శీతాకాలంలో వాతావరణం మిట్టమధ్యాహ్నం పొడిగాను, ఉదయం మంచుకురవడం జరుగుతుంది. శీతాకాలం నవంబర్ చివరలో మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. జనవరి నెలనాటికి ఈశాన్య రుతుపవనాల తీవ్రత బాగా హెచ్చుగా ఉంటుంది. ఈ పవనాలు మార్చి వరకు వీస్తాయి. ఈ శీతాకాలంలో పీఠభూమి ప్రాంతం అయిన తెలంగాణ రాష్ట్రం అంతటా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శీతాకాలంలో గాలిలో స్వల్ప తేమ కలిగి సగటు ఉష్ణోగ్రతలు 22-23°C వరకు ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత 29°C కాగా అత్యల్పం 12°C వరకు నమోదవుతాయి. చలికాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్లో తక్కువ ఉష్ణోగ్రత (4°C) నమోదవుతాయి. డిసెంబర్ నెలలో పశ్చిమ తెలంగాణ రాష్ట్రం నుంచి తూర్పు వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పశ్చిమ తెలంగాణ జిల్లాలు, జోగులాంబ, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ లో ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయి.
తెలంగాణా లో శీతాకాలం | Winter in Telangana State
January 04, 2023
Tags