీరాయ్‌పై విజయం సాధించారు. భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టారు.
చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్
-చైనా అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. చైనా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రెండుసార్లు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల చైనా పార్లమెంట్ నిర్ణయం తీసుకున్నది. దీంతో రెండోసారి ఎన్నికైన జిన్‌పింగ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం లభించింది. దీంతోపాటు చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధినేతగా కూడా జిన్‌పింగ్ ఎంపికయ్యారు. ప్రధానిగా లీ కెకియాంగ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈయన ప్రధాని హోదాలో దేశ ఆర్థిక వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి పుతిన్
-రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్ పుతిన్ తిరిగి ఎన్నికయ్యారు. మార్చి 18న జరిగిన ఎన్నికల్లో ఆయన 76.67 శాతం ఓట్లు పడినట్లు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో పుతిన్ 2024 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఇది నాలుగోసారి. 1999లో పుతిన్ తొలిసారిగా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జోసఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేత పుతిన్.
స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత
-ప్రముఖ ఖగోళ, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) మార్చి 14న మరణించారు. 1942, జనవరి 8న హాకింగ్ జన్మించారు. ఆయనకు వచ్చిన అవార్డుల్లో ప్రధానమైనవి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు, వోల్ఫ్ ప్రైజ్, ద కోప్లీ మెడల్, ది ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్, కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్స్‌లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, గోల్డ్ మెడల్ ఆఫ్ రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ తదితర పురస్కారాలు వచ్చాయి. హాకింగ్ బ్రిటిష్ పౌరుడైనప్పటికీ 2009లో అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడంతో ఆయన్ను సత్కరించారు.

-భారత్‌తో అనుబంధం: 2001లో హాకింగ్ భారత్‌లో 16 రోజులపాటు పర్యటించారు. ముంబైలోని టీఐఎఫ్‌ఆర్‌లో ఒక సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. సరోజిని దామోదర్ ఫెలోషిప్‌తో ఆయన్ను సత్కరించారు.
-హాకింగ్ రాసిన పుస్తకాలు: మై బ్రీఫ్ హిస్టరీ, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, ది గ్రాండ్ డిజైన్, యూనివర్స్ ఇన్ ఏ నట్‌షెల్, జార్జ్‌స్ సీక్రెట్ కీ టు యూనివర్స్.
-పరిశోధనలు: సింగుల్యారిటీ, కృష్ణ బిలాలపై, ఇన్ఫర్మేషన్ పారాడాక్స్, అనంత విశ్వం - కాలం తదితర అంశాలపై ఆయన పరిశోధనలు చేశారు.
ప్రపంచ షూటింగ్‌లో భారత్ టాప్
-మెక్సికోలో మార్చి 12న ముగిసిన షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచింది. టోర్నిలో భారత క్రీడాకారులు స్వర్ణాలు-4, రజతం- 1, కాంస్యం -1 సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
ఐటీఎఫ్ విజేత అంకిత రైనా
-అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్‌ను భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా కైవసం చేసుకుంది. మార్చి 17న గ్వాలియర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అంకిత సెంకండ్ సీడ్ అమాన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్) పై విజయం సాధించింది.నిదహస్ ట్రోఫీ భారత్ కైవసం
-శ్రీలంకలో జరిగిన నిదహస్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దినేష్ కార్తీక్‌కు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వాషింగ్టన్ సుందర్‌కు లభించాయి.ఇరానీ కప్ విజేత విదర్భ
-నాగ్‌పూర్‌లో జరిగిన ఇరానీ ట్రోఫీని విదర్భ జట్టు కైవసం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విదర్భ జట్టు 410 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీని కూడా విదర్భ జట్టు సొంతం చేసుకున్నది.ఆల్ ఇంగ్లండ్ చాంప్ తై జు యింగ్
-ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాండ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను తై జు యింగ్ (చైనీస్ తైపీ) కైవసం చేసుకుంది. ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచిపై తై జు విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యుకి (చైనా) కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో లిన్‌డాన్‌పై షియుకి విజయం సాధించాడు.మహానది వివాదంపై ట్రిబ్యునల్
-మహానది జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలవననరుల మంత్రిత్వశాఖ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య మహానది జలాల వివాదం నడుస్తున్నది. ఈ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్‌విల్‌కర్‌ను నియమించింది.
Social Plugin