Type Here to Get Search Results !

Vinays Info

Rivers | నదులు

నదులు

నదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం- పాటమాలజీ
సరస్సులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం- లిమ్నాలజీ
నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం- హైడ్రాలజీ
ప్రపంచ నదుల దినోత్సవం- సెప్టెంబర్ చివరి ఆదివారం
ప్రపంచ నీటి దినోత్సవం- మార్చి 22
భారతదేశ నదీ వారం- నవంబర్ 24-27 (ఇది మొదటిసారి ఢిల్లీలో 2014లో జరిగింది)
రాష్ట్ర భూభాగం వాయవ్యాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ వాయవ్యం నుంచి ఆగ్నేయం వైపు ఉంటుంది.
రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు- గోదావరి, కృష్ణా, మంజీర, మూసీ, తుంగభద్ర
గోదావరి నది:

పొడవు- 1465 కి.మీ. (910 మైళ్లు)
ప్రవహించే రాష్ర్టాలు- మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
పరివాహక రాష్ర్టాలు- మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి
జన్మస్థలం- పశ్చిమ కనుమలు/సహ్యాద్రి పర్వతాల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్దగల నాసిక్ త్రయంబకేశ్వరంలోని బిల సరస్సు సముద్ర మట్టం నుంచి ఎత్తు- 920 మీ. (3018 అడుగులు)
రాష్ట్రంలోని గోదావరి మొత్తం పొడవు- 550 కి.మీ.
గోదావరి నది పరివాహక ప్రాంతం దేశ భూభాగంలోని 10 శాతం భూభాగాన్ని ఆక్రమించింది.
ఇది దేశంలో రెండో పొడవైన నది
ఇది దక్షిణభారతదేశంలో పొడవైన నది
ఈ నదికి వృద్ధ గంగ, దక్షిణ గంగ, ఇండియన్ రైన్ అని పేర్లు ఉన్నాయి.
ఈ నది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మంజీర, హరిద్రా నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పర్చింది.
అంతేకాకుండా జయశంకర్ – భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత, మానేరు నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పర్చింది.
నదీ ప్రవాహం: గోదావరి నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసికా త్రయంబకేశ్వరం వద్ద జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద ప్రవేశించి [27/01, 2:32 p.m.] VINAY KUMAR: నిర్మల్  జిల్లా బాసర గుండా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ప్రవహిస్తూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (పోచంపాడు)ను దాటి నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ – భూపాలపల్లి, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తూ పాపికొండలను చీలుస్తూ బైసన్ గార్జ్‌ను ఏర్పర్చి పోలవరం (తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులో) వద్ద విశాలమైదానంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహిస్తూ రాజమండ్రికి దిగువభాగాన, ధవలేశ్వరం వద్ద 5 ప్రధాన పాయలు (మొత్తం 7 పాయలు)గా చీలి ఒక్కో పాయ ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి.
పాయలు
1) గౌతమి – ఉత్తర శాఖ యానాం వద్ద
2) వశిష్ట – మధ్య శాఖ అంతర్వేది వద్ద
3) వైనతేయ – దక్షిణ శాఖ కొమరగిరి పట్నం వద్ద
4) తుల్య
5) భరద్వాజ – బెండమూరులంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి.
తుల్య, భరద్వాజ పాయల మధ్యలోకి కౌశిక, ఆశ్రేయ అనే పాయలు చేరి ఒకేపాయగా ప్రవహిస్తూ బెండమూరులంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
గోదావరి నదికి ఎడమవైపు జిల్లాలు – నిర్మల్, మంచిర్యాలకుడివైపు జిల్లాలు – నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ – భూపాలపల్లి
ఉప నదులు –
ప్రవర (మహారాష్ట్ర)
మంజీర (తెలంగాణ)
పెద్దవాగు (తెలంగాణ)
మానేరు (తెలంగాణ)
కిన్నెరసాని (తెలంగాణ)
పూర్ణ (మహారాష్ట్ర)
పెన్‌గంగ (తెలంగాణ)
వార్ధా (తెలంగాణ)
వెయిన్‌గంగ (తెలంగాణ)
ప్రాణహిత (తెలంగాణ)
ఇంద్రావతి (తెలంగాణ)
శబరి (తెలంగాణ)
సీలేరు (ఏపీ)
తాలిపేరు (ఏపీ)
తెలంగాణలో కుడివైపు నుంచి కలిసే ఉపనదులు: 1) మంజీర 2) మానేరు 3) పెద్దవాగు 4) కిన్నెరసాని
ఎడమవైపు నుంచి కలిసే ఉపనదులు: 1) ప్రాణహిత 2) ఇంద్రావతి 3) శబరి 4) సీలేరు

మంజీర నది:

మొత్తం పొడవు- 644 కి.మీ.
ఈ నది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లోని జామ్‌ఖేడ్‌కొండ (భీడ్ జిల్లాలోని పటోడా తాలూకా) వద్ద జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు ఎగువన ప్రవేశించి మెదక్ జిల్లాలో ప్రవహిస్తూ కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టును దాటి నిజామాబాద్ జిల్లా గుండా ప్రవహిస్తూ కందకుర్తి (NZB) వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
నిజాంసాగర్ ప్రాజెక్టు:

నిర్మాణ ప్రదేశం- కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట-బంజపల్లి గ్రామాల మధ్య నిర్మించారు.
దీని నిర్మాణం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1923-1931) కాలంలో జరిగింది.
ఈ ప్రాజెక్టును మంజీర నదిపై నిర్మించారు.
ఇది నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు అధికంగా సాగునీరందిస్తుంది.
దీని పరివాహక ప్రాంతం- 21,694 చ.కి.మీ.
ఆయకట్టు సామర్థ్యం- 2.31 లక్షల ఎకరాలు
దీని కుడి కాలువ- మహబూబ్‌నహర్, ఎడమ కాలువ- ఫతేనహర్
ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం : హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడం.
ఇది గోదావరి ఉపనదుల్లో కెల్లా పొడవైనది, ముఖ్యమైనది.

కౌలాస్‌నాలా ప్రాజెక్టు:

ఇది సావర్‌గావ్ గ్రామంలో ఉంది.
ఈ ప్రాజెక్టు కౌలాస్‌నాలా నదిపై ఉంది.
ఆయకట్టు సామర్థ్యం – 9000 ఎకరాలు
నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత లేకపోవడంతో దానికి ఎగువన సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు.
సింగూరు ప్రాజెక్టు
(మొగులిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు)

దీన్ని సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద మంజీర నదిపై నిర్మించారు.
దీని ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీరు అందించడం.
రాష్ట్ర చిహ్నాలు:

రాష్ట్ర పక్షి – పాలపిట్ట (శాస్త్రీయనామం – కొరాషియస్ బెంగాలెన్సిస్)
రాష్ట్ర జంతువు – మచ్చల జింక (శాస్త్రీయనామం – ఆక్సిస్ ఆక్సిస్)
రాష్ట్ర వృక్షం – జమ్మిచెట్టు (శాస్త్రీయనామం -ప్రోసోఫిస్‌సినరేరియా)
రాష్ట్ర పుష్పం – తంగేడు (శాస్త్రీయనామం  – కేసియా అరిక్యులేటా)
రాష్ట్ర పండు -సీతాఫలం (శాస్త్రీయనామం  – అనోనా స్కామోజా)
రాష్ట్ర చిహ్నం – కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత్వం,సత్యమేవ జయతే ఉన్నాయి.
రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన చిత్రకారుడు – ఏలె లక్ష్మణ్
రాష్ట్ర అధికారిక మాసపత్రిక – తెలంగాణ
రాష్ట్ర అధికారిక చానల్ – యాదగిరి
రాష్ట్ర అధికారిక పండుగలు – బతుకమ్మ, బోనాలు
బోనంలో ఉండే ఆహారం – పెరుగన్నం
లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ మహంకాళి బోనాలు), హైదరాబాద్ బోనాలు.
పాలపిట్ట ఒడిశా, బీహార్‌లకు కూడా రాష్ట్ర పక్షే
జమ్మి చెట్టు ఆకులను దసరా పండుగ సమయంలో బంగారం అంటారు. సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా బంగారం అని బెల్లంను పిలుస్తారు.
తంగేడు పూలను బతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.
తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం – గటుక, వరి అన్నం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section